మలక్‌పేట, హైదరాబాదు
మలక్‌పేట్ (Malakpet) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా సేవకుడైన మాలిక్ యాకుబ్ పేరుమీదుగా ఈ ప్రాంతానికి మలక్‌పేట అని పేరు వచ్చింది. ఇది పాత మలక్‌పేట, కొత్త మలక్‌పేట అని రెండు భాగాలుగా ఉంది.
మలక్‌పేట | |
---|---|
పాతబస్తీ | |
![]() | |
Coordinates: 17°22′N 78°30′E / 17.367°N 78.500°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500 036 |
Vehicle registration | టిఎస్-11 |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | మలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
స్థానం సవరించు
మలక్‌పేట ఉత్తర దిక్కులో అంబర్‌పేట, ముసరాంబాగ్, తూర్పు దిక్కులో దిల్‌సుఖ్‌నగర్, పడమర దిక్కులో చాదర్‌ఘాట్, దక్షిణ దిక్కులో సైదాబాద్ ఉన్నాయి.
చారిత్రక విశేషాలు సవరించు
చారిత్రాత్మకమైన రేమండ్స్ స్తూపం ఇక్కడ ఒక కొండపైన నిర్మించబడింది. 1902వ సంవత్సరంలో మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మహబూబ్ మాన్షన్ అనే రాజభవనం నిర్మించబడింది.[1]
వ్యాపారం సవరించు
ఈ నామ్ మార్కెటింగ్‌లో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ దేశ మార్కెట్లకే ఆదర్శంగా నిలిచింది.[2]
ఆసుపత్రులు సవరించు
మలక్‌పేటలో సౌకర్యవంతమైన అనేక మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి.
- ఎం.ఎన్. ఏరియా ఆసుపత్రి
- సుషుత్ర ఆసుపత్రి
- బీబీ క్యాన్సర్ ఆసుపత్రి
- వీనస్ ఆసుపత్రి
- న్యూ లైఫ్ ఆసుపత్రి
- యశోదా ఆసుపత్రి
- హెగ్డే ఆసుపత్రి
- ఫర్హాత్ ఆసుపత్రి
వనాలు సవరించు
ఇక్కడ తాళజాతి మొక్కల వనము ఉంది. దీనిని 2002 సంవత్సరంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రారంభించింది.
రవాణా సవరించు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి మలక్‌పేటకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ మలక్‌పేట రైల్వే స్టేషను, మలక్‌పేట మెట్రో స్టేషను కూడా ఉన్నాయి.
మూలాలు సవరించు
- ↑ Rohit P S. "A mansion goen to the dogs". Times of India. Retrieved 28 January 2019.
- ↑ నమస్తే తెలంగాణ, జిందగీ (15 April 2018). "మలక్‌పేట..దేశ మార్కెట్లకే ఆదర్శం". Retrieved 11 July 2018.