దిల్‍సుఖ్‍నగర్
దిల్‍సుఖ్‍నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంది. నగరంలోని అతిపెద్ద వాణిజ్య, నివాస కేంద్రాలలో ఇది ఒకటి.[1] గతంలో హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉన్న దిల్‍సుఖ్‍నగర్, ఆ తరువాత హైదరాబాదు మహానగరపాలక సంస్థలో విలీనం చేయబడింది.
దిల్‍సుఖ్‍నగర్ | |
---|---|
పరిసరప్రాంతం | |
Coordinates: 17°22′08″N 78°31′29″E / 17.368784°N 78.524652°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
నగరం | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500060 |
Vehicle registration | టిఎస్ 08 |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
చరిత్ర
మార్చుమలక్పేట చుట్టూ ఉన్న వ్యవసాయ భూయజమాని దిల్‍సుఖ్ రాంప్రసాద్ పేరు మీదుగా దిల్‍సుఖ్‍నగర్ అనే పేరు వచ్చింది. రాంప్రసాద్ తన భూమిని ప్లాట్లుగా విభజించి, ఒక కాలనీని నిర్మించి, దానికి దిల్‍సుఖ్‍నగర్ అని పేరు పెట్టాడు. గతంలో పూర్తిగా నివాస శివారు ప్రాంతంగా ఉన్న దిల్‍సుఖ్‍నగర్ దశాబ్దకాలంలో బలమైన ఆర్థిక వృద్ధి కలిగిన ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. ఇక్కడ సాయిబాబా దేవాలయం ఉంది.
పరిపాలన
మార్చు2007లో దిల్‍సుఖ్‍నగర్ ప్రాంతం హైదరాబాదు మహానగరపాలక సంస్థలో విలీనం చేయబడింది.
రవాణా
మార్చుదిల్సుఖ్నగర్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ఉంది.[2] దిల్‍సుఖ్‍నగర్ సమీపంలోని మలక్‌పేటలో హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్. స్టేషను ఉంది.[3] ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలోని దిల్‍సుఖ్‍నగర్ మెట్రో స్టేషను కూడా ఉంది.
సంఘటనలు
మార్చుఈ ప్రాంతం రెండుసార్లు ఉగ్రవాద దాడులకు గురైంది. రెండుసార్లు టైమ్ బాంబు ఉపయోగించి ఇక్కడ దాడులు జరిపారు. 2002లో మొదటి సంఘటన జరిగింది. ఈ దాడి విషయంలో సిమి అనే ఉగ్రవాద సంస్థపై ఆరోపణలు ఉన్నాయి, దీనిపై దర్యాప్తు జరుగుతోంది.[4] రెండవసారి 2013లో జంట పేలుళ్ళ ఘటనలో 13మంది చనిపోగా, 83మంది గాయపడ్డారు.[5] తరువాతి రోజుల్లో మరణాల సంఖ్య 17కి పెరిగింది.[6] భారతీయ ముజాహిదీన్ అనే ఒక ఉగ్రవాద సంస్థ సభ్యులు ఈ పేలుళ్ళకు పాల్పడ్డారు.[7]
మూలాలు
మార్చు- ↑ Saibaba, Ch (2014-06-17). "Dilsukhnagar: A congested commercial centre". www.thehansindia.com. Retrieved 2020-12-10.
- ↑ "TSRTC Bus Depots". www.tsrtc.telangana.gov.in. Archived from the original on 2020-11-08. Retrieved 2020-12-10.
- ↑ "SCR - MMTS Brochure" (PDF).
- ↑ Jul 19, TNN / Updated:; 2011; Ist, 05:00. "'2002 temple blast accused brought to city". The Times of India. Retrieved 2020-12-10.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ Bureau, City (2013-02-21). "The Hindu Archive: 13 killed, 83 injured as twin blasts rock Hyderabad". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-10.
- ↑ Reporter, Staff (2013-03-06). "Dilsukhnagar bomb blast toll rises to 17". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-10.
- ↑ Ramu, Marri (2016-12-13). "Five IM men convicted for Hyderabad blasts". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-10.
ఇతర లంకెలు
మార్చు