దర్శనమ్, ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక

దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక.[1]

దర్శనమ్
ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక
జనవరి 2011, పుస్తక ముఖచిత్రం
సంపాదకులుమరుమాముల రుక్మిణి
తరచుదనంమాసం
ముద్రణకర్తఎస్.ఆర్.ఎస్.పబ్లికేషన్స్,
స్థాపక కర్తమరుమాముల వెంకటరమణశర్మ
దేశంభారతదేశము
కేంద్రస్థానంసికింద్రాబాదు
భాషతెలుగు

విశేషాలు

ఈ పత్రిక ఆధ్యాత్మిక పత్రికారంగంలో అనేక సంవత్సరాలపాటు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఈ పత్రికలో వేదవాఙ్మయంలోని అపారజ్ఞానరాశిని సంక్షిప్త సుందరంగా సులభశైలిలో లభిస్తుంది. దీనిలో అనేకాధ్యాత్మికాంశాలు వివిధ వ్యాసరూపాలలో ఉంటాయి. భారతీయులకు ఆత్మలైన వేదాలలోని ఉపనిషత్తులతో ప్రపంచీకృతం అయిన వాదోపవాదాలూ, చర్చలూ, ప్రశ్నోత్తరాలూ ఇందులో ఉంటాయి. చతుర్విధ పురుషార్థ సాధనకు పట్టుకొమ్మలైన రామాయణ, భారత, భాగవతేతిహాసాలలోని రమణీయకథలూ, కమనీయ ఘట్టాలూ సుందర వర్ణనలతో ఉంటాయి. ప్రస్థాన త్రయాలలోని ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ, భగవద్గీతనూ అన్ని కోణాలనుండి అధ్యయనం చేసి విడమరచి చెప్పే విద్వాంసుల రచనలు ఈ పత్రికకు అలంకారాలు. శంకర భగవత్పాదులవంటి జగద్గురువులు రచించినర స్తోత్రసాహిత్యం తొలిపుటలోనే ఉంటుంది.

భౌతిక సుఖాలు అశాశ్వతాలనే జీవిత సత్యాలు ఈ పత్రికలో గల వ్యాసాలలో ఉంటాయి. ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్న యోగులూ, విరాగులూ, పీఠాదిపతులూ, మునుల యొక్క జీవితానుభవాలు ఈ పత్రికలో ఉంటాయి. ఆధ్యాత్మికజ్ఞానాన్ని అనేక కోణాలతో ఈ పత్రిక ప్రతిబింబిస్తున్నది.

ఇందులో సాధకులకోసం స్తోత్రాలూ, పాఠకులకోసం కథలూ, చరిత్ర జ్ఞానం కోసం గాథలూ, సామాన్యులకోసం చిత్రకథలూ, మేధావులకోసం పదకేళులూ, జ్యోతిష పరిజ్ఞానం కోసం రాశిఫలాలూ, నిత్యతిథి వార నక్షత్రయోగ కరణ పరిజ్ఞానం కోసం మాసపంచాంగం మొదలగు అంశాఅలుంటాయి.

కార్యక్రమాలు

దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక యాజమాన్యం అధ్వర్యంలో డిసెంబరు 14 2002 తెలుగు లలిత కళా తోరణంలో జరిగిన గురువందనం కార్యక్రమం జరిగింది.[2]

మూలాలు

ఇతర లింకులు