దిలీప్ బాబాసాహెబ్ భోస్లే

భారత న్యాయమూర్తి

జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే (జ. 1956 అక్టోబరు 24) భారత న్యాయమూర్తి. 2019, మార్చి 23 నుండి లోక్‌పాల్ కమిటీ జ్యుడిషియల్ సభ్యుడిగా ఉన్నాడు. 70 సంవత్సరాల వయస్సు తరువాత ఈ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నాడు. 2016 జూలై నుండి 2018 అక్టోబరు వరకు అలహాబాదులోని హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[2]

జస్టిస్
దిలీప్ బాబాసాహెబ్ భోసలే
జ్యుడిషియల్ సభ్యుడు, లోక్‌పాల్
Assumed office
23 మార్చి 2019
Appointed byరామ్‌నాథ్‌ కోవింద్‌
అంతకు ముందు వారుPosition Established
అలహాబాద్‌ హైకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి
In office
30 జూలై 2016 – 23 అక్టోబరు 2018
Appointed byప్రణబ్ ముఖర్జీ
అంతకు ముందు వారుధనంజయ వై. చంద్రచూడ్
తరువాత వారుగోవింద్ మాథుర్
హైదరాబాదు హైకోర్టు న్యాయమూర్తి
In office
8 డిసెంబరు 2014 – 29 జూలై 2016
Appointed byప్రణబ్ ముఖర్జీ
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
In office
6 జనవరి 2012 – 7 డిసెంబరు 2014
Appointed byప్రతిభా పాటిల్
ముంబై హైకోర్టు న్యాయమూర్తి
In office
22 జనవరి 2001 – 5 జనవరి 2012
Appointed byకె.ఆర్. నారాయణన్
వ్యక్తిగత వివరాలు
జననం (1956-10-24) 1956 అక్టోబరు 24 (వయసు 68)
జీవిత భాగస్వామిఅరుంధతి (వి. 1982)
సంతానం2
తండ్రిబాబాసాహెబ్ భోసలే
కళాశాలప్రభుత్వ న్యాయ కళాశాల (ముంబై)[1]

జీవిత విషయాలు

మార్చు

దిలీప్ 1956, అక్టోబరు 24న మహారాష్ట్ర లోని సాతారా జిల్లాలో జన్మించాడు.[3] ఇతని తండ్రి బాబాసాహెబ్ భోసలే 1982 నుండి 1983 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామయ్య శివాజీరావు ఔరంగాబాదులోని మరాఠ్వాడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. జస్టిస్ భోసలే ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయవిద్యను అభ్యసించాడు.[4][5]

వృత్తిజీవితం

మార్చు

1980 జూన్ నెలలో బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించినప్పుడు అక్కడి బార్‌ అసోసియేషన్ లో చేరాడు. 1986 నుండి 1991 వరకు కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశాడు. 2001, జనవరిలో బొంబాయి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా పొందాడు. 2012 నుండి కర్ణాటక హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా ఉన్నాడు.[6][7] ఆయన 2014 డిసెంబరు 8 [8] నుండి 2016 జూలై 29 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 2016, జూలై 30న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. 2018, అక్టోబరు 23న హైకోర్టు నుంచి పదవీ విరమణ చేశాడు.

గుర్తించదగిన తీర్పులు

మార్చు
  • భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ నామినేషన్లు దాఖలు చేసే చివరి తేదీ వరకు ఎన్నికల జాబితా నుండి నకిలీ పేర్లను తొలగించే అధికారాన్ని భారత ఎన్నికల సంఘానికి ఉందని తీర్పు ఇచ్చింది.[9]

మూలాలు

మార్చు
  1. "Hon'ble Mr. Justice Dilip Babasaheb Bhosale (CJ)". www.allahabadhighcourt.in. Retrieved 2021-06-16.
  2. "Lokpal: Meet the men and women who will probe corruption". qrius.com. Retrieved 2021-06-16.
  3. "Hon'ble Mr.Justice Dilip Babasaheb Bhosale". www.supremecourtcaselaw.com. Archived from the original on 2016-10-04. Retrieved 2021-06-16. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "The Hon'ble The Acting Chief Justice Dilip Babasaheb Bhosale". hc.tap.nic.in. Retrieved 2021-06-16.
  5. Sakshi (6 December 2014). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
  6. "Hon'ble Mr. Justice Dilip Babasaheb Bhosale". www.supremecourtcaselaw.com. Archived from the original on 2016-10-04. Retrieved 2021-06-16. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "Former Hon'ble Judges of High Court of Karnataka elevated as Chief Justice of other High Courts". karnatakajudiciary.kar.nic.in. 2014. Retrieved 2021-06-16.
  8. Sakshi (9 December 2014). "హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భోస్లే బాధ్యతల స్వీకరణ". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
  9. "Allahabad high court: Voter list can be corrected till last date of filing nomination". The Times of India. 2017-01-14. Retrieved 2021-06-16.