శ్రీలంక క్రికెట్ జట్టు

(Sri Lanka క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)

శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే జట్టునే శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lankan cricket team ) అని వ్యవహరిస్తారు. ఈ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1975లో తొలి ఒకరోజు ప్రపంచకప్ పోటీలలో ఆడినది. 1981లో ఈ జట్టుకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా లభించింది. ఈ హోదా లభించిన జట్టులలో ఇది 8వది. 1990 దశాబ్దంలో పూర్తిగా క్రిందిస్థాయిలో ఉన్న జట్టు క్రమంగా ఉన్నత స్థానంలోకి చేరినది. 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ సాధించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ఒక స్థానాన్ని సంపాదించి అడపాదడపా విజయాలను నమోదుచేస్తూనే ఉంది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ లాంటి బ్యాట్స్‌మెన్లు, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి బౌలర్లు శ్రీలంకకు గత 15 సంవత్సరాలలో పలు విజయాలు అందజేశారు.

శ్రీలంక
దస్త్రం:Sri Lanka Cricket Cap Insignia.svg
మారుపేరుది లయన్స్
అసోసియేషన్Sri Lanka Cricket
వ్యక్తిగత సమాచారం
టెస్టు కెప్టెన్దిముత్ కరుణరత్నే
ఒన్ డే కెప్టెన్కుసాల్ మెండిస్
Tట్వంటీ I కెప్టెన్దాసున్ శనక
కోచ్క్రిస్ సిల్వర్‌వుడ్
చరిత్ర
టెస్టు హోదా పొందినది1981
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC హోదాఅసోసియేట్ సభ్యుడు (1965)
పూర్తి సభ్యుడు (1981)
సస్పెండ్ చేయబడింది (2023)
ICC ప్రాంతంఆసియా
ఐసిసి ర్యాంకులు ప్రస్తుత[2] అత్యుత్తమ
టెస్టులు 7వ 2nd (2002)
వన్‌డే 7వ 2వ (అక్టోబర్ 1996)[1]
టి20ఐ 8వ 1వ (2012)
టెస్టులు
మొదటి టెస్టుv  ఇంగ్లాండు వద్ద P. సారా ఓవల్, కొలంబో; 17–21 ఫిబ్రవరి 1982
చివరి టెస్టుv  పాకిస్తాన్ వద్ద సింగలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో; 24–27 జూలై 2023
టెస్టులు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[3] 313 100/121
(92 draws)
ఈ ఏడు[4] 6 2/4
(0 draws)
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పోటీ2 (first in 2019–2021)
అత్యుత్తమ ఫలితం5th place (2021–2023)
వన్‌డేలు
తొలి వన్‌డేv  వెస్ట్ ఇండీస్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్; 7 జూన్ 1975
చివరి వన్‌డేv  న్యూజీలాండ్ at M. Chinnaswamy Stadium, Bangalore; 9 November 2023
వన్‌డేలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[5] 909 415/450
(5 ties, 39 no results)
ఈ ఏడు[6] 31 16/15
(0 ties, 0 no results)
పాల్గొన్న ప్రపంచ కప్‌లు13 (first in 1975)
అత్యుత్తమ ఫలితం Champions (1996)
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ2 (first in 1979)
అత్యుత్తమ ఫలితం Champions (1979, 2023)
ట్వంటీ20లు
తొలి టి20ఐv  ఇంగ్లాండు వద్ద ది రోజ్ బౌల్, సౌతాంప్టన్; 15 జూన్ 2006
చివరి టి20ఐv  న్యూజీలాండ్ వద్ద M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు; 9 నవంబర్ 2023
టి20ఐలు ఆడినవి గెలిచినవి/ఓడినవి
మొత్తం[7] 180 79/95
(4 ties, 2 no results)
ఈ ఏడు[8] 7 2/5
(1 ties, 0 no results)
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ8 (first in 2007)
అత్యుత్తమ ఫలితం Champions (2014)

Test kit

ODI kit

T20I kit

As of 9 November 2023

అక్టోబర్ 2007 నాటికి శ్రీలంక 170 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 29.41% విజయాలు సాధించగా, 37.05% పరాజయాలు పొందినది. 33.52% డ్రాగా ముగించింది.

శ్రీలంక క్రికెట్ జట్టు చరిత్ర

మార్చు

1972కు పూర్వం సిలోన్ అనబడే శ్రీలంక దేశంలో 1926-27లో మొట్టమొదటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ పోటీ కొలంబోలోని విక్టోరియా పార్క్‌లో నిర్వహించారు. అందులో శ్రీలంక ఇన్నింగ్స్ ఓటమిని పొందినది.[9] శ్రీలంక జట్టుకు తొలి విజయం పటియాలాలోని ధ్రువ్‌పాండవ్ స్టేడియంలో 1932-33లో జరిగిన మ్యాచ్‌లో దక్కినది.[10]

1981లో శ్రీలంక జట్టుకు టెస్ట్ హోదా కల్పించబడింది. ఈ హోదా పొందిన దేశాలలో ఇది ఎనిమిదవది. 1982లో ఈ జట్టు తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అంతకు ముందే 1975లో జరిగిన మొదటి ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో పాల్గొని అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడినది. 1990 దశకంలో ఈ జట్టు శక్తివంతమైన ప్రదర్శన ప్రదర్శించింది. ఇదే ఊపుతో 1996లో భారత ఉపఖండంలో జరిగిన 6వ ప్రపంచ కప్ పోటీలలో విశ్వవిజేతగా నిల్చి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపర్చింది. 2003లో దక్షిణాఫ్రికాలో నిర్వహించబడిన ప్రపంచ కప్‌లో కూడా సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగింది. 2007లో ఫైనల్ వరకు దూసుకెళ్ళింది.

వివిధ టోర్నమెంట్లలో శ్రీలంక జట్టు ఆట ప్రదర్శన

మార్చు
వన్డే ప్రపంచ కప్ ఐసిసి చాంపియన్ ట్రోఫీ ఆసియా కప్ ఆస్ట్రేలేషియా కప్ కామన్వెల్త్ క్రీడలు ఐఐచి ట్రోఫీ
  • 1975 : మొదటి రౌండ్
  • 1979 : మొదటి రౌండ్
  • 1983 : మొదటి రౌండ్
  • 1987 : మొదటి రౌండ్
  • 1992 : 8 వ స్థానం
  • 1996 : చాంపియన్
  • 1999 : మొదటి రౌండ్
  • 2003 : సెమీఫైనల్
  • 2007 : రెండో స్థానం
  • 2011 : రెండో స్థానం
  • 2015 : రెండవరౌండ్
  • 1998: సెమీ ఫైన్స్
  • 2000: క్వార్టర్ ఫైనల్
  • 2002: భారత్‌తో కల్సి సంయుక్త విజేత
  • 2004: ప్రాథమిక రౌండ్
  • 2006: మెయిన్ రౌండ్
  • 2009: ప్రాథమిక రౌండ్
  • 2013: సెమీ ఫైనల్
  • 2017: ప్రాథమిక రౌండ్
  • 1984: రెండో స్థానంp
  • 1986: చాంపియన్
  • 1988: రెండో స్థానం
  • 1990-91: రెండో స్థానం
  • 1995: రెండో స్థానం
  • 1997: చాంపియన్
  • 2000: రెండో స్థానం
  • 2004: చాంపియన్
  • 2008: చాంపియన్
  • 2010: రెండో స్థానం
  • 2012: సెమీ ఫైనల్
  • 2014: చాంపియన్
  • 2016: సెమీ ఫైనల్
  • 1986: సెమీ ఫైనల్
  • 1990: సెమీ ఫైనల్
  • 1994: మొదటి రౌండ్
  • 1998: నాల్గవ స్థానం
  • 1979: చాంపియన్
  • 1982 తరువాత: టెస్ట్ హోదా పొందినందున పాల్గొనే అర్హతలేదు

శ్రీలంక జట్టు రికార్డులు

మార్చు

టెస్ట్ క్రికెట్ రికార్డులు

మార్చు
  • జట్టు అత్యధిక స్కోరు : 952/6 (భారత్ పై, 1997) (ప్రపంచ రికార్డు)
  • టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ : మహేలా జయవర్థనే (7271 పరుగులు)
  • అత్యధిక టెస్టులు ఆడినది : ముత్తయ్య మురళీధరన్ (118 టెస్టులు)
  • అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించినది : అర్జున రణతుంగ (56 టెస్టులు, 1988 నుంచి 1999 వరకు)
  • టెస్ట్ ఇన్నింగ్సులో అత్యధిక వ్యక్తిగత స్కోరు : 374 (మహేలా జయవర్థనే, దక్షిణాఫ్రికాపై, 2006లో)
  • టెస్టు ఇన్నింగ్సులో అత్యధిక భాగస్వామ్య పరుగులు : 624 (మూడవ వికెట్టుకు) (కుమార సంగక్కర, మహేలా జయవర్థనే), దక్షిణాఫ్రికాపై, 2006లో (ప్రపంచ రికార్డు)
  • టెస్టులలో అత్యధిక సెంచరీలు సాధించినది : మహేలా జయవర్థనే (21)
  • టెస్టులలో అత్యధిక అర్థసెంచరీలు సాధించినది : అర్జున రణతుంగ (38)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మరళీషరన్ (723+) (ప్రపంచ రికార్డు)
  • ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సార్లు 5 వికెట్లు సాధించినది : ముత్తయ్య మురళిధరన్ (62) (ప్రపంచ రికార్డు)
  • ఒకే టెస్టులో 10 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (20) (ప్రపంచ రికార్డు)
  • టెస్ట్ ఇన్నింగ్సులో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ : 51/9 (ముత్తయ్య మురళీధరన్, జింబాబ్వే పై, 2002)
  • బౌల్డ్ ద్వారా అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (157) (ప్రపంచ రికార్డు)
  • స్టంపింగ్ ద్వారా అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (41) (ప్రపంచ రికార్డు)

వన్డే క్రికెట్ రికార్డులు

మార్చు
  • అత్యధిక టీం స్కోరు : 443/9 ) నెదర్లాండ్ పై, 2006) (ప్రపంచ రికార్డు)
  • వన్డేలలో అత్యధిక పరుగులు చేసినది : సనత్ జయసూర్య (12,116)
  • అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడినది : సనత్ జయసూర్య (403)
  • అత్యధిక వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించినది : అర్జున రణతుంగ (193)
  • వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు : 189 (సనత్ జయసూర్య, భారత్‌పై, 2000లో)
  • అత్యధిక భాగస్వామ్య పరుగులు : 286 (తొలి వికెట్టుకు, సనత్ జయసూర్య, ఉపల్ తరంగ) (ప్రపంచ రికార్డు)
  • అత్యధిక వన్డే సెంచరీలు సాధించినది : సనత్ జయసూర్య (25)
  • అత్యధిక వన్డే అర్థసెంచరీలు సాధించినది : అరవింద డి సిల్వ, సనత్ జయసూర్య (64 చొప్పున)
  • వన్డేలో అతివేగంగా సెంచరీ సాధించినది : సనత్ జయసూర్య (17 బంతులలో ) (ప్రపంచ రికార్డు)
  • ఒకే వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ : సనత్ జయసూర్య (11)
  • వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ : సనత్ జయసూర్య (242)
  • వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించినది : ముత్తయ్య మరళీధరన్ (455)
  • వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ : 19/8 (చమిండా వాస్, జింబాబ్వే పై, 2001లో) (ప్రపంచ రికార్డు)
  • ఒకే వన్డేలో 5 వికెట్లను అత్యధిక సార్లు సాధించినది : ముత్తయ్య మురళీధరన్ (8)
  • 4 వరస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్ : లసిత్ మలింగ (దక్షిణాఫ్రికాపై, 2007లో) (ప్రపంచ రికార్డు)
  • ఒకే వన్డేలో 8 వికెట్లను సాధించిన ఏకైక బౌలర్ : చమిండా వాస్ (ప్రపంచ రికార్డు)

శ్రీలంక టెస్ట్ క్రికెట్ కెప్టెన్లు

మార్చు
శ్రీలంక టెస్ట్ క్రికెట్ కెప్టెన్లు
క్ర.సం పేరు టెస్టులు గెలుపు ఓటమి డ్రా
1 బండుల వర్ణపుర 4 0 3 1
2 దులీప్ మెండిస్ 19 2 8 9
3 సోమచంద్ర డి సిల్వ 2 0 2 0
4 రంజన్ మధుగలె 2 0 2 0
5 అర్జున రణతుంగె 56 12 19 25
6 అరవింద డి సిల్వ 6 0 4 2
7 హసన్ తిలకరత్నె 11 1 4 6
8 సనత్ జయసూర్య 38 18 12 8
9 మర్వన్ ఆటపట్టు 18 8 6 4
10 మహేల జయవర్థనే 14 6 4 4
మొత్తము 170 47 64 59

శ్రీలంక వన్డే క్రికెట్ కెప్టెన్లు

మార్చు
శ్రీలంక వన్డే క్రికెట్ కెప్టెన్లు
క్ర.సం పేరు వన్డేలు గెలుపు టై ఓటమి ఫలితం తేలనివి
1 అనుర టెన్నెకూన్ 4 0 0 4 0
2 బండుఅ వర్ణపుర 8 3 0 5 0
3 దులీప్ మెండిస్ 61 11 0 46 4
4 సోమచంద్ర డి సిల్వ 1 0 0 1 0
5 రంజన్ మధుగలె 13 2 0 11 0
6 అర్జున రణతుంగ 193 89 1 95 8
7 రవి రత్నాయకె 1 1 0 0 0
8 అరవింద డి సిల్వ 18 5 0 12 1
9 రోషన్ మహానామా 2 0 0 2 0
10 సనత్ జయసూర్య 117 65 2 47 3
11 మర్వన్ ఆటపట్టు 63 35 0 27 1
12 మహేలా జయవర్థనే 26 19 0 6 1
13 చమిండా వాస్ 1 0 1 0 0
మొత్తము 502 226 3 255 18

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "1996 ODI Rankings". icc-cricket.org. International Cricket Council. 20 March 2013. Archived from the original on 20 మార్చి 2013. Retrieved 13 November 2023.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "ICC Rankings". International Cricket Council.
  3. "Test matches - Team records". ESPNcricinfo.
  4. "Test matches - 2023 Team records". ESPNcricinfo.
  5. "ODI matches - Team records". ESPNcricinfo.
  6. "ODI matches - 2023 Team records". ESPNcricinfo.
  7. "T20I matches - Team records". ESPNcricinfo.
  8. "T20I matches - 2023 Team records". ESPNcricinfo.
  9. "Ceylon v Marylebone Cricket Club in 1926/27". CricketArchive. Retrieved 2007-05-06.
  10. "Patiala v Ceylon in 1932/33". CricketArchive. Retrieved 2007-05-06.