దర్జీ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వస్త్రాలు, దారంతో బట్టలు లేదా దుస్తులు కుట్టే టైలర్ దర్జీ .వేలాది ముస్లిం కుటుంబాలు దర్జీ పనిలో ఉన్నాయి.రెడీమేడ్ బట్టలు విరివిగా రావడం యువత దానిమీద మోజుతో ఎక్కువ ఆసక్తి చూపుతూ కొనుగోలు చేయడంతో దర్జీల దగ్గర బట్టలు చేసి కుట్టించుకొనేవారు తక్కువయ్యారు. దీనితో వీరి జీవన భృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది. రెడీమేడ్ వస్త్రాలు తక్కువ ధరకు దొరకడం, తోపుడు బండ్లపైన సైతం టీషర్టులు, జీన్‌ప్యాంట్లు విరివిగా దొరుకుతున్నాయి. సంతలో సైతం రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
దానికి తోడు కుట్టడానికి అవసరమయ్యే సరంజామా (క్యాన్‌వాస్, గుండీలు, హుక్సులు, దారాలు, ఆయిల్‌మిషన్) ధరలు పెరగడంతో దర్జీల దగ్గర బట్టలు ఇచ్చి కుట్టించుకొంటే ధర ఎక్కువ అవుతుందని అదే రెడీమేడ్ తీసుకొంటే తక్కువ ధరకు దొరుకుతాయి. వాటిమీద ఆదరణ చూపిస్తున్నారు. ఈ వృత్తినే నమ్ముకొని కొందరు ఇతర చోట్లకు వలసలు వెళ్ళారు.గిరాకులు దర్జీల వద్దకు వచ్చి బట్టలు కుటించుకొనే ఓపిక నశించింది. దర్జీల చేతికి ఇస్తే సరైన సమయానికి బట్టలు కుట్టించి ఇవ్వలేరని అప్పటికప్పుడు రెడిమెడ్ షాపులలోకి వెళ్ళి తమకు కావాల్సిన దుస్తులను ఎంపిక చేసుకొంటున్నారు. దీని ప్రభావం దర్జీల పై చాలా పడింది. గతంలో మాదిరిగా కాకుండా నేడు మహిళలకు కుట్టుమిషన్లు శిక్షణఇవ్వడంతో మహిళలకు కావాల్సిన దుస్తులను మహిళలే తమ ఇళ్ళవద్ద కుట్టుకొంటు న్నారు. అంగళ్ళు పెట్టుకొని దర్జీ పనిచేస్తున్న వీరికి పీస్ వర్క్ మెటీరియల్స్ గిట్టుబాటు కాకపోవడంతో అంగళ్ళు మూసివేసి ఇళ్ళదగ్గర కుట్టుకొంటున్నారు.కొంతమంది పేద దర్జీలు కుట్టుమిషన్లు అమ్ముకొని ప్రతి రోజు 5 రూపాయల అద్దెతో కుట్టుమిషన్లను తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారు.రెడీమేడ్ దుస్తులు రాని సమయంలో వారికి కావాల్సిన దుస్తులను నెల ముందుగా ఇచ్చే వారు. పండగ సీజన్‌లు వస్తే వారం ముందు మాకు కుట్టేందుకు వీలు కాదు అనేవారము. నేడు ఆ పరిస్థితి లేదు. కుట్టే దుస్తుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.
కొలతలు
మార్చుదర్జీ సాధారణంగా ఈ క్రింది కొలతలు తీసుకుంటాడు.
పురుషులు
మార్చు- అంగీ పొడవు
- నడుము
- భుజాలు
- కాళ్ళు
- చేతులు పొడవు (పొట్టి లేదా పొడగు చేతులు
మూలాలు
మార్చు- http://www.suryaa.com/showNews.asp?category=4&subCategory=2&ContentId=10971[permanent dead link]
- May đồng phục Alibu Archived 2020-10-28 at the Wayback Machine(వియత్నామీస్ యూనిఫాంలను కుట్టడం)