దాసున్ షనక

శ్రీలంక క్రికెటర్

మదగమగమగే దాసున్ షనక, శ్రీలంక క్రికెటర్, శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే మ్యాచ్ ల కెప్టెన్.[1] ఆల్ రౌండర్‌ అయిన దాసున్, కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ గా రాణిస్తున్నాడు.

దాసున్ షనక
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1991-09-09) 1991 సెప్టెంబరు 9 (వయసు 33)
నెగొంబో, శ్రీలంక
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 134)2016 19 May - England తో
చివరి టెస్టు2021 14 January - England తో
తొలి వన్‌డే (క్యాప్ 171)2016 16 June - Ireland తో
చివరి వన్‌డే2023 31 March - New Zealand తో
తొలి T20I (క్యాప్ 58)2015 1 August - Pakistan తో
చివరి T20I2023 8 April - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2011–presentSinhalese Sports Club
2016Rangpur Riders
2017Sylhet Sixers
2018St Lucia Stars
2018–presentChittagong Vikings
2019–2020Cumilla Warriors
2020–presentDambulla Aura
2023Peshawar Zalmi
2023Gujarat Titans
2023Galle Titans
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచ్‌లు 6 48 85 65
చేసిన పరుగులు 140 1,067 1,328 3,337
బ్యాటింగు సగటు 14.00 26.67 21.41 39.72
100లు/50లు 0/1 2/3 0/5 9/18
అత్యుత్తమ స్కోరు 66 108* 74* 130
వేసిన బంతులు 762 570 379 3,585
వికెట్లు 13 15 23 64
బౌలింగు సగటు 33.15 38.20 22.08 34.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/112 5/43 3/16 6/69
క్యాచ్‌లు/స్టంపింగులు 4/0 9/0 29/0 45/0
మూలం: Cricinfo, 13 April 2023

2019లో పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, ఇతని కెప్టెన్సీలో శ్రీలంక సిరీస్‌లో పాకిస్తాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది.[2] 2021 ఫిబ్రవరిలో వెస్టిండీస్ పర్యటనకు ముందు, లసిత్ మలింగ స్థానంలో షనకను అధికారికంగా శ్రీలంక టీ20 కెప్టెన్‌గా నియమించారు.[3] 2021 జూలైలో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టు కెప్టెన్‌గా కూడా షనక ఎంపికయ్యాడు.[4] 2022 ఆసియా కప్‌ను గెలుచుకోవడానికి షనక నాయకత్వం వహించిన శ్రీలంక జట్టు ఆరవసారి గెలిచింది.

మదగమగమగే దాసున్ షనక 1991, సెప్టెంబరు 9న శ్రీలంకలోని నెగొంబోలో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

తన స్నేహితురాలు చెవంతితో 2020 సెప్టెంబరు 5న షనక వివాహం నెగొంబోలోని అవన్రా గార్డెన్ హోటల్‌లో జరిగింది.[5]

దేశీయ , టీ20 ఫ్రాంచైజీ కెరీర్

మార్చు

2016 మేలో ఇంగ్లాండ్ పర్యటనలో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌పై షనక సెంచరీ చేశాడు.[6][7]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం గాల్లె జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[8][9] ఆ తర్వాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం గాల్లె జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.[10]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2015 జూలైలో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం శ్రీలంక ట్వంటీ20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[11] 2015 ఆగస్టు 1న శ్రీలంకకు 58వ టీ20 క్యాప్‌గా తన టీ20 అరంగేట్రం చేసాడు.[12]

అదే పర్యటనలో 2016 మే 19న ఇంగ్లాండ్‌పై శ్రీలంక తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.[13] ఇతను శ్రీలంక తరఫున 134వ టెస్టు ఆటగాడు.[14] ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను అవుట్ చేయడం ద్వారా తన తొలి టెస్టు వికెట్‌ని సాధించాడు. 46 పరుగులకు 3 వికెట్లు తీశాడు. తను రెండు ఇన్నింగ్స్‌లలో 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో ఓడిపోయింది.[13]

2016 జూన్ 16న ఐర్లాండ్‌పై వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.19 బంతుల్లో 42 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు.[15] వన్డేలో అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీసిన పన్నెండవ ఆటగాడిగా, మూడవ శ్రీలంక ఆటగాడిగా రికార్డు సాధించాడు.[16] ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల తర్వాత, అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.[17]

మూలాలు

మార్చు
  1. "Dasun Shanaka". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  2. "Dasun Shanaka joins MS Dhoni in elite list as Sri Lanka clean sweep Pakistan 3-0 in T20I series". India Today. Retrieved 2023-08-25.
  3. "Dasun Shanaka appointed Sri Lanka's T20I captain". ESPN Cricinfo. Retrieved 2023-08-25.
  4. "Dasun Shanaka to replace Kusal Perera as captain". The Papare. Retrieved 2023-08-25.
  5. "Dasun and Chevanthi Happy Wedding!". Silumina. Archived from the original on 2023-04-06. Retrieved 2023-08-25.
  6. "Sri Lanka's Dasun Shanaka scores hundred against Leicestershire". zeenews. 15 May 2016. Retrieved 2023-08-25.
  7. Mehta, Kalika (13 May 2016). "Leicestershire v Sri Lanka: Dasun Shanaka rescues tourists". BBC Sport. Retrieved 2023-08-25.
  8. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-25. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 27 March 2018. Retrieved 2023-08-25.
  10. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-25.
  11. "Five uncapped players in SL squad for Pakistan T20s". ESPNcricinfo. ESPN Sports Media. 23 July 2015. Retrieved 2023-08-25.
  12. "Pakistan tour of Sri Lanka, 2nd T20I: Sri Lanka v Pakistan at Colombo (RPS), Aug 1, 2015". ESPNcricinfo. ESPN Sports Media. Retrieved 2023-08-25.
  13. 13.0 13.1 "Sri Lanka tour of England and Ireland, 1st Investec Test: England v Sri Lanka at Leeds, May 19–23, 2016". ESPNcricinfo. ESPN Sports Media. 19 May 2016. Retrieved 2023-08-25.
  14. Gardner, Alan (18 May 2016). "A new Test of resolve after T20 hiatus". ESPNcricinfo. Retrieved 2023-08-25.
  15. "Sri Lanka tour of England and Ireland, 1st ODI: Ireland v Sri Lanka at Dublin (Malahide), Jun 16, 2016". ESPNcricinfo. ESPN Sports Media. 16 June 2015. Retrieved 2023-08-25.
  16. "Statistics / Statsguru / One-Day Internationals / Bowling records / Career debut / Wickets taken between 5 and 10 / Ordered by start date (ascending)". ESPNcricinfo. Archived from the original on 19 September 2015. Retrieved 2023-08-25.
  17. "Sri Lanka cricket team in Ireland". ESPNcricinfo. Retrieved 2023-08-25.

బాహ్య లింకులు

మార్చు