త్రిపురనేని కమల్

త్రిపురనేని కమల్ అంతరిక్ష పరిశోధకుడు. ప్రముఖ సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మనుమడు.[1][1]

జీవిత విశేషాలు

మార్చు

తెలుగు సాహితీ వేత్త అయిన త్రిపురనేని గోపీచంద్ మనవడే ఈ కమల్. తాత సాహితీ పరిశోధకుడుగా పేరొందితే మనవడు అంతరిక్ష పరిశోధకుడుగా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఆయన హైదరాబాదులో 1981 జనవరి 5 న జన్మించారు. బ్రిటన్ లోని మిడ్ వేల్స్ స్కూల్ లో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. లండన్ విశ్వవిద్యాలయం లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రొఫెసర్ పర్యవేక్షణలో మెటీరియల్స్ కెమిస్ట్రీ గ్రూపులో పి.హెచ్.డి చేసారు.[2]

పరిశోధనలు

మార్చు

మెటల్ ఆక్సైడ్ నుంచి ఆక్సీజన్ తయారుచేయడం కమల్ పరిశోధనాంశం. పది గ్రాముల టైటానియం ఆక్సైడ్ నుంచి నాలుగు గ్రాముల ఆక్సీజన్ ఉత్పత్తి చేయడంలో ఈయన పిహెచ్‌డి చేశారు. చంద్రమండలం పై ఉన్న రాళ్ళు మెటల్ ఆక్సయిడ్‌లే కావడంతో ఇక చంద్రుని పైనే ఆక్సీజన్ తయారుచేసుకోవచ్చని కమల్ వివరిస్తున్నాడు[1][1].

అంతరిక్ష యాత్రను వాణిజ్యపరంగా మలుచుకోవడానికి చంద్రమండలం మట్టి నుండి ఆక్సిజన్ ను పారిశ్రామిక అవసరాలకు తయారుచేసే ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఎఫ్ ఎఫ్ సి కేంబ్రిడ్జి ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ వెలికి తీసే ఈ ప్రతిపాదన "రాబర్ట్ హెల్ లీన్ ప్లైట్" ఇన్ టు ఫ్యూచర్ కంటెస్టు బహుమతిని గెలుచుకుంది. 2008 జూలై ఆఖరు వారంలో ఈ బహుమతిని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది. ఈ బహుమతి క్రింద 3500 అమెరికన్ డాలర్లు, డిప్లొమా ప్రదానం చేసారు.[2][3]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "చంద్రశిలల పరిశోధకుడు - త్రిపురనేని కమల్". Retrieved 2008-02-14.
  2. 2.0 2.1 ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. 2011.
  3. "Space odyssey". No. .thehindu. SANGEETHA DEVI DUNDOO. 2008-02-25.

ఇతర లింకులు

మార్చు