దిశా పర్మార్ (ఆంగ్లం: Disha Parmar; జననం 1994 నవంబరు 11) ఒక భారతీయ మోడల్, టెలివిజన్ నటి. ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారాలో పంఖురి గుప్తా పాత్రకు, వో అప్నా సాలో జాన్వీ అగర్వాల్‌ పాత్రలకుగానూ ఆమె మంచి పేరు తెచ్చుకుంది.[2] ఆగస్టు 2021 నుండి ఏక్తా కపూర్ బడే అచ్చే లాగ్తే హై 2లో ప్రియా సూద్ పాత్రను ఆమె పోషిస్తోంది.

దిశా పర్మార్ వైద్య
జననం
దిశా పర్మార్

(1994-11-11) 1994 నవంబరు 11 (వయసు 30)[1]
న్యూ ఢిల్లీ, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012 – ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా
  • వోహ్ అప్నా సా
  • బడే అచ్ఛే లగ్తే హై 2
జీవిత భాగస్వామి

2020లో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన మహిళల్లో దిశా పర్మార్ ఒకరు కావడం విశేషం.[3]

జీవితం తొలి దశలో

మార్చు

దిశా పర్మార్ తన పాఠశాల విద్యను ఢిల్లీలోని సాధు వాస్వానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పూర్తి చేసింది. ఆమె ఉన్నత మాధ్యమిక విద్యాభ్యాసం సమయంలో, ఆమె నృత్య పోటీలు, నాటకాలు, ఫ్యాషన్ షోలలో పాల్గొంది.[4]

ఆమె అనేక ప్రింట్, వాణిజ్య ప్రకటనలతో కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా షోకి లీడ్‌ పాత్రలో నటిస్తుండడం వల్ల ఆమె ఎంబిఎ చదువును మధ్యలోనే వదిలేసింది.[5]

కెరీర్

మార్చు

దిశా పర్మార్ ఢిల్లీకి చెందిన కంపెనీ ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో కొంత కాలం పనిచేసింది. రాజశ్రీ ప్రొడక్షన్స్ కోసం ఆడిషన్స్ నిర్వహించింది.

17 ఏళ్ల వయసులో ఆమె ప్యార్ కా దర్ద్ హైలో పంఖురి ప్రధాన పాత్రకు ఎంపికైంది. సహనటుడు నకుల్ మెహతాతో జతకట్టినందుకు ఆమె ప్రశంసలు అందుకుంది.[6][7] ఆమె ఈ సీరియల్‌తో పాటు వాణిజ్య ప్రకటనలలో పని చేయడం కొనసాగించింది.[8] 2016లో అర్రే విడుదల చేసిన ఐ డోంట్ వాచ్ టీవీ వెబ్ సిరీస్‌లో ఆమె నటించింది.[9] ఆమె 2017లో జీ టీవీ రోజువారీ సోప్ వో అప్నా సాలో జాన్వి/జియా ప్రధాన పాత్రను పోషించింది.[10]

ఆమె రాహుల్ వైద్యతో కలిసి "యాద్ తేరి", "మధన్య" అనే మ్యూజిక్ వీడియోలలో పనిచేసింది. తర్వాత ఆమె 2014లో బాక్స్ క్రికెట్ లీగ్‌లో ప్లేయర్‌గా కనిపించింది. ప్రేమికుల రోజున బాయ్‌ఫ్రెండ్ రాహుల్ వైద్యను కలవడానికి బిగ్ బాస్ 14కి అతిథిగా వచ్చింది.[11] ఆగష్టు 2021 నుండి, ఆమె ఏక్తా కపూర్ బడే అచ్ఛే లాగ్తే హై 2లో ప్రియా పాత్రను పోషించారు.[12] ఆమె నటనకు సానుకూల సమీక్షలు అందాయి. అలాగే నకుల్ మెహతాతో ఆమె కెమిస్ట్రీ విస్తృతంగా ప్రశంసించబడింది.[13]

వ్యక్తిగత జీవితం

మార్చు

దిశా పర్మార్ 2021 జులై 16న గాయకుడు రాహుల్ వైద్యను వివాహం చేసుకుంది.[14][15] బిగ్ బాస్ 14లో ఆమె పుట్టినరోజు సందర్భంగా అతను ఆమెను ప్రపోజ్ చేశాడు.[16][17]

అవార్డులు, నామినేషన్లు

మార్చు
Year Award Category Show
2013 ఇండియన్ టెలీ అవార్డులు ఫ్రెష్ న్యూ ఫేస్ (ఆడ) ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా విజేత[18]
బిగ్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డులు ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ (మహిళ) విజేత
2014 ఇండియన్ టెలీ అవార్డులు (నకుల్ మెహతా)తో పంచుకున్న ఉత్తమ జోడి విజేత
2018 ఇండియన్ టెలీ అవార్డులు ఫెవరేట్ నయా సదస్య వో అప్నా సా విజేత
2022 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ నటి (పాపులర్) బడే అచ్చే లాగ్తే హైన్ 2 నామినేటెడ్
బాలీవుడ్ లైఫ్ అవార్డులు ఉత్తమ ఆన్-స్క్రీన్ జంట (నకుల్ మెహతా)తో భాగస్వామ్యం విజేత

మూలాలు

మార్చు
  1. "Who is Disha Parmar everything you need to know about Bigg Boss 14 contestant Rahul Vaidya's ladylove". Zee News. 11 November 2020.
  2. Tiwari, Vijaya (12 August 2013). "Revelations and marred relations in Pyaar Ka Dard." The Times of India. Archived from the original on 16 October 2013. Retrieved 21 October 2013. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Meet The Top 5 Most Googled Women Of 2020". femina.in (in ఇంగ్లీష్). Retrieved 30 July 2021.
  4. "तारा सुतारिया पर भारी पड़ गई राहुल वैघ की दुल्हनिया, पिंक लहंगा पहन यूं चुरा ले गई दिल". Navbharat Times (in హిందీ). Retrieved 31 July 2021.
  5. "TV actresses wish Happy Raksha Bandhan!". The Times of India. 20 August 2013. Archived from the original on 2 December 2013. Retrieved 11 September 2013. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "[PHOTOS] Disha Parmar is one of the hottest divas of the telly world; these glamorous clicks are proof!". zoomtventertainment.com (in ఇంగ్లీష్). Retrieved 30 July 2021.
  7. "I-Day special: Drashti, Vivian, Surabhi, Hina wish fans". The Times of India. 15 August 2013. Archived from the original on 2 December 2013. Retrieved 11 September 2013. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  8. "5 Times Disha Parmar's gorgeous pink outfits made us crush hard on her". pinkvilla.com (in ఇంగ్లీష్). Archived from the original on 2 మే 2022. Retrieved 2 May 2022. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. "I Don't Watch TV | #LaughterGames" – via YouTube.
  10. "I pretty much relate to my character, says Disha Parmar". Latest Indian news, Top Breaking headlines, Today Headlines, Top Stories | Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 27 July 2019.
  11. "Bigg Boss 14's Rahul Vaidya proposed to girlfriend Disha Parmar for marriage on national TV; a look at their adorable relationship". The Times of India (in ఇంగ్లీష్). 11 November 2020. Retrieved 11 February 2021.
  12. "Bade Achhe Lagte Hain 2 promo: Ekta Kapoor praises Nakuul Mehta and Disha Parmar; reveals Ram and Sakshi were called an 'odd-couple' before the show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.
  13. "Bade Acche Lagte Hain 2 First Impression: Disha's Humour Drives the Show, Nakuul Complements Her". News18 (in ఇంగ్లీష్). Retrieved 31 August 2021.
  14. "Rahul Vaidya And Disha Parmar Are Now Married. Pics Here" (in ఇంగ్లీష్). 20 July 2021.
  15. "Rahul Vaidya Wedding Photos and Disha Parmar Marriage Images & Pictures: Rahul Vaidya and Disha Parmar look made for each other in their dreamy wedding photos". The Times of India (in ఇంగ్లీష్). 16 July 2021. Retrieved 30 July 2021.
  16. "Bigg Boss 14's Rahul Vaidya proposed to girlfriend Disha Parmar for marriage on national TV; a look at their adorable relationship". The Times of India (in ఇంగ్లీష్). 11 November 2020. Retrieved 11 February 2021.
  17. "Rahul Vaidya, Disha Parmar get married: Looking at their intimate wedding ceremony, grand reception in Mumbai" (in ఇంగ్లీష్). 20 July 2021.
  18. "The Twelfth Indian Telly Awards - Nominate your Favourites - Login". web.archive.org. 2015-04-25. Archived from the original on 2015-04-25. Retrieved 2022-09-11. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)