దిలీప్ సింగ్ భూరియా
దిలీప్ సింగ్ భూరియా (18 జూన్ 1944 - 24 జూన్ 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రత్లాం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
దిలీప్ సింగ్ భూరియా | |||
ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 2002-2004 | |||
పదవీ కాలం 1980 - 1998 | |||
నియోజకవర్గం | రత్లాం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 18 జూన్ 1944 | ||
మరణం | 2015 జూన్ 24 గుర్గావ్ , భారతదేశం | (వయసు 71)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చుదిలీప్ సింగ్ భూరియా కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1972లో పెట్‌లావాడ్ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1980లో తొలిసారి రత్లాం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తరువాత 1996 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో ఓడిపోయి 2014లో తిరిగి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. దిలీప్ సింగ్ భూరియా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 2002 నుండి 2004 వరకు జాతీయ ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.
మరణం
మార్చుదిలీప్ సింగ్ భూరియా 2015 జూన్ 25న గుర్గావ్‌లోని ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.[1][2]
మూలాలు
మార్చు- ↑ The Times of India (24 June 2015). "BJP MP Dileep Singh Bhuria, 71, is dead". Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.
- ↑ The Hindu (24 June 2015). "BJP MP Dileep Bhuria passes away" (in Indian English). Archived from the original on 20 August 2024. Retrieved 20 August 2024.