ఫారెస్ట్ గంప్ (1994 సినిమా)

1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ హాస్య చలనచిత్రం.

ఫారెస్ట్ గంప్ 1994లో విడుదలైన అమెరికన్ హాస్య చలనచిత్రం. 1986లో విన్స్టన్ గ్రూమ్ రచించిన ఫారెస్ట్ గంప్ నవల ఆధారంగా రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాంక్స్, రాబిన్ రైట్, గ్యారీ సైనైస్, మైకెల్టి విలియమ్సన్, సాలీ ఫీల్డ్ తదితరులు నటించారు.

ఫారెస్ట్ గంప్
ఫారెస్ట్ గంప్ సినిమా పోస్టర్
దర్శకత్వంరాబర్ట్ జెమెకిస్
స్క్రీన్ ప్లేఎరిక్ రోత్
నిర్మాతవెండీ ఫింర్మన్, స్టీవ్ టిస్చ్, స్టీవ్ స్టార్కీ
తారాగణంటామ్ హాంక్స్, రాబిన్ రైట్, గ్యారీ సైనైస్, మైకెల్టి విలియమ్సన్, సాలీ ఫీల్డ్
ఛాయాగ్రహణండాన్ బర్గెస్
కూర్పుఆర్థర్ ష్మిత్
సంగీతంఅలాన్ సిల్వెస్త్రి
నిర్మాణ
సంస్థ
వెండి ఫైన్మాన్ ప్రొడక్షన్స్
పంపిణీదార్లుపారమౌంట్ పిక్చర్స్
విడుదల తేదీs
జూన్ 23, 1994 (1994-06-23)(లాస్ ఏంజలెస్)
జూలై 6, 1994 (యునైటెడ్ స్టేట్స్)
సినిమా నిడివి
142 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$55 మిలియన్[1]
బాక్సాఫీసు$678.1 మిలియన్[1]

నటవర్గం

మార్చు
  • టామ్ హాంక్స్ (ఫారెస్ట్ గంప్)
  • రాబిన్ రైట్ (జెన్ని కుర్రాన్)
  • గ్యారీ సైనైస్ (లెఫ్టినెంట్ డాన్ టేలర్)
  • మైకెల్టి విలియమ్సన్
  • సాలీ ఫీల్డ్
  • హన్నా ఆర్. హాల్ (యువ జెన్నీ కుర్రాన్)
  • హేలీ జోయెల్ ఓస్మెంట్ (జూనియర్ ఫారెస్ట్ గంప్)
  • పీటర్ డాబ్సన్ (ఎల్విస్‌)
  • డిక్ కేవెట్
  • సోనీ ష్రోయర్ (కోచ్ పాల్ "బేర్" బ్రయంట్)
  • గ్రాండ్ ఎల్. బుష్
  • మైఖేల్ జేస్
  • కోనార్ కెన్నెల్లీ
  • టెడ్డీ లేన్ జూనియర్ (బ్లాక్ పాంథర్స్)

సాంకేతిక వర్గం

మార్చు
1993లో సినిమా చిత్రీకరణ సమయంలో టామ్ హాంక్స్ (ఎడమ), గ్యారీ సైనైస్ (కుడి)
  • దర్శకత్వం: రాబర్ట్ జెమెకిస్
  • నిర్మాత: వెండీ ఫింర్మన్, స్టీవ్ టిస్చ్, స్టీవ్ స్టార్కీ
  • స్క్రీన్ ప్లే: ఎరిక్ రోత్
  • ఆధారం: 1986లో విన్స్టన్ గ్రూమ్ రచించిన ఫారెస్ట్ గంప్ నవల
  • సంగీతం: అలాన్ సిల్వెస్త్రి
  • ఛాయాగ్రహణం: డాన్ బర్గెస్
  • కూర్పు: ఆర్థర్ ష్మిత్
  • నిర్మాణ సంస్థ: వెండి ఫైన్మాన్ ప్రొడక్షన్స్
  • పంపిణీదారు: పారమౌంట్ పిక్చర్స్

చిత్రీకరణ

మార్చు
 
సినిమాలో జెన్నీ ఉపయోగించిన పడవ

1993 ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమై,డిసెంబరులో పూర్తయింది.[2] ఈ చిత్రం చాలావరకు అలబామాలో చేయబడినప్పటికీ ప్రధానంగా బ్యూఫోర్ట్, దక్షిణ కరోలినా, వర్జీనియా తీరప్రాంతం, నార్త్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలలో చిత్రీకరణ జరిగింది.[3] బ్లూ రిడ్జ్ పార్క్‌వేపై రన్నింగ్ షాట్‌తో కూడా.[4] ఊహాత్మక నగరమైన గ్రీన్బో కి సంబంధించిన డౌన్ టౌన్ భాగాలు దక్షిణ కరోలినాలోని వార్న్విల్లేలో చిత్రీకరించబడ్డాయి.[5] ఫారెస్ట్ గంప్ వియత్నాం మీదుగా వెళుతున్న సన్నివేశం దక్షిణ కరోలినాలోని ఫ్రిప్ ద్వీపంలో చిత్రీకరించబడింది.[6] వియత్నాం సన్నివేశాలకోసం 20కి పైగా పామెట్టో చెట్లను నాటారు.[7]

అవార్డులు

మార్చు

ఆస్కార్ పురస్కారాలు: 67వ ఆస్కార్ పురస్కారాలులో 13 విభాగాల్లో నామినేట్ చేయబడి 6 విభాగాల్లో బహుమతులను అందుకుంది.

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ నటుడు - టామ్ హాంక్స్ (గత సంవత్సరం ఫిలడెల్ఫియా సినిమాకు గెలుచుకున్నాడు)
  3. ఉత్తమ దర్శకుడు - రాబర్ట్ జెమెకిస్
  4. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - కెన్ రాల్స్టన్, జార్జ్ మర్ఫీ, అలెన్ హాల్, స్టీఫెన్ రోసెన్‌బామ్
  5. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - ఎరిక్ రోత్
  6. ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ - ఆర్థర్ ష్మిత్

గోల్డెన్ గ్లోబ్ అవార్డులు: 1995లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఏడు విభాగాల్లో నామినేట్ చేయబడి మూడు విభాగాల్లో బహుమతులను గెలుచుకుంది.

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ నటుడు - టామ్ హాంక్స్
  3. ఉత్తమ దర్శకుడు - రాబర్ట్ జెమెకిస్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Forrest Gump (1994)". Box Office Mojo. Retrieved 4 August 2019.
  2. McKenna, Kristine (December 19, 1993). "He's Serious About This One For Tom Hanks, it's been a long ride from 'Splash' to 'Philadelphia,' in which the likable comedy actor plays an AIDS patient who's fired from his job". Los Angeles Times. Archived from the original (Fee required) on 11 జనవరి 2012. Retrieved 4 August 2019.
  3. Mal, Vincent (July 6, 1994). "Show Some Gumption Hanks Excels in Tale of a Simple Man's Brushes with Fame" (Fee required). The Virginian-Pilot. Retrieved 4 August 2019.
  4. Must-see sites abound along Blue Ridge Parkway – The Indiana Gazette Online: Indiana County Area News. Indianagazette.com (June 12, 2011). Retrieved on 4 August 2019.
  5. Film locations for Forrest Gump (1994) Archived 2019-08-06 at the Wayback Machine. Movie-locations.com. Retrieved on 4 August 2019.
  6. Smith, Katherine. "Island getaway is motion-picture perfect". St. Petersburg Times. Archived from the original on September 17, 2011.
  7. Forrest Gump-(Building the World of Gump: Production Design) (DVD). Paramount Pictures. August 28, 2001.

ఇతర లంకెలు

మార్చు