దత్తాత్రేయస్వామి దేవాలయం (మఖ్తల్)

తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లా, మఖ్తల్ మండల కేంద్రంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న దేవాలయం

దత్తాత్రేయస్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లా, మఖ్తల్ మండల కేంద్రంలోని వల్లభాపురం గ్రామంలో ఉన్న దేవాలయం.[1] తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నాడు.[2]

దత్తాత్రేయస్వామి దేవాలయం
దత్తాత్రేయస్వామి దేవాలయం is located in Telangana
దత్తాత్రేయస్వామి దేవాలయం
దత్తాత్రేయస్వామి దేవాలయం
తెలంగాణలో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు:16°50′50″N 77°51′59″E / 16.84722°N 77.86639°E / 16.84722; 77.86639
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:నారాయణపేట జిల్లా
ప్రదేశం:వల్లభాపురం, మఖ్తల్‌ మండలం
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:దత్తాత్రేయస్వామి

చరిత్ర

మార్చు

శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ కృష్ణానది సమీపంలోని ఈ క్షేత్రానికి వచ్చి 16వ యేట నుండి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇక్కడ నివాసముండి భక్తుల కష్టాలు తీర్చాడని, ఆశ్వీయుజమాస కృష్ణద్వాదశి, హస్తా నక్షత్రం రోజున కృష్ణానదిలో అంతర్దానమయ్యారని చరిత్రకారుల అభిప్రాయం. కష్టాలు, కలతలతో ఉన్నవారు, దుష్టశక్తుల నుండి విముక్తి కోరుకునేవారు ఇక్కడ స్వామిని పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. భక్తులు ఉదయం తొమ్మిదిగంటల లోపే ఆ సిద్దాశన స్థానాన్ని అభిషేకం చేయించుకోని, పురాతన వటవృక్షం క్రింద ప్రతిష్ఠితమైన శ్రీపాదుల పాలరాతి విగ్రహాన్ని దర్శించుకుంటారు.

పూజలు, ఉత్సవాలు

మార్చు

ఈ దేవాలయంలో ప్రతిరోజూ అభిషేకం, పల్లకీసేవ జరుగుతాయి. దత్తజయంతి వంటి ఉత్సవాలు, గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, శ్రీనృసింహ సరస్వతి గుప్తదినాలు జరుగుతాయి. ఉత్సవాల సమయంలో అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తారు.[3]

ఇతర దేవాలయాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో ఒక ద్వీపంలో కురుపురం అనే గ్రామం ఉంది. అక్కడ 2020 నాటికి సుమారు వెయ్యి సంవత్సరాల వయసున్న మర్రిచెట్టు కింద శ్రీపాద శ్రీవల్లభస్వామి చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. అతను తపస్సు చేసిన ఈ ప్రాంతంలో శ్రీపాద వల్లభ దేవాలయం నిర్మించబడింది.[4]

మూలాలు

మార్చు
  1. "గురు సన్నిధికి..." m.andhrajyothy.com. 2018-07-26. Archived from the original on 2021-10-28. Retrieved 2021-10-28. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. తెలంగాణ మాసపత్రిక, తెలంగాణ (3 August 2016). "కృష్ణవేణి తీరంలో పవిత్ర క్షేత్రాలు". www.magazine.telangana.gov.in. Archived from the original on 28 January 2021. Retrieved 28 October 2021.
  3. Mohammad (2015-12-09). "కృష్ణా నది ఒడ్డున ఉన్న పవిత్ర పుణ్య క్షేత్రాలు !!". www.telugu.nativeplanet.com. Retrieved 2021-10-28.
  4. "Sri Dattatreya Swamy Temple Vallabhapuram Kurvapuram – Telugu Online News". 2021-05-03. Archived from the original on 2021-10-28. Retrieved 2021-10-28. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)