తెలుగు సాంస్కృతిక సంవత్సరం

1975 సంవత్సరం తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా పేరుపొందింది. ఆ సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించింది.[1]

నేపథ్యం మార్చు

 
అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు

సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుతున్న తెలుగు సంస్కృతిని తెలుగుదేశపు నలుచెరగులా పరిమితము చేసే సంకల్పంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్టుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు పేర్కొన్నారు.[1]

కార్యకలాపాలు మార్చు

1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఇవి ఉగాది పర్వదినాలలో ఏప్రిల్ 12 నుండి 18 వరకు లాల్ బహదూర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ప్రారంభసభకు మా తెలుగు తల్లికి మల్లె పూదండ ప్రార్థనగీతాన్ని పాడేందుకు లండన్ నుండి టంగుటూరి సూర్యకుమారి ని ప్రత్యేకంగా పిలిపించారు. ఈ సభలకు ప్రతిరోజు సుమారు లక్ష మంది ప్రజలు వచ్చివుంటారని అంచనా.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 రామానుజరావు, దేవులపల్లి (17 మార్చి 1975). తెలుగు నవల (ముందుమాట). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. p. iii.