దాహం, దప్పిక లేదా పిపాస (Thirst) అనగా నీరు లేదా ఇతర ద్రవాలు తాగాలని కోరిక కలగడం. ఇది శరీరంలోని ద్రవాల సమతూల్యం (Fluid balance) సాధించడానికి ముఖ్యమైన ప్రతిచర్య. మన శరీరంలో ద్రవాలు తగ్గినా లేదా లవణాలు (Salts) పెరిగినా మెదడు సంకేతాలు పంపి మనకు దాహం వేస్తుంది.

నీరు త్రాగకుండా ఉంటే చాలా రకాల శారీరక ఇబ్బందులు కలుగుతాయి. వానిలో ఫిట్స్ రావడం, మూత్ర పిండాల సమస్యలు మొదలవుతాయి.

దాహం అధికంగా ఉండడాన్ని పోలీడిప్సియా (Polydipsia) అంటారు. ఇది గనక అతిమూత్రం (Polyuria) తో కలిసి వస్తే మధుమేహం (Diabetes) ఉన్నదని భావించాలి.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దప్పిక&oldid=2991801" నుండి వెలికితీశారు