దివ్యాంకా త్రిపాఠి

దివ్యాంకా త్రిపాఠి దహియా (జననం 14 డిసెంబరు 1984) భారతీయ టెలివిజన్ నటి. ఆమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో నటిస్తుంది. తన నటనతో హిందీ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకుంది.[3] జీ టీవిలో ప్రసారమైన బనూ మై తేరీ దుల్హన్ ధారావాహికలో ఆమె చేసిన ద్విపాత్రాభినయంతో గుర్తింపు పొందింది. ఈ సీరియల్ లోని ఆమె నటనకు భారతీయ టెలివిజన్ అకాడమీ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ప్రస్తుతం స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న యే హై మొహొబ్బతే సీరియల్ లో ఆమె నటించిన డాక్టర్. ఇషితా రమన్ భల్లా పాత్రకు ఇండియన్ టెలీ ఉత్తమ కథానాయిక పురస్కారం పొందింది.

దివ్యాంక త్రిపాఠి
2016లో దివ్యాంక త్రిపాఠి
జననం (1980-12-14) 1980 డిసెంబరు 14 (వయసు 44)[1]
జాతీయతభారతీయరాలు
ఇతర పేర్లుదివ్యాంక త్రిపాఠి దహియా చానీ & దివి[2]
వృత్తినటి
జీవిత భాగస్వామి
వివేక్ దహియా
(m. 2016)

తొలినాళ్ళ జీవితం

మార్చు

ఆమె మధ్యప్రదేశ్లోని భోపాల్ లో[4][5] 14 డిసెంబరు 1984న[1] జన్మించింది. భోపాల్ లోని నూతన్ కళాశాలలో చదువుకుంది. ఉత్తరకాశీలోని  నెహ్రూ  ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటేయినీరింగ్ లో పర్వతారోహణ కోర్సు పూర్తి చేసింది. భోపాల్ రైఫిల్ అకాడమీ నుంచి రైఫిల్ షూటింగ్ కోర్సు కూడా చేసింది. రైఫిల్ షూటింగ్ లో దివ్యాంకా ఎన్నో  బంగారు పతకాలు గెలుచుంది.[6]

కెరీర్

మార్చు

భోపాల్ లో  ఆకాశవాణిలో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. 2003లో జరిగిన ప్యాంటీన్ జీ టీన్ క్వీన్ పోటీల్లో మిస్ బ్యూటిఫుల్ స్కిన్ టైటిల్ గెలుచుకుంది. 2004లో ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కీ ఖోజ్ పోటీల్లో పాల్గొన్న ఆమె భోపాల్ జోన్ కు విజేతగా నిలిచింది. 2005లో మిస్ భోపాల్ టైటిల్ గెలుచుకుంది.[7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 IANS (14 December 2015). "Divyanka Tripathi gifts herself a holiday on birthday". The Indian Express. Retrieved 31 March 2016.
  2. Bhandari, Jhanvi (20 July 2016). "Divyanka Tripathi changes name to Divyanka Tripathi Dahiya". The Times of India. Retrieved 2016-07-21.
  3. "'Yeh Hai Mohabbatein' Actress Divyanka Tripathi Hits Milestone, Gets Pampered in Unique Way". ibtimes.co.in. Retrieved 12 July 2015.
  4. "Divyanka Tripathi: Since I'm from Bhopal, I know how to prepare Iftaar". The Times of India. Retrieved 18 July 2015.
  5. "'Yeh Hai Mohabbatein' Actress Divyanka Tripathi Bags Top Award at Prestigious Theatre Festival". ibtimes.co.in. Retrieved 13 July 2015.
  6. "Know Lesser Known Facts About Divyanka Tripathi aka Ishita Bhalla". India Opines. 22 March 2015. Archived from the original on 1 జనవరి 2017. Retrieved 20 డిసెంబరు 2016.
  7. ""Dulhan" found in the City – Divyanka Tripathi". nagpurtoday.in.

బాహ్య లంకెలు

మార్చు