ది గుడ్ ఎర్త్ (1937 సినిమా)
ది గుడ్ ఎర్త్ 1937, జనవరి 29న సిడ్నీ ఫ్రాంక్లిన్ దర్శకత్వంలో విడుదలైన అమెరికా చలనచిత్రం. నోబెల్ బహుమతి గ్రహీత, అమెరికన్ నవలా రచయిత్రి పెర్ల్ ఎస్.బక్ 1931లో రాసిన ది గుడ్ ఎర్త్ అనే నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో పాల్ ముని, లూయిస్ లైనర్ నటించారు. లాస్ ఏంజిల్స్ లోని ఎలిజెంట్ కార్తే సర్కిల్ థియేటర్ లో ప్రీమియర్ షో వేయబడింది.
ది గుడ్ ఎర్త్ | |
---|---|
దర్శకత్వం | సిడ్నీ ఫ్రాంక్లిన్, విక్టర్ ఫ్లెమింగ్ (టైటిల్స్ లో పేరు లేదు), గుస్తావ్ మచాటి (టైటిల్స్ లో పేరు లేదు) |
స్క్రీన్ ప్లే | టాల్బోట్ జెన్నింగ్స్, టెస్ సిల్సింజర్, క్లాడైన్ వెస్ట్ |
నిర్మాత | ఇర్వింగ్ థల్బర్గ్, ఆల్బర్ట్ లెవిన్ (అసోసియేట్ నిర్మాత) |
తారాగణం | పాల్ ముని, లూయిస్ లైనర్ |
ఛాయాగ్రహణం | కార్ల్ ఫ్రూయిండ్ |
కూర్పు | బాసిల్ వ్రాంగెల్ |
సంగీతం | హెర్బర్ట్ స్తోథార్ట్, ఎడ్వర్డ్ వార్డ్ (టైటిల్స్ లో పేరు లేదు) |
పంపిణీదార్లు | మెట్రో-గోల్డ్విన్-మేయర్ |
విడుదల తేదీ | జనవరి 29, 1937(యునైటెడ్ స్టేట్స్)[1] |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $2,816,000[2] |
బాక్సాఫీసు | $3,557,000[2] |
ఎన్ని కష్టాలు వచ్చినా రైతు తన కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో, తనకున్న కొద్ది భూమిని కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తాడో ఈ చిత్రంలో చూపించబడింది.
కథ
మార్చువాంగ్ లుంగ్, ఓలాన్ లు భార్యాభర్తలు. చైనాలోని ఒక కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబం వారిది. తమ జీవనాధారమైన వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో అనుకోకుండా కరువు వస్తుంది. బతుకుతెరువు కోసం పట్నానికి వలస వస్తారు. అక్కడ ఎన్నో కష్టాలు పడి, పిల్లలకోసం భిక్షాటన మొదలు పెడతారు. కొన్నిరోజుల తరువాత ఆ కుటుంబం మళ్ళీ గ్రామానికి తిరిగి వస్తుంది. అదేసమయంలో మిడతలదండు వీరి పొలంపై దాడి చేస్తుంది. వారు ఆ దాడిని ఎదుర్కొంటారు. కొన్నిరోజులకు ఓలాన్ జబ్బుతో మంచాన పడుతుంది. వాంగ్ లుంగ్ తన పొలాన్ని అమ్మి ఓలాన్ కు నయం చేయించాలనుకుంటాడు. పొలం ఉండడం చాలా ముఖ్యమని, తనకోసం పొలం అమ్మొద్దని చెప్పి ఓలాన్ మరణిస్తుంది.
నటవర్గం
మార్చు- పాల్ ముని
- టిల్లీ లాచ్
- లూయిస్ రైనర్
- చార్లీ గ్రప్విన్
- వాల్టర్ కొన్నోల్లీ
- జెస్సీ రాల్ఫ్
- సూ యోంగ్
- కీస్ లూకా
- రోలాండ్ లూయి
- సుజన్నా కిమ్
- చింగ్ వాహ్ లీ
- హెరోల్డ్ హుబెర్
- ఓలాఫ్ హేటెన్
- విలియం లా
- మేరీ వోంగ్
- చార్లెస్ మిడిల్టన్
- చెస్టర్ గాన్
- రిచర్డ్ లూ
- కమ్ టోంగ్
- విక్టర్ సేన్ యుంగ్
- ఫిలిప్ అహ్న్
- బెస్సీ లూ
- క్లారెన్స్ లంగ్
- శామ్మి టోంగ్
- రిచర్డ్ డేనియల్ కాజారెస్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సిడ్నీ ఫ్రాంక్లిన్,
- నిర్మాత: ఇర్వింగ్ థల్బర్గ్, ఆల్బర్ట్ లెవిన్
- స్క్రీన్ ప్లే: టాల్బోట్ జెన్నింగ్స్, టెస్ సిల్సింజర్, క్లాడైన్ వెస్ట్
- ఆధారం: పెర్ల్ ఎస్.బక్ 1931లో రాసిన ది గుడ్ ఎర్త్ అనే నవల
- సంగీతం: హెర్బర్ట్ స్తోథార్ట్,
- ఛాయాగ్రహణం: కార్ల్ ఫ్రూయిండ్
- కూర్పు: బాసిల్ వ్రాంగెల్
- పంపిణీదారు: మెట్రో-గోల్డ్విన్-మేయర్
చిత్రవిశేషాలు
మార్చు- చిత్ర నిర్మాణంకోసం చైనా వెళ్ళిన చిత్రబృందం 20 లక్షల అడుగుల ఫిల్మ్ ను, 18 టన్నుల ఇతర వస్తుసంపదను అమెరికాకు తీసుకొచ్చింది.[3]
- ఆ వస్తుసంపదతో కాలిఫోర్నియాలోని 500 ఎకరాల శాన్ ఫెర్నాండో లోయను చైనాలోని పల్లెప్రాంతంగా మార్చి, అక్కడ పొలాలను, నీటిపారుదల విధానాలను సృష్టించారు. అది ప్రపంచంలోనే అతి పెద్ద సెట్ గా తయారయింది.[3]
- ఇందులోని సాంప్రదాయ బద్ధంగా కనిపించే చైనా రైతు మహిళగా నటించడం కోసం ఆస్ట్రియాకు చెందిన లూయిస్ రైనర్ ను తీసుకున్నారు.[3]
అవార్డులు
మార్చుఈ చిత్రం ఉత్తమనటి (లూయిస్ లైనర్),ఉత్తమ ఛాయాగ్రహణం (కార్ల్ ఫ్రూయిండ్) విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకోవడమేకాకుండా ఉత్తమచిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో నామినేట్ చేయబడింది.[4]
మూలాలు
మార్చు- ↑ Brown, Gene (1995). Movie Time: A Chronology of Hollywood and the Movie Industry from Its Beginnings to the Present. New York: Macmillan. p. 134. ISBN 0-02-860429-6. Carthay Circle Theatre, Los Angeles.
- ↑ 2.0 2.1 The Eddie Mannix Ledger, Los Angeles: Margaret Herrick Library, Center for Motion Picture Study.
- ↑ 3.0 3.1 3.2 పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 44.
- ↑ The Good Earth at Turner Classic Movies website
ఇతర లంకెలు
మార్చుఆధార గ్రంథాలు
మార్చు- పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 23 February 2019[permanent dead link]