దిల్షాన్ మధుశంక

శ్రీలంక క్రికెటర్

లోకుమారక్కలగే దిల్షన్ మధుశంక (జననం 2000, సెప్టెంబరు 18) శ్రీలంక క్రికెటర్. ప్రస్తుతం శ్రీలంక తరపున ట్వంటీ20 ఇంటర్నేషనల్స్ ఆడుతున్నాడు.[1] [2] హంగామాలోని హంగామా విజయబా సెంట్రల్ కళాశాలలో చదివాడు.

దిల్షన్ మధుశంక
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లోకుమారక్కలగే దిల్షన్ మధుశంక
పుట్టిన తేదీ (2000-09-18) 2000 సెప్టెంబరు 18 (వయసు 24)
హంబంతోట, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 164)2023 జూలై 24 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 206)2023 జనవరి 10 - ఇండియా తో
చివరి వన్‌డే2023 జూలై 9 - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 95)2022 ఆగస్టు 27 - Afghanistan తో
చివరి T20I2023 ఏప్రిల్ 5 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ ఫక్లా ట్వంటీ20
మ్యాచ్‌లు 8 9
చేసిన పరుగులు 61 2
బ్యాటింగు సగటు 61.00 1.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 18* 1*
వేసిన బంతులు 1,114 192
వికెట్లు 29 11
బౌలింగు సగటు 22.20 26.36
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 6/33 3/24
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 3/–
మూలం: ESPNcricinfo, 14 April 2023

దేశీయ క్రికెట్

మార్చు

2020, మార్చి 13న 2019–20 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[3] 2020 అక్టోబరులో, లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం దంబుల్లా వైకింగ్ చేత డ్రాఫ్ట్ చేయబడ్డాడు.[4] 2020 లంక ప్రీమియర్ లీగ్‌లో దంబుల్లా వైకింగ్ కోసం 2020 డిసెంబరు 9న ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[5]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2020 జనవరిలో, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[6] 2020 జనవరి 27న, నైజీరియాతో జరిగిన శ్రీలంక ప్లేట్ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో, ఐదు వికెట్ల పంట సాధించాడు.[7]

2022, జూన్ 8న లిస్ట్ ఎ అరంగేట్రం చేసాడు.[8]

2023, జనవరి 10న భారత్‌పై వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు.[9] రోహిత్ శర్మను ఔట్ చేసి తన తొలి వన్డే వికెట్‌ను తీశాడు. 2023, జూలై 24న పాకిస్థాన్‌పై తన టెస్టు అరంగేట్రం చేశాడు.[10]

మూలాలు

మార్చు
  1. "Dilshan Madushanka". ESPN Cricinfo. Retrieved 13 March 2020.
  2. "From soft-ball cricket to youth internationals, the tale of Dilshan Madushanka". The Papare. Retrieved 13 March 2020.
  3. "Group A, Premier League Tournament Tier A at Colombo (Colts), Mar 13-15 2020". ESPN Cricinfo. Retrieved 13 March 2020.
  4. "Chris Gayle, Andre Russell and Shahid Afridi among big names taken at LPL draft". ESPN Cricinfo. Retrieved 22 October 2020.
  5. "17th Match (N), Hambantota, Dec 9 2020, Lanka Premier League". ESPN Cricinfo. Retrieved 4 December 2020.
  6. "Sri Lanka squad for the ICC U19 World Cup 2020 announced". The Papare. Retrieved 6 January 2020.
  7. "Ravindu Rasantha century, Dilshan Madushanka five-for in Sri Lanka's victory over Nigeria; England thump Japan". ESPN Cricinfo. Retrieved 13 March 2020.
  8. "1st unofficial ODI, Colombo (SSC), June 08, 2022, Australia A tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 8 June 2022.
  9. "1st ODI (D/N), Guwahati, January 10, 2023, Sri Lanka tour of India". ESPNcricinfo. Retrieved 24 July 2023.
  10. "2nd Test, Colombo (SSC), July 24 - 28, 2023, Pakistan tour of Sri Lanka". ESPNcricinfo. Retrieved 24 July 2023.

బాహ్య లింకులు

మార్చు