ది రోజ్‌ విల్లా 2021లో తెలుగులో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. చిత్రమందిర్‌ స్టూడియోస్ బ్యానర్ పై అచ్యుతరామారావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్‌ దర్శకత్వం వహించాడు. దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4, 2021న విడుదల చేశారు.[1] కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా 1 అక్టోబర్‌ 2021న విడుదలైంది.[2]

ది రోజ్‌ విల్లా
దర్శకత్వంహేమంత్‌
రచనహేమంత్‌
నిర్మాతఅచ్యుతరామారావు
తారాగణందీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన
ఛాయాగ్రహణంఅంజి
కూర్పుశివ
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
చిత్రమందిర్‌ స్టూడియోస్
విడుదల తేదీ
1 అక్టోబర్‌ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

డాక్ట‌ర్ ర‌వి (దీక్షిత్ శెట్టి), రచయిత్రి శ్వేత (శ్వేత వ‌ర్మ) కొత్తగా పెళ్ళైన జంట, వారు సరదాగా ఓ రోజు మున్నార్ ప్రాంతానికి కారులో వెళ్తారు. అక్కడ వారు ఆ దారిలో న‌క్సల్స్ ఏరియా లోకి వెళ్లి అక్కడి నుంచి పోలిసుల ద్వారా కాపాడబడి ఓ రెస్టారెంట్ కి చేరుకుంటారు. అక్క‌డ రెస్టారెంట్‌లో వీళ్ళు తింటుండ‌గా మిల‌ట్రీ రిటైర్ అయిన సోల్‌మాన్ (రాజా ర‌వీంద్ర) త‌న భార్య హెలెన్‌తో (అర్చ‌నా కుమార్‌)తో అక్క‌డే ఉంటాడు. ఆయనను ర‌వి ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. అలా వారి మధ్య పరిచయం కాగా సోలోమన్ దంపతులు ర‌వి శ్వేతను తమ ఇంటికి డిన్నర్ కి ఆహ్వానిస్తారు. సోల్‌మాన్ ఆహ్వానం మేరకు అతని ఇల్లైనా 'ది రోజ్ విల్లా' కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తరువాత రవి దంపతులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ కొత్త జంట అడుగుపెట్టాక ఏం జరిగింది? అనేది మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: చిత్రమందిర్‌ స్టూడియోస్
  • నిర్మాత: అచ్యుతరామారావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హేమంత్‌
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • సినిమాటోగ్రఫీ: అంజి
  • ఎడిటర్: శివ

మూలాలు మార్చు

  1. Eenadu (4 October 2021). "'ది రోజ్‌ విల్లా'భయపెడుతోంది!". Archived from the original on 4 అక్టోబరు 2021. Retrieved 4 October 2021.
  2. The Times of India (1 October 2021). "The Rose Villa Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 4 అక్టోబరు 2021. Retrieved 4 October 2021.
  3. Sakshi (1 October 2021). "'ది రోజ్‌ విల్లా' మూవీ రివ్యూ". Archived from the original on 4 అక్టోబరు 2021. Retrieved 4 October 2021.
  4. NTV (1 October 2021). "రివ్యూ: "ది రోజ్ విల్లా"". Archived from the original on 4 అక్టోబరు 2021. Retrieved 4 October 2021.