తేజస్విని మనోజ్ఞ

తేజస్విని మనోజ్ఞ 1994 మే 19న తెలంగాణ రాష్ట్రము లోని హైదరాబాద్ లో జన్మించారు. రోసరీ కాన్వెంట్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి, భారత సాయుధ దళాల యువజన విభాగమైన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) లో సభ్యురాలిగా ఉంది.  16 ఏళ్ల వయసులోనే భారత వైమానిక దళం, సైన్యం, నౌకాదళంలోని 1.3 మిలియన్ల క్యాడెట్లలో 'ఇండియాస్ బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్', 'బెస్ట్ షూటర్'గా ఎంపికయ్యారు. శ్రీలంకలో జరిగిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సమావేశంలో తేజస్వినిని యంగ్ అచీవర్ అవార్డుతో సత్కరించారు[1].

డాక్టర్ బి. తేజస్విని మనోజ్ఞ
అందాల పోటీల విజేత
జననము (1994-05-19) 1994 మే 19 (వయసు 29)
హైదరాబాద్, తెలంగాణ , భారతదేశం
విద్యఎం బి బి ఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
వృత్తి
  • డాక్టర్
  • మాడల్l
జుత్తు రంగుBlack
కళ్ళ రంగుBrown
ప్రధానమైన
పోటీ (లు)

జీవితం మార్చు

తేజస్విని మనోజ్ఞ 1994 మే 19న హైదరాబాద్ లో జన్మించారు. రోసరీ కాన్వెంట్ హైస్కూల్లో విద్యాభ్యాసం చేసి, 2017లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తేజస్విని ప్రస్తుతం వైద్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోంది. మనోజ్ఞ భరతనాట్య నృత్యకారిణి. జాతీయ స్థాయిలో దూరదర్శన్, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుండి గ్రేడెడ్ ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా ఆమె జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ పీ జె అబ్దుల్ కలాం ముందు భరతనాట్యం ప్రదర్శించి ప్రశంసలను పొందింది. మనోజ్ఞ ఒక నాట్యకారిణే   కాకుండా, గాయని కూడా. దేశవిదేశాల్లో అనేక కచేరీలు, వర్క్ షాప్ ఇవ్వడం జరిగింది. మనోజ్ఞ  పాడి, నటించిన ఆల్బమ్ సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. తేజస్విని యోగా టీచర్ కూడ.  2017లో మిస్ దివా - 2017 పోటీల కోసం మనోజ్ఞ ఆడిషన్ నిర్వహించింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. మిస్ ఎర్త్ ఇండియా 2019 కిరీటాన్ని గెలుచుకున్న మనోజ్ఞ మిస్ ఎర్త్ 2019 పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, ఫిలిప్పీన్స్లో జరిగిన పోటీలో పాల్గొన్నది [2]. తేజస్విని మనోజ్ఞ విహహం తిరుపతి కి చెందిన భారత ప్రభుత్వ పరిపాలన సేవలకు చెందిన పవన్ దత్త, ఐ ఎ ఎస్ (మహారాష్ట్ర కేడర్) తో విహహం జరిగింది[3].

ప్రతిభ మార్చు

తేజస్విని మనోజ్ఞ అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, సార్క్ దేశాల్లో భారత పతాకాన్ని ఎగురవేస్తూ అంతర్జాతీయ స్థాయిలో యూత్ అంబాసిడర్ గా భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. మిస్ ఇండియా ఎర్త్ 2019 కిరీటాన్ని సొంతం చేసుకున్న తేజస్విని మనోజ్ఞ మిస్ ఇంటెలిజెంట్ అండ్ మిస్ టాలెంటెడ్- మిస్ ఎర్త్, గ్లోబల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డు గ్రహీత (వరల్డ్ వైడ్) గా మూడు బంగారు పతకాలు సాధించి భారత ప్రధాని, రాష్ట్రపతి చేతుల మీదుగా సన్మానించబడిన 'బ్యూటీ విత్ ఎ పర్పస్ విన్నర్'గా నిలిచింది[4].

మూలాలు మార్చు

  1. Desk, TFIPOST News (2022-04-14). "Miss Earth 2019 Tejaswini Manogna Biography, Career and Facts". Tfipost.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-21.
  2. Mary, S. B. Vijaya (2017-09-21). "Hyderabad girl Tejaswini Manogna is one of the finalists at the Ms Diva Universe Contest". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-21.
  3. "ఒకరు చదువులో మిన్న, మరొకరు సేవలో గొప్ప (ఫొటోలు)". Sakshi. 2024-02-27. Retrieved 2024-03-10.
  4. "Tejaswini Manogna Balancing Professional Life and Passion | Dr. Tejaswini Manogna - Happy HO". happyho.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-05-03. Retrieved 2023-12-21.