దిక్సూచి (సినిమా)
దిక్సూచి 2019లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్.ఆర్.ఎస్ అసోసియేట్స్ బ్యానర్ పై నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల నిర్మించిన ఈ సినిమాకు దిలీప్‌కుమార్ సలాది దర్శకత్వం వహించాడు.[1] దిలీప్‌కుమార్ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని, సమీరా, స్వప్నిక, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 ఏప్రిల్ 2019న విడుదలైంది.[2]
దిక్సూచి | |
---|---|
దర్శకత్వం | దిలీప్‌కుమార్ సలాది |
నిర్మాత | నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల |
తారాగణం | దిలీప్‌కుమార్ సలాది, ‘ఛత్రపతి’ శేఖర్, సమ్మెట గాంధీ, చాందిని |
ఛాయాగ్రహణం | జయకృష్ణ, రవి కొమ్మి |
సంగీతం | పద్మనాబ్ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.ఎస్ అసోసియేట్స్ |
విడుదల తేదీ | 26 ఏప్రిల్ 2019 |
సినిమా నిడివి | 120 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుదిలీప్ ( దిలీప్ కుమార్ ) ఓ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు . అయితే ట్రైన్ లో వెళ్తున్న సమయంలో ఓ అపరిచితుడు ఫోన్ చేసి నేను చెప్పిన పని చేయకపోతే నీ వాళ్ళని అంతం చేస్తానని హెచ్చరిస్తాడు దాంతో భయపడిపోయిన దిలీప్ ఆ ఆగంతకుడు చెప్పినట్లు చేస్తాడు. అయితే తనకు తెలియకుండానే తన అమ్మ, చెల్లిని కిడ్నాప్ చేస్తాడు దిలీప్ దాంతో వాళ్ళని కాపాడుకోవడానికి ఏం చేశాడు ? అసలు దిలీప్ కు ఫోన్ చేసి తన వాళ్ళని తన చేతే కిడ్నాప్ చేయించిన ఆ ఆగంతకుడు ఎవరు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- దిలీప్‌కుమార్ సలాది
- ఛత్రపతి శేఖర్
- సమ్మెట గాంధీ
- చాందిని
- సమీరా
- స్వప్నిక
- బిత్తిరి సత్తి
- రాకేష్
- మల్లాది భాస్కర్
- సుమన్
- రజితసాగర్
- అరుణ్‌బాబు
- ధన్వి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎస్.ఆర్.ఎస్ అసోసియేట్స్
- నిర్మాత: నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దిలీప్‌కుమార్ సలాది
- సంగీతం: పద్మనాబ్ భరద్వాజ్
- సినిమాటోగ్రఫీ:జయకృష్ణ, రవికొమ్మి
మూలాలు
మార్చు- ↑ Sakshi (21 March 2019). "సమాజానికి దిక్సూచి". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
- ↑ The Times of India (26 April 2019). "Diksoochi Movie". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
- ↑ The Hans India (27 April 2019). "Diksoochi Movie Review & Rating {2.75}" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.