దివ్యభారతి (1974 ఫిబ్రవరి 25 - 1993 ఏప్రిల్ 5) ఉత్తరాది నుండి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకొన్న నటి. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసారు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో ఇంకా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత 1992లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది. మే 1992లో సాజిద్ నడియాడ్‌వాలాను వివాహమాడింది. 1993 ఏప్రిల్ లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద మరణం పాలయింది. ఇప్పటికీ ఆమె మృతికి కారణాలు అంతుపట్టకనే ఉన్నాయి.

దివ్యభారతి
Heroine Divya Bharti.jpg
జననం (1974-02-25)1974 ఫిబ్రవరి 25
Indiaతప్రి
మహారాష్ట్ర
మరణం 1993 ఏప్రిల్ 5(1993-04-05) (వయసు 19)
ముంబై
ఇతర పేర్లు సన నడియాడ్‍వాలా
భార్య/భర్త సాజిద్ నడియాడ్‌వాలా
వెబ్‌సైటు http://www.divyabhartiportal.com
ప్రముఖ పాత్రలు బొబ్బిలి రాజా
అసెంబ్లీ రౌడీ

తొలి రోజులుసవరించు

దివ్యభారతి ముంబైలో ఓంప్రకాశ్ భారతి, మీత భారతిలకు పుట్టింది.[1] ఈమెకు కునాల్ అనే తమ్ముడు ఉన్నాడు, పూనం అనే సవతొ చెల్లెలు ఉంది.[2] కైనాత్ అరోరా ఈమెకు దాయాది.[3] దివ్యభారతి హిందీ, ఆంగ్లము, మరాఠీ భాషలు బాగా మాట్లాడగలిగేది. ఈమె తొలినాళ్ళలో బొద్దుగా, బొమ్మలా అందంగా ఉండటం అందరినీ ఆకర్షించిన విషయం. ఈమె ముంబైలోని జుహూలోని మాణెక్‌జీ కోఆపరేటివ్ హైస్కూల్ లో చదువుకుంది. నటనారంగంలోకి వచ్చే ముందు 9వ తరగతి వరకు విద్యను పూర్తి చేసింది.[4]

వ్యక్తిగత జీవితంసవరించు

షోలా ఔర్ షబ్‌నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక-నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా పరిచయమయ్యాడు. వీరి పెళ్ళి 10 మే 1992న జరిగింది. ఈ పెళ్ళి రహస్యంగా సాజిద్ స్వగృహంలో కేవలం దివ్యభారతి, సాజిద్, ఒక కాజీ, దివ్యభారతి కురులను అలంకరించే స్నేహితురాలు సంధ్య, సంధ్య భర్త సమక్షంలో జరిగింది.[5]

దివ్యభారతి నటించిన చిత్రాలుసవరించు

# సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష వివరణ
1 1990 బొబ్బిలి రాజా రాణి తెలుగు తొలి పరచయం అందించిన సినిమా
2 నీల పెణ్ణె నీల తమిళం తమిళంలో తొలి సినిమా
3 1991 నా ఇల్లే నా స్వర్గం ప్రత్యూష తెలుగు డబ్బింగ్ సినిమా
4 రౌడీ అల్లుడు రేఖ తెలుగు
5 అసెంబ్లీ రౌడీ పూజ తెలుగు
6 1992 విశ్వాత్మా కుసుమ్ హిందీ హిందీలో తొలి చిత్రం
7 దిల్ కా క్యా కసూర్ సీమ/శాలనీ సక్సేనా హిందీ
8 ధర్మక్షేత్రం మైథిలి తెలుగు
9 షోలా ఔర్ షబ్‌నమ్ దివ్యా థాపర్ హిందీ
10 జాన్ సె ప్యారా షర్మిల హిందీ
11 దీవానా కాజల్ హిందీ ఫిలింఫేర్ అవార్డ్ (లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ద ఇయర్)
12 బల్‌వాన్ దీప హిందీ
13 దుష్మన్ ౙమానా సీమ హిందీ
14 దిల్ ఆష్నా హై లైలా/సితార హిందీ
15 గీత్ నేహా హిందీ పాక్షికంగా డబ్బింగ్ సినిమా
16 చిట్టెమ్మ మొగుడు చిట్టెమ్మ తెలుగు
17 1993 దిల్ హీ తో హై భారతి హిందీ
18 క్షత్రియా తానవీ సింగ్ హిందీ దివ్యభారతి బ్రతికుండగా ఆఖరుగా విడుదలైన చిత్రం
19 తొలిముద్దు దివ్య తెలుగు చనిపోయాక విడుల అయింది; కొన్ని భాగాలలో దివ్యభారతికి బదులు రంభ నటించింది.
20 రంగ్ కాజల్ హిందీ చనిపోయాక విడుదలయింది; డబ్బింగ్ సినిమా
21 షత్రంజ్ రేణు హిందీ చనిపోయాక ఆఖరు సినిమా; డబ్బింగ్

బాహ్య లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. Anil Saari; Pārtha Caṭṭopādhyāẏa (2009). హిందీ సినెమా: ఎన్ ఇన్‌సైడర్స్ వ్యూ. Oxford University Press. p. 222. ISBN 978-0-19-569584-7.
  2. "రిమెంబరింగ్ దివ్య భారతి". BollySpice. Retrieved 17 August 2013.
  3. "దివ్య భారతి కజిన్ కైనాత్ అరోరా టు మేక్ బాలీవుడ్ డెబ్యు విత్ గ్రాండ్ మస్తి". Movies.ndtv.com. 9 August 2013.
  4. "అర్లీ లైఫ్ ఆఫ్ దివ్యభారతి". Retrieved 28 July 2012.
  5. రోష్మిలా భట్టాచార్య (24 April 2011). "టూ యంగ్ టు డై". హిందుస్తాన్ టైంస్. Retrieved 14 June 2016.