దాసరి బాలవర్ధనరావు

దాసరి వెంకట బాలవర్ధనరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గన్నవరం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

దాసరి వెంకట బాలవర్ధనరావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 - 2004
2009- 2014
నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
ఆముదాలపల్లి, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎమ్మెల్యేగా పోటీ మార్చు

దాసరి వెంకట బాలవర్ధనరావు తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా పని చేశాడు. ఆయనకు 2014లో టికెట్ దక్కకపోవడంతో ఆయనకు కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(విజయా డైరీ) డెరైక్టర్‌గా నియమితుడయ్యాడు. దాసరి బాలవర్ధనరావు 8 మార్చి 2019న హైదరాబాద్‌లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2]

సంవత్సరం విజేత పేరు పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ
2009 దాసరి బాలవర్ధనరావు తె.దే.పా ముద్రబోయిన వెంకటేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ
2004 ముద్రబోయిన వెంకటేశ్వర రావు స్వతంత్ర అభ్యర్థి దాసరి బాలవర్ధనరావు తె.దే.పా
1999 దాసరి బాలవర్ధనరావు తె.దే.పా ముద్రబోయిన వెంకటేశ్వర రావు కాంగ్రెస్ పార్టీ
1994 గద్దె రామ్మోహన్ రావు స్వతంత్ర అభ్యర్థి దాసరి బాలవర్ధనరావు తె.దే.పా

మూలాలు మార్చు

  1. Sakshi (9 March 2019). "వైఎస్సార్‌ సీపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు". Archived from the original on 12 February 2022. Retrieved 12 February 2022.
  2. The Hans India (9 March 2019). "Balavardhan Rao joins YSRCP, brother to follow suit today" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.