కాటూరు (వుయ్యూరు)

భారతదేశంలోని గ్రామం

కాటూరు, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 164., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

కాటూరు (వుయ్యూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కాటూరి మెర్సీబాయమ్మ
జనాభా (2011)
 - మొత్తం 7,132
 - పురుషులు 3,496
 - స్త్రీలు 3,636
 - గృహాల సంఖ్య 2,094
పిన్ కోడ్ 521164
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గ్రామానికి సమీపంలో కుందేరు, కలవపాముల, మానికొండ, వుయ్యూరు, శాయపురం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

తోట్లవల్లూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, పెదపారుపూడి, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కలవపాముల, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

సిద్దార్ధ ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి కాటూరి మెర్సీబాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ దాయినేని వెంకటరామారావు ఎన్నికైనారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ భీమలింగేశ్వరస్వామి ఆలయంసవరించు

ఈ గ్రామంలో శివాలయంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వరస్వామి కళ్యాణోత్సవాలు, 2014,ఫిబ్రవరి-12 నుండి 15 వరకూ నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-20వ తేదీ, బుధవారం నాడు, ఉదయం 9-45 గంటలకు నూతన నవగ్రహ, చండీశ్వర, బలిపీఠ దేవతామూర్తుల ప్రతిష్ఠ కన్నులపండువగా నిర్వహించారు. విగ్రహప్రతిష్ఠను దాత శ్రీ ఆళ్ళ శ్రీకాంత్, లక్ష్మీకుమారి దంపతులు నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా 18వ తేదీ సోమవారం నాడు, గణపతిపూజ, హోమాలు, గ్రామోత్సవం నిర్వహించారు. 19వ తేదీ మంగళవారం నాడు, నవగ్రహ హోమం, ప్రత్యేకపూజలు నిర్వహించారు. [4],[6]&[7]

శ్రీకృష్ణుని ఆలయంసవరించు

ఈ గ్రామం ఆస్ట్రేలియాలోని మెల్బోర్నులో ఉంటున్న శ్రీ రాజులపాటి అజయ్ కుమార్ గారి మాతామహుల గ్రామం. వీరు ఇక్కడ 8 సెంట్ల భూమి కొని, తనకు ఇష్టమైన శ్రీకృష్ణుని ఆలయం కట్టించడమే గాకుండా, విజయవాడలోని ఇస్కాన్ (ISKCON) ఆలయ గురుదేవులచే ప్రతినెలా ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. వారు అధ్యాత్మిక అంశాలను బోధిస్తున్నారు. ఈ ఆలయనిర్మాణానికి మొత్తం రు.40 లక్షలు ఖర్చు అయినది.[3]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో 2015,ఆగష్టు-23వ తేదీ ఆదివారంనాడు, యాదవ సంఘం ఆధ్వర్యంలో, అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. [8]

కాటూరు గ్రామ చెరువుకట్టపై నూతనంగా నిర్మించిన ఆలయంలో, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ ఆంజనేయ, శ్రీ నాగేంద్రస్వామివారల విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,నవంబరు-7వ తేదీ శనివారంనాడు, వైభవంగా నిర్వహించారు. [9]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శతాధికవృద్ధురాలు శ్రీమతి నాగళ్ళ రాజేశ్వరమ్మ, నడవలేని పరిస్థితిలో ఉన్నా, పట్టుదలతో, బంధువుల సాయంతో, 2014,ఏప్రిల్-11 నాడు జరిగిన ప్రాదేశిక ఎన్నికలలో, గ్రామంలోని పోలింగు కేంద్రంలో ఓటు వేసి, తన బాధ్యతను నెరవేర్చుకున్నారు. ఏడు దశాబ్దాలక్రితమే, మహిళాచైతన్య ఉద్యమంలో పాల్గొని, ఓటు ప్రాధాన్యతను మహిళలకు వివరించి, ప్రోత్సహించిన ఘనత ఆమెకున్నది. [5]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 7,132 - పురుషుల సంఖ్య 3,496 - స్త్రీల సంఖ్య 3,636 - గృహాల సంఖ్య 2,094

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా. 7221.[4] ఇందులో పురుషుల సంఖ్య 3578, స్త్రీల సంఖ్య 3643, గ్రామంలో నివాసగృహాలు 1907 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1586 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "కాటూరు". Retrieved 23 June 2016. CS1 maint: discouraged parameter (link)
  2. ఈనాడు విజయవాడ/పెనమలూరు; జనవరి-1,2014; 13వ పేజీ.
  3. ఈనాడు విజయవాడ/పెనమలూరు; జనవరి-8,2013; 2వ పేజీ.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-07.

వెలుపలి లింకులుసవరించు

[4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఫిబ్రవరి-12; 2వపేజీ. [5] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014;ఏప్రిల్-12; 2వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగష్టు-18; 1వపేజీ. [7] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగష్టు-21; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-24; 35వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-8; 36వపేజీ.