జనవరి 6
తేదీ
జనవరి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 6వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 359 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 360 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1929: మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
- 1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
- 2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
జననాలు
మార్చు- 1812: బాలశాస్త్రి జంబేకర్, భారతీయ సంఘ సంస్కర్త.
- 1867: బయ్యా నరసింహేశ్వరశర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది, దాత
- 1910: G. N. బాలసుబ్రహ్మణ్యం, భారత కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1960)
- 1932: బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు.
- 1936: జి. మునిరత్నం నాయుడు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- 1945: జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (మ. 2021)
- 1958: తాళ్లూరి రామేశ్వరీ, తెలుగు, హిందీ చిత్రాల నటి, దూరదర్శన్ నటి.
- 1959: కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్రౌండర్.
- 1966: ఎ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకులు.
- 1966:వందేమాతరం శ్రీనివాస్, తెలుగుసినీగాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు
- 1977: ప్రేమ, దక్షిణ భారత చలన చిత్రనటి.
- 1989: హెబ్బా పటేల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
మరణాలు
మార్చు- 1847: త్యాగయ్య, ప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767)
- 1852: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త, బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809)
- 1884: గ్రెగర్ మెండల్, జన్యు శాస్త్రములో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
- 1919: థియోడర్ రూజ్వెల్ట్, అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858)
- 1949: చింతా వెంకట్రామయ్య, కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
- 1976: యనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
- 1994: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
- 2008: శోభన్, తెలుగు చలనచిత్ర దర్శకుడు (జ.1968)
- 2009: జీ.ఎం.షా, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
- 2011: ఎస్. టి. జ్ఞానానంద కవి, తెలుగు రచయిత. (జ.1922)
- 2013: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
- 2014: ఉదయ్ కిరణ్, తెలుగు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
- 2017: ఓం పురి, భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చుజనవరి 5 - జనవరి 7 - డిసెంబర్ 6 - ఫిబ్రవరి 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |