దశాశ్వమేధ ఘాట్
దశాశ్వమేధ ఘాట్ ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి లోని ప్రధానమైన స్నానఘట్టం. ఇది కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. ఘాట్‌తో సంబంధం ఉన్న రెండు హిందూ పురాణాలు ఉన్నాయి: శివుడిని స్వాగతించడానికి బ్రహ్మ దానిని సృష్టించాడు అనేది ఒకటి కాగా, మరొకదానిలో, బ్రహ్మ ఇక్కడ పది అశ్వమేధయాగాలు చేశాడు.
దశాశ్వమేధ ఘాట్ | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 25°18′25.808″N 83°0′37.211″E / 25.30716889°N 83.01033639°E |
దేశం | భారతదేశం |
జిల్లా | వారణాసి |
ప్రస్తుతం ఉన్న ఘాట్‌ను 1748లో పీష్వా బాలాజీ బాజీరావు నిర్మించాడు. కొన్ని దశాబ్దాల తర్వాత, ఇండోర్ రాణి అహల్యాబాహి హోల్కర్ 1774 సంవత్సరంలో ఘాట్‌ను పునర్నిర్మించింది.[1]
గంగా హారతి
మార్చుప్రతిరోజూ సాయంసంధ్యలో ఇక్కడ గంగానదికి హారతి ఇస్తారు. ఏడుగురు పూజారులు, ఘాట్‌లో, నదికి ఎదురుగా, ఒకరి నుండి ఒకరు ఏడెనిమిది మీటర్ల ఎడంగా నిలబడి, దీపస్థంభాన్ని పట్టుకుని, లయబద్ధంగా శ్లోకాలు పఠిస్తూ దీపస్థంభాన్ని కదిలిస్తూ ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు.[2] మంగళవారాలు, పండుగ రోజులలో ప్రత్యేక హారతులు ఇస్తారు.
గంగా హారతి సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమై దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. వేసవిలో, ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి, హారతి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. శీతాకాలంలో సాయంత్రం దాదాపు 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రతిరోజు సాయంత్రం వందలాది మంది ఘాట్ వద్ద గుమిగూడతారు.[3]
2010 తీవ్రవాద బాంబు దాడి
మార్చు- ↑ "History of Dashashwamedh Ghat". www.varanasiguru.com. 28 March 2021.
- ↑ "Ganga Aarti at Dashashwamedh Ghat in Varanasi". Triponzy. 22 January 2019.
2010 డిసెంబరు 7 న హారతి దక్షిణ చివరలోని శీతలా ఘాట్ వద్ద తక్కువ-తీవ్రత కలిగిన పేలుడు సంభవించింది. దీని వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు, 6 గురు విదేశీ పర్యాటకులతో సహా 37 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ దీనికి బాధ్యత వహించింది.[1][2]
మూలాలు
మార్చు- ↑ "Terror strikes Varanasi: 1 killed". Zee News. 8 December 2010.
- ↑ "Varanasi blast triggers a blame game". India Today. 9 December 2010. Archived from the original on 8 February 2011. Retrieved 15 December 2010.