దిల్ బెచారా 2020లో విడుదలైన హిందీ సినిమా. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ చ‌బ్రా దర్శకత్వం వహించాడు.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజ‌న సంఘీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 24 జూలై 2020న డిస్నీ హాట్ స్టార్‌లో విడుద‌లైంది.[3]

దిల్ బెచారా
దర్శకత్వంముఖేష్ చ‌బ్రా
స్క్రీన్ ప్లేసుప్రతిమ్ సేన్ గుప్తా
శశాంక్ ఖైతాన్
దీనిపై ఆధారితంజాన్ గ్రీన్ నవల - ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్
నిర్మాతఫాక్స్ స్టార్ స్టూడియోస్‌
తారాగణంసుశాంత్ సింగ్ రాజ్‌పుత్
సంజ‌న సంఘీ
ఛాయాగ్రహణంసేతు
కూర్పుఆరిఫ్ షేక్
సంగీతంఏ.ఆర్‌. రెహమాన్‌
నిర్మాణ
సంస్థ
ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌
పంపిణీదార్లుడిస్నీ + హాట్ స్టార్
విడుదల తేదీ
2020 జూలై 24 (2020-07-24)
సినిమా నిడివి
101 నిముషాలు
దేశం భారతదేశం
భాషహిందీ
బడ్జెట్25–30 కోట్లు[1]
బాక్సాఫీసు2వేల కోట్ల [2]

కథ మార్చు

మన్నీ(సుశాంత్ సింగ్), కిజీ బాసు (సంజన సంఘీ) ఇద్దరు క్యాన్స‌ర్‌ పేషెంట్స్. మన్నీ క్యాన్సర్ ని లెక్క చేయకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కిజీ బాసు మామూలు కోరికలు ఉన్న అమ్మాయిలాగే ఉన్నా కూడా కేన్సర్ కారణంగా అన్నింటికి దూరంగా ఉంటుంది. అలాంటి ఆమె జీవితంలోకి మ్యానీ వస్తాడు. కిజీ బాసూ. తెలియకుండానే మన్నీతో ప్రేమలో పడిపోతుంది. ఇద్దరూ ఎప్పుడు చనిపోతారో తెలియని విషమ పరిస్థితుల్లోనే ఉంటారు. అలాంటి తరుణంలో కిజీ కోరికలను కూడా ఒక్కొక్కటిగా తీరుస్తుంటాడు మ్యానీ. క్యాన్సర్ పేషెంట్స్ గా చివరి దశలో ఉన్న ఈ ప్రేమ జంట కథ ఎలా ముగిసింది? అనేది మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • ద‌ర్శక‌త్వం : ముఖేష్ చ‌బ్రా
  • నిర్మాణం : ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌
  • సంగీతం : ఏ.ఆర్‌. రెహమాన్‌

మూలాలు మార్చు

  1. Jha, Lata (25 జూలై 2020). "Sushant Singh Rajput's Dil Bechara notches up biggest opening for Disney+Hotstar". Livemint (in ఇంగ్లీష్). Archived from the original on 5 సెప్టెంబరు 2020. Retrieved 23 ఆగస్టు 2020.
  2. Velugu, V6 (30 జూలై 2020). "2వేల కోట్ల క‌లెక్ష‌న్సా..దిల్ బెచారా వ‌సూళ్ల ప్ర‌వాహం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 జూన్ 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Andhrajyothy (7 జూలై 2020). "సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' ట్రైలర్‌కు రికార్డ్ లైక్స్". andhrajyothy. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 జూన్ 2021.
  4. India Today (24 జూలై 2020). "Dil Bechara Movie Review: Sushant Singh Rajput's swan song". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 జూన్ 2021.