తెహ్రీ డ్యామ్ (Tehri Dam) 260.5 మీటర్ల (855 అడుగులు) ఎత్తుతో ఉన్న భారతదేశంలోనే అత్యంత ఎత్తైన డ్యామ్. 2400 మెగావాట్ల ప్రణాళిక స్థాపిత సామర్థ్యంతో భారతదేశంలో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రం గా ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలోని ఎత్తైన డ్యాముల జాబితాలో 10 స్థానంలో ఉంది. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లా, న్యూ తెహ్రీలో భాగీరథి నదిపై ఎర్త్-ఫిల్ ఆనకట్ట.[1]

Tehri Dam
Tehri dam, Uttarakhand in 2008; dam is 800 feet
తెహ్రీ డ్యామ్ is located in Uttarakhand
తెహ్రీ డ్యామ్
Uttarakhand లో Tehri Dam స్థానం
దేశంIndia
ప్రదేశంNew Tehri, Tehri Garhwal district, Uttarakhand, India
అక్షాంశ,రేఖాంశాలు30°22′40″N 78°28′50″E / 30.37778°N 78.48056°E / 30.37778; 78.48056
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం1978
ప్రారంభ తేదీ2006
నిర్మాణ వ్యయంUS $2.5 billion
యజమానిTHDC INDIA LIMITED
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంEmbankment, earth and rock-fill
నిర్మించిన జలవనరుBhagirathi River
Height260.5 మీ. (855 అ.)
పొడవు575 మీ. (1,886 అ.)
Width (crest)20 మీ. (66 అ.)
Width (base)1,128 మీ. (3,701 అ.)
Spillways2
Spillway typeGate controlled
Spillway capacity15,540 m3/s (549,000 cu ft/s)
జలాశయం
మొత్తం సామర్థ్యం3.54 కి.మీ3 (2,870,000 acre⋅ft) (125.03 tmc ft)
ఉపరితల వైశాల్యం52 కి.మీ2 (20 చ. మై.)
విద్యుత్ కేంద్రం
Commission date2006
TypeP no
టర్బైన్లుFrancis pump turbines
Installed capacity1,000 MW (1,300,000 hp)
Max. planned: 2,400 MW

చరిత్ర

మార్చు

1961 సంవత్సరంలో తెహ్రీ డ్యామ్ ప్రాజెక్టు కోసం పైలట్ సర్వే చేసి, రూపకల్పన 1972 సంవత్సరంలో పూర్తయింది. ఈ అధ్యయనం ఆధారంగా 600 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంట్ కు ఆమోదం లభించింది. అయితే సాధ్యాసాధ్యాల అధ్యయనాల తరువాత 1978 సంవత్సరంలో మాత్రమే నిర్మాణం ప్రారంభమైంది, అయితే ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రభావాల కారణంగా ఆలస్యమైంది. 1986 సంవత్సరంలో, పూర్వం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా (యు.ఎస్.ఎస్.ఆర్) తెహ్రీ డ్యామ్ కు సాంకేతిక,ఆర్థిక సహాయం చేయడం జరిగింది కాని యు.ఎస్.ఎస్.ఆర్ లో రాజకీయ అస్థిరత కారణంగా అంతరాయం కలిగింది. అయితే భారత ప్రభుత్వం తెహ్రీ డ్యామ్ ప్రాజెక్టును ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖకు అప్పగించారు. [2]

సాంకేతిక విషయాలు

మార్చు

తెహ్రీ డ్యామ్ సుమారు 260.5 మీటర్లు (855 అడుగులు) ఎత్తైన రాతి, ఎర్త్-ఫిల్ డ్యామ్. ఈ ప్రాజెక్ట్ పొడవు 575 మీటర్లు (1,886 అడుగులు), క్రెస్ట్ వెడల్పు 20 మీటర్లు (66 అడుగులు), బేస్ వెడల్పు 1,128 మీటర్లు (3,701 అడుగులు). ఈ ఆనకట్ట 52 చదరపు కిలోమీటర్లు (20 చదరపు మీటర్లు) ఉపరితల వైశాల్యంతో 2.6 క్యూబిక్ కిలోమీటర్ల (2,100,000 ఎకరాల చదరపు అడుగులు) జలాశయాన్ని సృష్టిస్తుంది. స్థాపిత జలవిద్యుత్ సామర్థ్యం 1,000 మెగావాట్లతో పాటు అదనంగా 1,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్. తెహ్రీ ఆనకట్ట, తెహ్రీ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ తెహ్రీ డ్యామ్ జలవిద్యుత్ సముదాయంలో భాగంగా ఉన్నాయి, ఇందులో 400 మెగావాట్ల కోటేశ్వర్ ఆనకట్ట కూడా ఉంది. ప్రస్తుతం, టిహెచ్ డిసి ఇండియా లిమిటెడ్ ఈ డ్యామ్ నుండి వార్షికంగా 3000 మిలియన్ యూనిట్ల విద్యుత్ శ క్తిని ఉత్ప త్తి చేస్తోంది.

తెహ్రీ డ్యామ్‌ను తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఈ డ్యామ్ దాదాపు 2400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొత్తం వ్యయం దాదాపు రూ. 8000/- కోట్లు.[3]

లాభాలు

మార్చు

తెహ్రీ డ్యామ్ నిర్మాణంతో పరిసరాల రాష్ట్రాలకు ప్రజలకు మంచి నీటి సరఫరా , వ్యవసాయం లబ్ది పొందుతున్నారు.[3]

  • 2400 మెగావాట్ల విద్యుత్తు.
  • ఢిల్లీ జనాభాకు దాదాపు 40 లక్షల మందికి తాగునీరు,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోచుట్టుపక్కల నివసిస్తున్న దాదాపు 30 లక్షల మందికి పరిశుభ్రమైన తాగునీరు.ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ లోని లోతట్టు ప్రాంతాలలో తక్కువ వరదలు.
  • స్థానిక ప్రజలకు ఉపాధి కల్పన.
  • ఉత్తరాఖండ్ రాష్ట్రంకు రాయల్టీగా ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 12%
  • ఉత్తరాఖండ్ రాష్ట్రములో పర్యాటక రంగం, ఫిష్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులలో పెరుగుదల.
  • ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి రూ.2400 కోట్ల లాభం.
  • ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ న్యూఢిల్లీలకు దాదాపు 2,70,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది.

నష్టం

మార్చు

తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ మొదటి నుంచి వివాదాల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ప్రారంభ నిరసనలు 1960 సం. చివరలో డ్యామ్ స్థలంలో సర్వేలు నిర్వహించినప్పుడు ప్రారంభమయ్యాయి. ప్రణాళికా సంఘం 1972 సంవత్సరం లో డ్యామ్కు ఆమోదం తెలిపిన తరువాత ఒక వ్యవస్థీకృత ఉద్యమం రూపుదిద్దుకుంది. 1980, 1990 లలో, అనేక కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి, అనేక మంది నిపుణులు డ్యామ్ కు అనుకూలంగా , వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ కేసు సెప్టెంబరు 2003 సంవత్సరంలో సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి, తదుపరి అధ్యయనాలను ఆదేశించింది. తెహ్రీ డ్యామ్ అధిక భూకంప జోన్ లో నిర్మించబడుతుంది అనేది ఒక అంశం. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉన్న మరొక అంశం హిమాలయ శ్రేణి భౌగోళికం. కాబట్టి డ్యామ్ నిర్మాణం బలంగా ఉన్నప్పటికీ, చుట్టుపక్కల పర్వతాలు లేవు. భూకంపం సంభవించినప్పుడు లేదా ఒక పెద్ద జలాశయం ఏర్పడటం వల్ల, ఒక పెద్ద విపత్తు సంభవించవచ్చు. ఆనకట్ట విచ్ఛిన్నం అయినట్లయితే, ఇంత ఎత్తులో నిర్మించిన రిజర్వాయర్ 22 నిమిషాల్లో ఖాళీ అవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.తద్వారా రిషికేశ్, హరిద్వార్ పూర్తిగా మునిగిపోతుందని, బిజ్నోర్, మీరట్, హాపూర్, బులంద్ షహర్ 12 గంటల్లో వరద ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.[4]

మూలాలు

మార్చు
  1. "Top Seven Hydroelectric Power Plants in India". www.blackridgeresearch.com. Retrieved 2022-06-24.
  2. Pant, Nidhi Sharma (2019-01-10). "Everything About Tehri Dam, The Highest Dam In India". www.postoast.com. Retrieved 2022-06-24.
  3. 3.0 3.1 "Tehri dam - Tehri dam Project Latest Information Portal". www.uttarakhand-tourism.com. Retrieved 2022-06-24.
  4. "Power Point". www.downtoearth.org.in. Retrieved 2022-06-24.

వెలుపలి లంకెలు

మార్చు