థియోడర్ రూజ్‌వెల్ట్

అమెరికా 26వ అధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు.


థియోడర్ రూజ్‌వెల్ట్ జూనియర్ (అక్టోబరు 27, 1858జనవరి 6, 1919) అమెరికా రాజకీయ నాయకుడు, రచయిత, చరిత్రకారుడు, సైనికుడు, అన్వేషకుడు, వక్త. ఈయన్నే టెడ్డీ రూజ్‌వెల్ట్ లేదా టి.ఆర్ అని కూడా పిలుస్తారు. 1901 నుంచి 1909 వరకు అమెరికా 26 వ అధ్యక్షుడిగా పనిచేశాడు. అధ్యక్షుడు కాక మునుపు 1899 నుంచి 1900 దాకా33వ న్యూయార్క్ గవర్నరుగానూ, 1901 మార్చి నుంచి సెప్టెంబరు దాకా అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 20వ శతాబ్దం మొదట్లో రిపబ్లికన్ పార్టీలో ప్రధానమైన నాయకుడిగా ఎదిగి యాంటి ట్రస్ట్ పాలసీలను ముందుకు తీసుకువెళ్ళడంలో, ప్రోగ్రెసివ్ ఎరా పాలసీలను సమర్ధించడంలో ముఖ్య భూమిక వహించాడు. మౌంట్ రష్ మోర్ ప్రాంతంలో జార్జి వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అబ్రహాం లింకన్ లతో పాటు ఈయన ముఖచిత్రం చెక్కబడి ఉంది.

థియోడర్ రూజ్‌వెల్ట్
థియోడర్ రూజ్‌వెల్ట్

1915లో రూజ్‌వెల్ట్


26వ అమెరికా అధ్యక్షుడు
పదవీ కాలం
1901 సెప్టెంబరు 14 – 1909 మార్చి 4
ఉపరాష్ట్రపతి ఎవరూ లేరు
(1901–5)
చార్లెస్ వారెన్ ఫెయిర్ బ్యాంక్స్
(1905–9)
ముందు విలియం మెకన్లీ జూనియర్
తరువాత విలియం హోవార్డ్ టఫ్ట్

అమెరికా 25 వ ఉపాధ్యక్షుడు
పదవీ కాలం
1901 మార్చి 4 – 1901 సెప్టెంబరు 14
అధ్యక్షుడు విలియం మెకన్లీ జూనియర్
ముందు గ్యారెట్ హోబార్ట్
తరువాత చార్లెస్ వారెన్ ఫెయిర్ బ్యాంక్స్

న్యూయార్క్ గవర్నర్
పదవీ కాలం
1899, జనవరి 1 – 1900 డిసెంబరు 31
Lieutenant(s) తిమోతీ లెస్టర్ వుడ్రఫ్
ముందు ఫ్రాంక్ ఎస్. బ్లాక్
తరువాత బెంజమిన్ బార్కర్ ఒడెల్ జూనియర్

నేవీ అసిస్టెంట్ సెక్రటరీ
పదవీ కాలం
1897 ఏప్రిల్ 19 – 1898 మే 10
అధ్యక్షుడు విలియం మెకన్లీ జూనియర్
ముందు విలియం మెకడూ
తరువాత చార్లెస్ హెర్బర్ట్ అలెన్

వ్యక్తిగత వివరాలు

జననం (1858-10-27)1858 అక్టోబరు 27
న్యూయార్క్ నగరం, అమెరికా
మరణం 1919 జనవరి 6(1919-01-06) (వయసు 60)
కూవ్ నెక్, న్యూయార్క్, అమెరికా
రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ
ప్రోగ్రెసివ్ పార్టీ
తల్లిదండ్రులు థియోడర్ రూజ్‌వెల్ట్ సీనియర్
మార్తా బుల్లోచ్ రూజ్‌వెల్ట్
జీవిత భాగస్వామి అలీస్ హాథవే లీ
(m. 1880–84; ఆమె మరణం)
ఈడీత్ కెర్మిట్ క్యారో
(m. 1886–1919; అతని మరణం)
సంతానం
  • అలీస్ లీ రూజ్వెల్ట్
  • థియోడర్ రూజ్వెల్ట్ 3
  • కెర్మిట్ రూజ్వెల్ట్
  • ఎథెల్ క్యారో రూజ్వెల్ట్
  • ఆర్చిబాల్డ్ బుల్లోచ్ రూజ్వెల్ట్
  • క్వెంటిన్ రూజ్వెల్ట్
పూర్వ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం
కొలంబియా లా స్కూల్
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • రచయిత
  • చరిత్రకారుడు
  • అన్వేషకుడు
  • వక్త
మతం డచ్ రిఫార్మ్
సంతకం థియోడర్ రూజ్‌వెల్ట్'s signature
పురస్కారాలు నోబెల్‌ శాంతి బహుమతి (1906)
మెడల్ ఆఫ్ హానర్ (మరణానంతరం; 2001)

రూజ్‌వెల్ట్ చిన్నతనంలో ఉబ్బసం వ్యాధితో బాధపడ్డాడు. కానీ తన జీవనశైలిలో కఠినమైన మార్పులు చేసుకోవడం ద్వారా తన ఆరోగ్య సమస్యలను అధిగమించాడు. అలాగే తన యవ్వనంలో సహజ పద్ధతుల్లో ఉబ్బసం నుండి బయటపడ్డాడు. అతను తన ఉత్సాహభరితమైన వ్యక్తిత్వాన్ని, విస్తారమైన అభిరుచులను కలిగిన వాడు. అతను ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నాడు. అతని పుస్తకం ది నావల్ వార్ ఆఫ్ 1812 (1882 ప్రచురణ) ఒక నిపుణుడైన చరిత్రకారుడిగా, మంచి రచయితగా అతనికి గుర్తింపు తెచ్చింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత, న్యూయార్క్ రాష్ట్ర శాసనసభలో రిపబ్లికన్ల సంస్కరణ వర్గానికి నాయకుడు అయ్యాడు. అతని భార్య, అతని తల్లి ఇద్దరూ వెంటవెంటనే మరణించారు. డకోటాస్లో పశువుల గడ్డిబీడును తరచుగా చూసివస్తూండేవాడు. అధ్యక్షుడు విలియం మెకిన్లీ ఆధ్వర్యంలో నేవీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశాడు, కాని స్పానిష్-అమెరికన్ యుద్ధంలో రఫ్ రైడర్స్కు నాయకత్వం వహించడానికి అతను ఆ పదవికి రాజీనామా చేసి, ఒక యుద్ధ వీరుడిగా మారాడు. 1898 లో న్యూయార్క్ గవర్నర్‌గా ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ గారెట్ హోబర్ట్ 1899 లో మరణించిన తరువాత, న్యూయార్క్ రాష్ట్ర పార్టీ నాయకత్వం 1900 ఎన్నికలలో రూజ్‌వెల్ట్‌ను తన సహచరుడిగా అంగీకరించమని మెకిన్లీని ఒప్పించింది. రూజ్‌వెల్ట్ బాగా ప్రచారం చేశాడు, మెకిన్లీ-రూజ్‌వెల్ట్ జట్టు శాంతి, శ్రేయస్సు, పరిరక్షణ వేదిక ఆధారంగా ఘన విజయం సాధించింది.

మార్చి 1901 లో రూజ్‌వెల్ట్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించాడు. సెప్టెంబరులో మెకిన్లీ హత్యకు గురైన తరువాత 42 సంవత్సరాల వయస్సులో అధ్యక్ష పదవిని చేపట్టాడు. అతను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడైన అతి పిన్న వయస్కుడు. రూజ్‌వెల్ట్ ప్రగతిశీల ఉద్యమానికి నాయకుడు. అతను తన "స్క్వేర్ డీల్" దేశీయ విధానాలకు నాయకత్వం వహించాడు. సగటు పౌరులకు నిష్పక్షపాతంతో కూడిన పాలన, ట్రస్టులను విచ్ఛిన్నం చేయడం, రైల్‌రోడ్ల నియంత్రణ, స్వచ్ఛమైన ఆహారం, ఔషధాలను వాగ్దానం చేశాడు. అతను పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. దేశం యొక్క సహజ వనరులను పరిరక్షించడానికి ఉద్దేశించిన అనేక కొత్త జాతీయ ఉద్యానవనాలు, అడవులు, స్మారక చిహ్నాలను స్థాపించాడు. విదేశాంగ విధానంలో భాగంగా, మధ్య అమెరికాపై దృష్టి పెట్టి పనామా కాలువ నిర్మాణాన్ని ప్రారంభించాడు. నావికాదళాన్ని విస్తరించాడు, ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ నావికా శక్తిని ప్రదర్శించడానికి గ్రేట్ వైట్ ఫ్లీట్‌ను ప్రపంచ పర్యటనకు పంపాడు. రస్సో-జపనీస్ యుద్ధం ముగియడం కోసం అతను చేసిన విజయవంతమైన ప్రయత్నాలు 1906 నోబెల్ శాంతి బహుమతిని తెచ్చిపెట్టింది. అతను వివాదాస్పద సుంకం, డబ్బు సమస్యలను నివారించాడు. రూజ్‌వెల్ట్ 1904 లో పూర్తి కాలానికి ఎన్నికయ్యాడు. ప్రగతిశీల విధానాలను ప్రోత్సహించడం కొనసాగించాడు. వీటిలో చాలా వరకు కాంగ్రెస్‌లో ఆమోదించబడ్డాయి. 1908 అధ్యక్ష ఎన్నికల్లో అతని తరువాత అతని సన్నిహితుడు విలియం హోవార్డ్ టాఫ్ట్ విజయవంతంగా వచ్చాడు.

రూఫ్ట్వెల్ట్ టాఫ్ట్ సాంప్రదాయ వాదంతో విసుగు చెంది1912 రిపబ్లికన్ అధ్యక్షుడి నామినేషన్‌ను గెలుచుకోవడానికి ఆలస్యంగా ప్రయత్నించాడు కానీ అందులో విఫలమై బయటకు వెళ్ళిపోయి "బుల్ మూస్" అనే పార్టీని స్థాపించాడు. ఇది విస్తృత ప్రగతిశీల సంస్కరణలకు పిలుపునిచ్చింది. 1912 ఎన్నికలలో పోటీ పడ్డాడు. కానీ ఓట్ల చీలిక వలన డెమొక్రాటిక్ నామినీ వుడ్రో విల్సన్ ఎన్నికలలో విజయం సాధించడానికి దోహదం చేసింది. ఓటమి తరువాత, రూజ్‌వెల్ట్ అమెజాన్ బేసిన్‌కు రెండు సంవత్సరాల యాత్రకు నాయకత్వం వహించాడు, అక్కడ అతను ఉష్ణమండల వ్యాధితో దాదాపు మరణించినంత పనైంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, విల్సన్ దేశాన్ని జర్మనీతో యుద్ధానికి దూరంగా ఉంచాడని విమర్శించాడు. స్వచ్ఛంద సేవకులను ఫ్రాన్స్‌కు నడిపించాలన్న తన ప్రతిపాదన తిరస్కరించబడింది. అతను 1920 లో మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించాడు, కాని అతని ఆరోగ్యం క్షీణించింది. 1919 లో మరణించాడు. చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్తల ఆయనను ఐదుగురు ఉత్తమ అధ్యక్షులలో ఒకరిగా భావిస్తారు.[1]

మూలాలు

మార్చు
  1. Murray, Robert K; Blessing, Tim H (2004). Greatness in White House. Pennsylvania State U.P. pp. 8–9, 15. ISBN 0271038276.

ప్రాథమిక మూలాలు

మార్చు