దండమూడి భిక్షావతి

దండమూడి భిక్షావతి తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు. ఆమె తన భర్త డి.వి.సుబ్బారావు తో కలిసి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది.[1]

జీవిత విశేషాలు మార్చు

ఆమె ఉయ్యూరు మండలం గండిగుండలో జన్మించింది. 13వ ఏటనే కాటూరులో జరిగిన రెండో ఆలిండియా మహిళా మహాసభకు వాలంటీర్‌గా సేవలందించింది. 17వ ఏట తన మేనమామ డివి సుబ్బారావు (డివిఎస్‌)ను వివాహం చేసుకుంది. 1949లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధిం విధించిన తరువాత పార్టీ రహస్య కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషించింది. 1952లో పార్టీ సభ్యత్వం పొందింది. 1960లో విజయవాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీచేసింది. 1966లో డివిఎస్‌ చనిపోయిన సమయంలో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన నంబూద్రిపాద్‌కు తన చేతికున్న గాజులు తీసి ఇచ్చి, శక్తి మేరకు డివిఎస్‌ ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పి స్ఫూర్తిని నింపింది. 1999 వరకూ విజయవాడ నగర మహిళా సంఘంలో అనేక బాధ్యతలు నెరవేర్చింది. [2]

వ్యక్తిగత జీవితం మార్చు

భిక్షావతికి ముగ్గురు కుమారులు నారాయణప్రసాదు, భానుప్రసాదు, విజయా నంద్‌ ఉన్నారు. కుమార్తె శారద మహిళా ఉద్యమ నేతగా విశాఖలో పనిచేస్తూ అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో కొన్నేళ్ల కిందట మరణించింది. అల్లుడు సిహెచ్‌ నరసింగరావు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు.[1]

మరణం మార్చు

ఆమె 2018, మార్చి 30 శుక్రవారం ఉదయం కన్నుమూసింది. ఆమె భౌతికకాయానికి ఆమె మనుమరాలు సుమిత్ర స్వర్గపురిలో విద్యుత్‌ దహనవాటికలో అంతిమక్రియ నిర్వహించింది.[2]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Stories, Prajasakti News. "భిక్షావతి ఇకలేరు". Prajasakti. Retrieved 2018-04-15.
  2. 2.0 2.1 "దండమూడి భిక్షావతి ఇకలేరు".