అనపర్తి శాసనసభ నియోజకవర్గం
అనపర్తి శాసనసభ నియోజకవర్గం పరిధి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలలో ఉంది. ఇది రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 16°55′48″N 81°57′36″E |
నియోజకవర్గం పరిధిలోని మండలాలు
మార్చునియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]
1951లో ఏర్పాటైన అనపర్తి నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా మూడు సార్లు మినహా మిగతా 12 పర్యాయాలు ఇక్కడ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2019 40 అనపర్తి జనరల్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పు వై.కా.పా 111771 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పు తె.దే.పా 56564 2014 159 అనపర్తి జనరల్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి[2] పు తె.దే.పా 83398 సత్తి సూర్యనారాయణ రెడ్డి పు వై.కా.పా 82025 2009 159 అనపర్తి జనరల్ నల్లమిల్లి శేషారెడ్డి పు కాంగ్రేష్ 70623 Gollala Mamidada D.R.K.Reddy పు ప్రజారాజ్యం 34749 2004 50 అనపర్తి జనరల్ తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 61194 నల్లమిల్లి మూలారెడ్డి పు తె.దే.పా 32466 1999 50 అనపర్తి జనరల్ నల్లమిల్లి మూలారెడ్డి పు తె.దే.పా 47786 తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 46800 1994 50 అనపర్తి జనరల్ నల్లమిల్లి మూలారెడ్డి పు తె.దే.పా 48281 తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 42281 1989 50 అనపర్తి జనరల్ తేతల రామారెడ్డి పు కాంగ్రేష్ 48711 నల్లమిల్లి మూలారెడ్డి పు తె.దే.పా 41073 1985 50 అనపర్తి జనరల్ నల్లమిల్లి మూలారెడ్డి పు తె.దే.పా 43552 పడాల అమ్మి రెడ్డి పు కాంగ్రేష్ 35831 1983 50 అనపర్తి జనరల్ నల్లమిల్లి మూలారెడ్డి పు స్వతంత్ర 46855 పడాల అమ్మి రెడ్డి పు కాంగ్రేష్ 22951 1978 50 అనపర్తి జనరల్ పడాల అమ్మి రెడ్డి పు JNP 37261 Undavilli Satyanarayana Murty పు కాంగ్రేష్ 22982 1972 50 అనపర్తి జనరల్ Ramakrishana Chowdary V పు కాంగ్రేష్ Uncontested 1967 50 అనపర్తి జనరల్ R. C. Valluri పు కాంగ్రేస్ 25822 V. Goluguri పు స్వతంత్ర 25419 1962 55 అనపర్తి జనరల్ Palacherla Panasaramanna పు సీపిఐ 18498 Tetala Lakshminarayana Reddy పు కాంగ్రేష్ 17912 1955 47 అనపర్తి జనరల్ Tetala Lakshminirayanareddi పు PP 24926 Kuvvuri Venkatareddi పు సీపిఐ 19458
2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.రామరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి మూలరెడ్డిపై 28728 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామరెడ్డి 61194 ఓట్లు సాధించగా, మూలరెడ్డి 32466 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి[3] కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి (ఆదిత్య సంస్థల ఛైర్మెన్ ) ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.ఆర్.కె.రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున నల్లమిల్లి జ్యోతి రెడ్డి పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.[4]
2014 ఎన్నికలు
మార్చు2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత ) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు
2019 ఎన్నికలు
మార్చు2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత) తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు, మాజీ ఎమ్మెల్యే) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో డా.సత్తి సూర్యనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై 55207మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-12. Retrieved 2016-06-10.
- ↑ Eenadu (17 October 2021). "గళానికి గుర్తింపు". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009