తేతల రామారెడ్డి ( చిన్నబ్బాయి)
చిన్నబ్బాయిగా సుపరిచితులు అయిన తేతల రామారెడ్డి అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.
జీవిత విశేషాలు
మార్చుచిన్నబ్బాయి 1937 ఏప్రిల్ 26 న అనపర్తి మండలంలోని అనపర్తి గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి తేతల రామిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, తల్లి మంగయమ్మగారు. చిన్నబ్బాయి గారికి ముగ్గురు సోదరులు, నలుగురు సోదరిమణులు .చిన్నబ్బాయి గారు 1 నుంచి 5వ తరగతి వరకు బాపనమ్మ గుడి దగ్గర ఉండె పాఠశాలలోనూ ఆ తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలోనూ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత వ్యాపారం మీద మక్కువతో అటువైపు ముందుకుసాగారు . ఆ తర్వాత బుల్లెమ్మయిగారితో వివాహం జరిగింది .వీరికి 5 సంతానం
శాసన సభ్యునిగా
మార్చు- 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లనిల్లి మూలారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించాడు.[1]
- 2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అనపర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీఅభ్యర్థి నల్లనిల్లి మూలారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించాడు.[2]
మరణం
మార్చుతేతలి రామారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ 29 సెప్టెంబర్ 2019న మరణించాడు. [3][4][5]
మూలాలు
మార్చు- ↑ ఎన్నికల ఫలితాలు
- ↑ ఎన్నికల ఫలితాలు 2004[permanent dead link]
- ↑ HMTV (29 September 2019). "మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నుమూత". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ 10TV (29 September 2019). "అనపర్తి మాజీ ఎమ్మెల్యే కన్నుమూత" (in telugu). Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (30 September 2019). "అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి కన్నుమూత". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.