కాశీ విశ్వనాథ దేవాలయం

వారణాసి లోని హిందూ దేవాలయం, ఉత్తర్ ప్రదేశ్, ఇండియా

కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయాలలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువ ఉన్న మూర్తిని విశ్వనాథుడని, విశ్వేశ్వరుడనిఅంటారు. పురాతన కాలంలో వారణాసిని కాశీ ("మెరుస్తున్న") అని పిలిచేవారు, అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు.

కాశీ విశ్వనాథ దేవాలయం
కాశీ విశ్వనాథ దేవాలయం
కాశీ విశ్వనాథ దేవాలయం సుమారు 1915
కాశీ విశ్వనాథ దేవాలయం is located in Uttar Pradesh
కాశీ విశ్వనాథ దేవాలయం
ఉత్తర ప్రదేశ్ పటంలో కాశీ విశ్వనాథ దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు25°18′38.79″N 83°0′38.21″E / 25.3107750°N 83.0106139°E / 25.3107750; 83.0106139
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లావారణాసి
స్థలంవారణాసి
సంస్కృతి
దైవంవిశ్వనాథుడు
ముఖ్యమైన పర్వాలుమహా శివరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుమందిరం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1780
సృష్టికర్తతెలియదు-

1585 CE - మాన్ సింగ్ I

1780 CE - అహల్యా బాయి హోల్కర్
వెబ్‌సైట్shrikashivishwanath.org

ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ముస్లిం పాలకులు దీన్ని అనేకసార్లు కూల్చివేసారు. ఔరంగజేబు దాని స్థలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 సంవత్సరంలో ఇండోర్‌కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ [1] నిర్మించారు.

1983 నుండి, ఈ ఆలయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

క్షేత్ర మాహాత్మ్యం

మార్చు

శివ పురాణం ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు లలో ఎవరు సర్వోన్నతుడనే దానిపై వాదనలు జరిగాయి.[2] వారిని పరీక్షించడానికి శివుడు, ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభంగా చేసాడు. ఎవరు శక్తిమంతుడో గుర్తించడానికి విష్ణువు పంది రూపాన్ని ధరించి స్తంభపు అడుగుకు వెళ్ళగా, బ్రహ్మ హంస రూపాన్ని తీసుకుని స్తంభం పై కొనకు వెళ్లాడు. బ్రహ్మ అహంకారంతో కటుకి పువ్వును సాక్షిగా చూపుతూ తాను అంతం కనుక్కున్నానని అబద్ధం చెప్పాడు. విష్ణువు తాను దిగువ కొనను కనుగొనలేకపోయానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అప్పుడు శివుడు కోపోద్రిక్తుడై భైరవ రూపాన్ని ధరించి, బ్రహ్మ ఐదవ తలను నరికి, అతనికి పూజాదికాలు జరగరాదని శపించాడు. విష్ణువు చూపిన నిజాయితీకి గాను, శివుడితో సమానంగా నిత్యం పూజిలందుకుంటాడు.

జ్యోతిర్లింగం అనేది పురాతన అక్షం ముండి చిహ్నం, ఇది సృష్టి యొక్క ప్రధాన భాగంలో అత్యున్నత నిరాకార (నిర్గుణ) వాస్తవికతను సూచిస్తుంది, దాని నుండి శివుని రూపం (సగుణం) కనిపిస్తుంది. ఆ విధంగా శివుడు కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు.[3][4] జ్యోతిర్లింగాలతో సంబంధం లేకుండా, శివునికి 64 రూపాలు ఉన్నాయి. పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ప్రతి ఒక్కటి అధిష్టాన దేవత పేరును తీసుకుంటాయి - వీటిని శివుని విభిన్న రూపాలుగా పరిగణిస్తారు.[5] ఈ ప్రదేశాలన్నింటిలో, శివుని అనంతమైన స్వభావానికి ప్రతీకగా, ఆద్యంతాలు లేని స్థాణువును సూచించే లింగమే ప్రాథమిక చిత్రం.[5][6][7] గుజరాత్‌లోని సోమనాథుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో మల్లికార్జునుడు, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, మహారాష్ట్రలోని భీమశంకర్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో విశ్వనాథ, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం, జార్ఖండ్‌ లోని దేవఘర్‌లోని వైద్యనాథేశ్వరం, గుజరాత్‌లోని ద్వారకలో నాగేశ్వరం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర్లు ద్వాదశ జ్యోతిర్లింగాలు.[2][8]

కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ శక్తి పీఠంగా పరిగణించబడుతుంది. ఇది శాక్తేయులకు పూజనీయమైన ప్రార్థనా స్థలం. శైవ సాహిత్యమైన దక్ష యాగం శక్తి పీఠాల మూలం గురించిన కథను వివరిస్తుంది.[9]

విశ్వేశరుడు వారణాసిని పాలించే దేవత. ఇతర దేవతలందరిపై రాజు పదవిని కలిగి ఉన్నాడు, అలాగే నగరంలోనే కాకుండా, దాదాపు 50 మైళ్ల వరకు విస్తరించి ఉన్న పంచకోసి రహదారి (పవిత్రమైన వారణాసి సరిహద్దు) లోపల నివసించే ప్రజలందరికీ కూడా పాలకుడు. .[10]

చరిత్ర

మార్చు

ఆలయ చరిత్రలో పదేపదే విధ్వంసాలు, పునర్నిర్మాణాలూ జరిగినట్లు మాధురీ దేశాయ్ చెప్పారు.[11] ప్రస్తుత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు ఇక్కడి లింగానికి కాలాతీత స్వాభావం గురించి తెలుసుకుంటారు.[11]

పురాతన, సాంప్రదాయిక కాలం

మార్చు

స్కంద పురాణంలోని కాశీ ఖండంతో సహా పురాణాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది.

మధ్యయుగ కాలం, విధ్వంసం

మార్చు

1194లో ముయిజ్ అల్-దిన్ ముహమ్మద్ ఇబ్న్ సామ్ భారతదేశానికి తిరిగి వచ్చి చందావర్ సమీపంలోని కన్నౌజ్‌కు చెందిన జయచంద్రను ఓడించి, కాశీ నగరాన్ని ధ్వంసం చేసాడు. అప్పట్లో ఆది విశ్వేశ్వర ఆలయంగా పిలువబడే ఆ అసలైన విశ్వనాథ ఆలయాన్ని ఆ విధంగా ఘురిద్‌లు ధ్వంసం చేసారు.[12] కొన్ని సంవత్సరాలలో, దాని స్థానంలో రజియా మసీదును నిర్మించారు.[13][14] 1230లో, ఢిల్లీ సుల్తాన్ ఇల్తుత్మిష్ (1211–1266) పాలనలో ఓ గుజరాతీ వ్యాపారి, ప్రధాన ఆలయ ప్రదేశానికి దూరంగా అవిముక్తేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించారు. హుస్సేన్ షా షర్కీ (1447–1458) లేదా సికందర్ లోడి (1489–1517) పాలనలో దీన్ని మళ్లీ కూల్చివేసారు.

మొఘల్ కాలం

మార్చు

మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో రాజా మాన్ సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. రాజా తోడర్ మాల్ 1585లో ఆలయాన్ని మరింతగా విస్తరించాడు. అయితే అతని కుమార్తె ఇస్లామిక్ పాలకుని పెళ్ళి చేసుకున్నందున సనాతన బ్రాహ్మణులు ఆ ఆలయాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.[13][15] జహంగీర్ పాలనలో, వీర్ సింగ్ దేవ్ పూర్వపు ఆలయ నిర్మాణాన్ని పునరుద్ధరించాడు.[16] 1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, దాని స్థానంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు.[17] పూర్వపు ఆలయ అవశేషాలైన పునాది, స్తంభాలను మసీదు వెనుక భాగంలో చూడవచ్చు.[18]

మరాఠా, బ్రిటిష్ కాలం

మార్చు
 
ప్రస్తుత ఆలయం

1742లో, మరాఠా పాలకుడు మల్హర్ రావ్ హోల్కర్ మసీదును కూల్చివేసి, ఆ స్థలంలో విశ్వేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలని ఒక ప్రణాళికను రూపొందించాడు. అయితే, భూభాగంపై నియంత్రణ పొందిన అవధ్ నవాబ్ జోక్యం చేసుకోవడంతో అతని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు.[19] : 2 1750లో, జైపూర్ మహారాజు కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించడానికి భూమిని కొనుగోలు చేయాలనే లక్ష్యంతో సైట్ చుట్టూ ఉన్న భూమిని సర్వే చేయడానికి నియమించారు.[19] : 85 అయితే, ఆలయాన్ని పునర్నిర్మించాలనే అతని ప్రణాళిక కూడా కార్యరూపం దాల్చలేదు. 1780లో, మల్హర్ రావు కోడలు అహల్యాబాయి హోల్కర్ మసీదు పక్కనే ఉన్న ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించింది.

II 1828లో, గ్వాలియర్ రాష్ట్రానికి చెందిన మరాఠా పాలకుడు దౌలత్ రావ్ సింధియా భార్య అయిన బైజా బాయి, జ్ఞాన్ వాపి ఆవరణలో 40కి పైగా స్తంభాలతో తక్కువ పైకప్పు గల కొలనేడ్‌ను నిర్మించింది. 1833-1840 సమయంలో, జ్ఞానవాపి బావి సరిహద్దు, ఘాట్‌లు, ఇతర సమీపంలోని దేవాలయాలనూ నిర్మించారు. భారత ఉపఖండంలోని వివిధ రాజ్యాలకు చెందిన అనేక గొప్ప కుటుంబాలు ఆలయ కార్యకలాపాల కోసం ఉదారంగా విరాళాలు అందించాయి.

1835లో, సిక్కు సామ్రాజ్యానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్, అతని భార్య మహారాణి దాతర్ కౌర్ ఆదేశానుసారం, ఆలయ గోపురానికి పూత పూయడానికి 1 టన్ను బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు. 1841లో, నాగ్‌పూర్‌కు చెందిన రఘుజీ భోంస్లే III ఆలయానికి వెండిని విరాళంగా ఇచ్చాడు.[19] : 200 [20] 1860వ దశకంలో నేపాల్‌కు చెందిన రాణా బహుమతిగా ఇచ్చిన 7 అడుగుల ఎత్తైన రాతి నంది విగ్రహం కొలనేడ్‌కు తూర్పున ఉంది. 

ఆలయాన్ని పండితులు లేదా మహంతుల వంశపారంపర్య సమూహం నిర్వహించేది. మహంత్ దేవి దత్ మరణం తరువాత, అతని వారసుల మధ్య వివాదం తలెత్తింది. 1900లో, అతని బావ పండిట్ విశేశ్వర్ దయాళ్ తివారీ ఒక దావా వేశారు, దాని ఫలితంగా ఆయన ప్రధాన పూజారిగా ప్రకటించబడ్డారు.[21]

స్వాతంత్ర్యం తరువాత

మార్చు

1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత తర్వాత జరిగిన ఘోరమైన అల్లర్ల కారణంగా వివాదాస్పద జ్ఞాన్‌వాపి మసీదుకు పశ్చిమాన ఉన్న మా శృంగార్ గౌరీ ఆలయ పూజను నిరోధించారు. 2021 ఆగస్టులో ఐదుగురు హిందూ మహిళలు వారణాసిలోని స్థానిక కోర్టులో మా శృంగార్ గౌరీ ఆలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలని పిటిషన్ వేశారు.[22]

 
2021 డిసెంబరు 13 న కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోది.

2019లో, ఆలయానికి గంగా నదికీ మధ్య రాకపోకలను సులభతరం చేయడానికి కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. అక్కడ రద్దీని నివారించడానికి విశాలమైన స్థలాన్ని సృష్టించారు. 2021 డిసెంబరు 13 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ కారిడార్‌ను ప్రారంభించాడు.[23] కారిడార్ ప్రాంతంలోని దాదాపు 1,400 మంది నివాసితులు, వ్యాపారాలను వేరే చోటికి తరలించి పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. గంగేశ్వర్ మహాదేవ్ ఆలయం, మనోకామేశ్వర్ మహాదేవ్ ఆలయం, జౌవినాయక్ ఆలయం, శ్రీ కుంభ మహాదేవ్ ఆలయంతో సహా 40కి పైగా శిథిలమైన, శతాబ్దాల నాటి పురాతన దేవాలయాలను కనుగొని పునర్నిర్మించారని కూడా పేర్కొంది.[24][25]

అయితే, చాలా దేవాలయాలు ధ్వంసమవడమో, వాటి అసలు స్థలాల నుండి మార్చడమో జరిగింది. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణ సమయంలో ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న దేవి భోగ్ అన్నపూర్ణ, శ్రీ లక్ష్మీ నారాయణ్, శ్రీ అవిముక్తేశ్వర మహాదేవ, దేవి పార్వతి యొక్క నాలుగు ఆలయాలు ధ్వంసం కావడంతో ఆలయ పంచాయత్ రూపం మారిపోయింది.

2022 ఫిబ్రవరిలో, దక్షిణ భారతదేశానికి చెందిన అజ్ఞాత దాత 60 కిలోల బంగారం విరాళంగా ఇవ్వడంతో ఆలయ గర్భగుడికి బంగారు పూత పూసారు.[26] బయోమెటీరియల్స్ స్టార్టప్ సంస్థ అయిన ఫూల్.కో ఆలయంలో అలంకరించే పూలను రీసైకిల్ చేస్తోంది.[27]

కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞానవాపి మసీదు వివాదం

మార్చు

జ్ఞానవాsi మసీదు సముదాయం అనేది కుతుబ్ అల్-దిన్ ఐబాక్ వంటి ఇస్లామిక్ పాలకులు అనేక సార్లు అపవిత్రం చేసిన తరువాత, పురాతన కాశీ విశ్వనాథ దేవాలయం శిథిలాల మీద మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించిన వివాదాస్పద నిర్మాణం. ఈ రోజు వరకు, ఈ పురాతన ఆలయ భాగాలు మసీదు బయటి గోడలపై స్పష్టంగా కనిపిస్తాయి. నంది, మా శృంగార గౌరీ విగ్రహాలు దూరం నుండి కూడా చూడవచ్చు.

1936 నుండి ఈ స్థలం యాజమాన్యంపై హిందూ ముస్లిం వర్గాల మధ్య వివాదం ఉంది.

ఆలయ ఆకృతి

మార్చు

ఆలయ సముదాయంలో చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు, నదికి సమీపంలోని విశ్వనాథ గల్లి అనే చిన్న సందులో ఉన్నాయి. మందిరంలోని ప్రధాన దేవత లింగం 60 సెంటీమీటర్లు (24 అం.) పొడవు, 90 సెంటీమీటర్లు (35 అం.) చుట్టుకొలతలో వెండి పానవట్టంలో ఉంటుంది.[28] ప్రధాన ఆలయం చతుర్భుజాకారంలో, చుట్టూ ఇతర దేవతల మందిరాలతో ఉంటుంది. ఈ ఆవరణలో కాలభైరవ, కార్తికేయ, అవిముక్తేశ్వర, విష్ణు, గణేశ, శని, శివుడు, పార్వతిల చిన్న ఆలయాలు ఉన్నాయి.

ఆలయ ఆవరణలో ప్రధాన ఆలయానికి ఉత్తరాన, జ్ఞాన వాపి అనే ఒక చిన్న బావి ఉంది. మొఘలుల దండయాత్ర సమయంలో ఆక్రమణ సమయంలో జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి దాన్ని ఈ బావిలో దాచారు. ఆక్రమణదారుల నుండి జ్యోతిర్లింగాన్ని రక్షించడానికి ఆలయ ప్రధాన పూజారి లింగంతో సహా బావిలో దూకినట్లు చెబుతారు.

లోపలి గర్భ గృహ లేదా గర్భాలయానికి దారితీసే సభా గృహం ఉంది. జ్యోతిర్లింగం ఒక ముదురు గోధుమ రంగు శిల. ఇది గర్భగుడిలో ప్రతిష్ఠించబడి, వెండి పానవట్టంపై ఉంటుంది. మందిరం నిర్మాణం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిదానిలో ఆలయంపై ఒక శిఖరం ఉంటుంది. రెండవది బంగారు గోపురం, మూడవది జెండా త్రిశూలాలతో కూడిన బంగారు శిఖరం.

కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రతిరోజూ దాదాపు 3,000 మంది సందర్శకులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో, ఈ సంఖ్య 1,00,000 అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి సంబంధించి 15.5 మీటర్ల ఎత్తైన బంగారు శిఖరం, బంగారు ఉల్లిపాయ గోపురం ఉన్నాయి . 1835లో మహారాజా రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చిన మూడు గోపురాలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.

కాశీ విశ్వనాథ్ ఆలయానికి, మణికర్ణిక ఘాట్‌కు మధ్య గంగా నది వెంబడి శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడారును నిర్మించారు. ఇక్కడ యాత్రికుల కోసం వివిధ సౌకర్యాలున్నాయి.[29]

ప్రాముఖ్యత

మార్చు

పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న వారణాసి, హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాలలో ఒకటిగా విస్తృతంగా గుర్తింపు పొందింది. కాశీ విశ్వనాథ ఆలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రత్యేకమైన, విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది.

ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, బామాఖ్యప, గోస్వామి తులసీదాస్, స్వామి దయానంద సరస్వతి, సత్యసాయి బాబా, యోగిజీ మహరాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, మహంత్ స్వామి మహారాజ్, గురునానక్‌లతో సహా అనేక మంది ప్రముఖ సాధువులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.[30]  ] ఆలయాన్ని సందర్శించడం, గంగా నదిలో స్నానం చేయడం మోక్ష మార్గంలో నడిపిస్తుందని నమ్ముతారు. అందువల్ల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రయత్నిస్తారు. ఆలయానికి తీర్థయాత్ర చేసిన తర్వాత కనీసం ఒక కోరికనైనా వదులుకోవాలనే సంప్రదాయం కూడా ఉంది. తీర్థయాత్రలో దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని రామేశ్వరంలోని ఆలయాన్ని సందర్శించడం కూడా భాగంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు గంగానది నీటిని తీసుకు వెళ్తారు. గుడిలో ప్రార్థన చేసి ఆ గుడి దగ్గర నుండి ఇసుకను తీసుకువెళ్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం యొక్క అపారమైన ప్రజాదరణ, పవిత్రత కారణంగా, భారతదేశం అంతటా వందలాది దేవాలయాలు అదే నిర్మాణ శైలిలో నిర్మించబడ్డాయి. విశ్వనాథ ఆలయంలో సహజంగా మరణించే వ్యక్తుల చెవుల్లో శివుడే మోక్ష మంత్రాన్ని ఊదుతాడని ఒక ప్రసిద్ధ నమ్మకం.[31]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shri Kashi Vishwanath Temple - A Brief history".
  2. 2.0 2.1 R. 2003, pp. 92-95
  3. Eck 1999, p. 107
  4. See: Gwynne 2008, Section on Char Dham
  5. 5.0 5.1 Lochtefeld 2002, pp. 324-325
  6. Harding 1998, pp. 158-158
  7. Vivekananda Vol. 4
  8. Chaturvedi 2006, pp. 58-72
  9. "Kottiyoor Devaswam Temple Administration Portal". kottiyoordevaswom.com/. Kottiyoor Devaswam. Retrieved 20 July 2013.
  10. Matthew Atmore Sherring (1968). The Sacred City of the Hindus An Account of Benares in Ancient and Modern Times (First ed.). London: Trübner & Company.
  11. 11.0 11.1 Desai, Madhuri (2017). "INTRODUCTION: THE PARADOX OF BANARAS". Banaras Reconstructed: Architecture and Sacred Space in a Hindu Holy City. University of Washington Press. pp. 3–16. ISBN 978-0-295-74160-4.
  12. Satish Chandra. History of Medieval India:800-1700. Orient Longman.
  13. 13.0 13.1 Udayakumar (2005). Presenting the Past: Anxious History and Ancient Future in Hindutva India. Greenwood Publishing Group.
  14. (1996). "Construction and Reconstruction of Sacred Space in Vārāṇasī".
  15. S. P. Udayakumar (1 January 2005). Presenting the Past: Anxious History and Ancient Future in Hindutva India. p. 99.
  16. Pauwels, Heidi (23 March 2011). "A tale of two temples: Mathurā's Keśavadeva and Orcchā's Caturbhujadeva".
  17. Catherine B. Asher (24 September 1992). Architecture of Mughal India. pp. 278–279.
  18. Vanessa Betts (30 October 2013). Delhi to Kolkata Footprint Focus Guide. pp. 108–.
  19. 19.0 19.1 19.2 Madhuri Desai (2007). Resurrecting Banaras: Urban Space, Architecture and Religious Boundaries. ISBN 978-0-549-52839-5.[permanent dead link]
  20. Matthew Atmore Sherring (1868). The Sacred City of the Hindus: An Account of Benares in Ancient and Modern Times.
  21. {{{litigants}}} (28 October 1986). Text
  22. "Varanasi court issues notices on shared shrine petition in Ayodhya". www.telegraphindia.com. Retrieved 12 December 2021.
  23. "PM Modi inaugurates Kashi Vishwanath Corridor". The Indian Express (in ఇంగ్లీష్). 14 February 2022. Retrieved 2022-08-28.
  24. Verma, Lalmani (13 December 2021). "PM Modi to inaugurate Kashi Vishwanath corridor in Varanasi today". The New Indian Express. New Delhi: Express Publications. Retrieved 13 December 2021.
  25. A, Divya (14 December 2021). "Explained: What is changing at the ancient Kashi Vishwanath temple complex?". The Indian Express. Retrieved 14 December 2021.
  26. "God meets gold meets faith in 'PM's works' at Kashi Vishwanath Temple". The Indian Express (in ఇంగ్లీష్). 4 March 2022. Retrieved 5 March 2022.
  27. "Exclusive - India's First Biomaterial Startup Phool.co Raises $8 Million In Series A Funding". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 13 July 2022.
  28. "Cultural holidays - Kashi Vishwanath temple". Archived from the original on 8 April 2017. Retrieved 17 November 2006.
  29. "Temple woes for Kashi Vishwanath corridor".
  30. "History!Kashi Vishwanath temple". Archived from the original on 2019-04-19. Retrieved 2023-01-17.
  31. "Shri Kashi Vishwanath Mandir, Varanasi". templesofindia.org (in ఇంగ్లీష్). Retrieved 20 May 2022.