ది షాషాంక్ రిడంప్షన్

స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. రెండు దశాబ్దాలకు పైగా జైలులో ఒక వ్యక్తి సాగించిన జీవితం ఈ చిత్ర కథాంశం. సినీ చరిత్రలో ఒకానొక గొప్ప చిత్రంగా, అత్యంత ఉత్తేజపూరితమయిన చిత్రంగా పేరు తెచ్చుకుంది.

The Shawshank Redemption
ShawshankRedemptionMoviePoster.jpg
Theatrical release poster
దర్శకత్వంFrank Darabont
రచనNovella:
Stephen King
Screenplay:
Frank Darabont
నిర్మాతNiki Marvin
తారాగణంTim Robbins
Morgan Freeman
Narrated byMorgan Freeman
James Whitmore
ఛాయాగ్రహణంRoger Deakins
కూర్పుRichard Francis-Bruce
సంగీతంThomas Newman
పంపిణీదార్లుColumbia Pictures (1994-1999)
Warner Bros. (1999-present)
విడుదల తేదీs
September 23, 1994
సినిమా నిడివి
142 min.
దేశంUnited States
భాషEnglish
బడ్జెట్$25 million
బాక్సాఫీసు$28,341,469

కథాంశంసవరించు

1947 లో తన భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసాడన్న ఆరోపణలవల్ల ఆండీ అనే బ్యాంక్ ఉద్యోగి రెండు జీవితఖైదు శిక్షలను అనుభవించడానికి అత్యంత పటిష్టమయిన షాషాంక్ జైలుకు పంపించబడతాడు. జైల్లో అప్పటికే 20 ఏళ్ళకు పైగా శిక్ష అనుభవిస్తున్న రెడ్ అనే వ్యక్తితో మితృత్వం పెంచుకొని తనకు తనకు అవసరమయిన వస్తువులు జైలులోకి తెప్పించుకుంటాడు.

ఆండీ ఓకప్పుడు బ్యాంకు ఉద్యోగి కావడం వల్ల తన తెలివితేటలతో జైలు అధికారులకు ట్యాక్స్ కట్టడంలో లోటుపాట్లు తెలుపుతూ వారికి ట్యాక్సుల్లో మరింత డబ్బు మిగిల్చి ఆదరణ చురగొంటాడు. క్రమంగా జైలు వార్డెన్ కు ప్రీతిపాత్రుడవుతాడు. ప్రతి రోజు ఒక ఉత్తరం చొప్పున ఆరేళ్ళ పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి జైలులో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి మిగతా ఖైదీలలో మార్పు తీసుకొస్తాడు.

1965లో ఒక యువకుడు జైలుకు వచ్చి ఆండీ దగ్గర చదువు నేర్చుకుంటూ ఆండీ గతం తెలుసుకొంటాడు. ఆ రెండు హత్యలు చేసిన వ్యక్తి మరొక జైల్లో తన తోటీ ఖైదీగా ఉండేవాడని వివరిస్తాడు. ఆ యువకుడి మాటల ఆధారంగా తనపైన విచారణ తిరిగి మొదలుపెట్టించమని వార్డన్‌ను కోరుతాడు ఆండీ. ఆండీ నిర్దోషిగా బయట వెళ్తే జైల్లో తాను చేస్తున్న కార్యకలాపాలు తెలిసిపోతాయని ఆ యువకుడిని చంపిస్తాడు జైలు వార్డన్.

తాను ఎప్పటికయినా జైలు నుండి తప్పించుకొని మెక్సికోలో ఒక చిన్న వూరిలో హోటల్ పెట్టుకొని ఒక బోటు తయారు చేసుకుంటానని రెడ్‌తో చెప్తాడు ఆండీ. చివరగా రెడ్ జైలునుండి విడుదలయి మెక్సికోలో ఆండీని కలుసుకుంటాడు.

నిర్మాణంసవరించు

నూతన దర్శకులు కేవల ఒక్క డాలరు ($1) చెల్లించి తన కథలను సినిమా తీయవచ్చునని స్టీఫెన్ కింగ్ క్రొత్త దర్శకులను ప్రోత్సహించేవాడు. ఈ చిత్రం కూడా ఆ కోవకే చెందినది. ఈ చిత్ర దర్శకుడు ఆండీ పాత్రకు టాం హ్యాంక్స్ను తీసుకోవాలి అనుకున్నా టాం హ్యాక్స్ అప్పటికే ఫారెస్ట్ గంప్ చిత్రంలో నటిస్తుండడం వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయాడు. ఆండీగా టిం రాబిన్స్, రెడ్‌గా మోర్గాన్ ఫ్రీమన్ నటించారు.

దాదాపు మొత్తం షూటింగ్ ఒహాయో రాష్ట్రంలోని ఒక పాడుబడిన జైలులో జరిగింది.

స్పందనసవరించు

ఈ చిత్రం విడుదలయిన ఏడాది లయన్ కింగ్, ఫారెస్ట్ గంప్, పల్ప్ ఫిక్షన్ మొదలయిన చిత్రాలు విడుదల కావడంతో బాక్సాఫీసు వద్ద ఎక్కువ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఏడు ఆస్కార్ అవార్డులకు ఎన్నికయినప్పటికీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. తరువాతి కాలంలో ఈ చిత్రం ఎంతో ఉత్తేజపూరితమయినది, నిరాశను పారద్రోలగలిగే చిత్రంగా ఎంతో ఆదరణ చురగొన్నది.
2002లో ఛానెల్ 4 నిర్వహించిన సర్వేలో ఈ చిత్రం మూడవ అతి గొప్ప చిత్రంగా ఎన్నికయినది.
2006లో ఎంపైర్ మేగజైన్ పాఠకులు ఈ చిత్రాన్ని ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత గొప్ప చిత్రంగా ఎన్నుకున్నారు.
2008లో ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో ఈ చిత్రం అప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ది గాడ్‌ఫాదర్ చిత్రాన్ని రెండవ స్థానానికి నెట్టి ప్రథమ స్థానం ఆక్రమించింది.

  • ఈ చిత్రంలో ముగింపు సన్నివేశంలో ఆండీ జైలు నుండి తప్పించుకునే సన్నివేశంలో డ్రైనేజి గొట్టం గూండా తప్పించుకునే సన్నివేశం ఉంటుంది. చిత్రీకరణలో చాకొలెట్ తొ నిర్మింపబడిన

డ్రైనేజిలో చిత్రీకరించారు.

బయటి లింకులుసవరించు