దివ్యభారతి (తమిళ నటి)

ఈ వ్యాసం దక్షిణ భారత సినిమా నటి దివ్యభారతి గురించినది. బాలీవుడ్ నటి దివంగత దివ్యభారతి కొరకు, దివ్యభారతి చూడండి.

దివ్యభారతి
జననం (1992-01-28) 1992 జనవరి 28 (వయసు 32)
తల్లిదండ్రులు
  • లతా సెల్వరాజ్ (తల్లి)

దివ్యభారతి (జననం 1992 జనవరి 28) దక్షిణ భారత సినిమా నటి. జీవీ ప్రకాష్‌కుమార్‌ సరసన బ్యాచిలర్‌ (2021) చిత్రంతో నాయకిగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తమిళ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.[1]

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆమె 1992 జనవరి 28న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసింది.

కెరీర్ మార్చు

మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె 2015లో మిస్ ఎథ్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్, 2016లో న్యూ ఫేస్ మోడల్, క్రౌన్డ్ ప్రిన్సెస్ సహా ఎన్నో టైటిల్స్ సొంతం చేసుకుంది. 2021లో బ్యాచిలర్‌ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆమె ఏక కాలంలో తమిళ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలను రాబట్టుకుంది. అంజనా అలీఖాన్‌ దర్శకత్వంలో ముగెన్‌ సరసన ప్రేమకథా చిత్రం మదిల్‌మేల్‌ కాదల్‌ చిత్రంలో నటించింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఇష్క్ సినిమా తమిళ రీమేక్ లో నటించింది. మధిల్ మెల్ కాదల్ చిత్రంలో ఆమె నటించింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన G.O.A.T (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తోంది.[2]

మూలాలు మార్చు

  1. "Divya Bharathi: ఆమె నవ్వు చామంతి.. అందం పూబంతి.. దివ్యభారతి చూపులకు బాణాలకు హృదయాలు ఆగిపోతాయేమో.. - Telugu News | Divya bharathi latest instagram photos on 17 05 2023 | TV9 Telugu". web.archive.org. 2023-06-09. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "G.O.A.T: Comedian Sudigali Sudheer Starrer Next Movie Title Announced - Sakshi". web.archive.org. 2023-06-09. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)