దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో అనంతపురం అర్బన్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | అనంతపురం అర్బన్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీతెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | దగ్గుబాటి చిన్నారప్ప, ప్రమీలమ్మ | ||
జీవిత భాగస్వామి | శ్రీలక్ష్మి | ||
సంతానం | మణిహాస్ | ||
నివాసం | బండమీదపల్లి గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జననం, విద్యాభాస్యం
మార్చుదగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, బండమీదపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన కర్నూలు జిల్లా బనగానపల్లిలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాలలో 1995లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుదగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో రాప్తాడు మండలం బండమీదపల్లి నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 535 ఓట్ల మెజార్టీతో గెలిచి 2014 నుంచి 2019 వరకు రాప్తాడు ఎంపీపీగా పని చేశాడు.[3] ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో అనంతపురం అర్బన్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనంత వెంకటరామి రెడ్డిపై 23023 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
మార్చు- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Andhrajyothy (30 March 2024). "ఇంక రెడీ..!". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Anantapur Urban". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.