తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్
తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ (జననం 21 నవంబర్ 1987) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మెయిన్‌పురి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ | |||
పదవీ కాలం 13 సెప్టెంబర్ 2014 – 23 మే 2019 | |||
ముందు | ములాయం సింగ్ యాదవ్ | ||
---|---|---|---|
తరువాత | ములాయం సింగ్ యాదవ్ | ||
నియోజకవర్గం | మెయిన్‌పురి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సైఫాయ్ , ఇటావా , ఉత్తరప్రదేశ్ | 1987 నవంబరు 21||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సమాజ్ వాదీ పార్టీ | ||
తల్లిదండ్రులు | రణవీర్ సింగ్ యాదవ్, మృదులా యాదవ్ | ||
జీవిత భాగస్వామి | రాజ్ లక్ష్మి యాదవ్ (m. 2015) | ||
నివాసం | సైఫాయ్ , ఇటావా , ఉత్తరప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి |
| ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుతేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ 21 నవంబర్ 1987న రణవీర్ సింగ్ యాదవ్, మృదులా యాదవ్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను, పూర్తి చేసి, 2009లో లండన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఆ తర్వాత 2018లో నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో బి.కామ్ పూర్తి చేశాడు.[5]
బంధుత్వాలు
మార్చుతేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అన్న రతన్ సింగ్ యాదవ్ మనవడు. ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రాజ్ లక్ష్మి యాదవ్‌ను 2015లో వివాహం చేసుకున్నాడు.
రాజకీయ జీవితం
మార్చుతేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ 2002లో తన తండ్రి రణ్‌వీర్ సింగ్ యాదవ్ మరణం తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2014 లోక్‌సభ ఎన్నికలలో మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ షాక్యాపై 3,21,249 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా, సామాజిక న్యాయ & సాధికారతపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్ శాసనసభ స్థానానికి 2024 నవంబర్ 13న జరగనున్న ఉప ఎన్నికకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.[6]
మూలాలు
మార్చు- ↑ "कौन हैं तेज प्रताप यादव? जिन्हें अखिलेश यादव ने कन्नौज से मैदान में उतारा, बिहार से खास कनेक्शन". 22 April 2024. Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ The Indian Express (17 September 2014). "Fifth of family joins SP chief in Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ "Family ties: Big, fat Yadav wedding made in political heaven". 14 December 2014. Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ India Today (26 July 2014). "Mulayam Singh Yadav fields grand-nephew Tej Pratap for Mainpuri Lok Sabha bypolls" (in ఇంగ్లీష్). Archived from the original on 8 October 2024. Retrieved 8 October 2024.
- ↑ Zee News (21 October 2024). "कौन हैं तेज प्रताप सिंह यादव?, अखिलेश यादव ने लालू प्रसाद यादव के दामाद को करहल से बनाया उम्मीदवार". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ TV9 Bharatvarsh (21 October 2024). "लालू के दामाद, अखिलेश के भतीजे... जानें कौन हैं करहल से सपा प्रत्याशी तेज प्रताप सिंह यादव" (in హిందీ). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)