దీక్ష
దీక్ష అంటే అంటే గురువు నుండి మంత్రాన్ని స్వీకరించడం. మతపరమైన వేడుకకు సన్నద్ధమవడం. ముడుపు కట్టడం అని కూడా అనవచ్చు. [1] హిందూ మతం, బౌద్ధమతం, జైనమతాల్లో ఈ సంప్రదాయం ఉంది. దీక్షలో తీవ్రమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉంటుంది. [2] సంస్కృత మూలంలో దా ("ఇవ్వడం"), క్షి ("నాశనం") ల నుండి దీక్ష అంటే "పవిత్రం చేయడం" గా ఉద్భవించింది. [3] గురు శిష్యుల మనస్సులు ఏకమైనపుడు శిష్యుడు గురువు ద్వారా దీక్ష పొందాడని అంటారు. [4] శిష్యుడిని శుద్ధి చేసే ఉద్దేశ్యంతో గురువు దృష్టి, స్పర్శ లేదా మంత్రం ద్వారా దీక్ష ఇస్తాడు. స్పర్శతో ఇచ్చే దీక్షను స్పర్శ దీక్ష అంటారు. <i id="mwIw">దీక్ష</i> ద్వారా ఇచ్చే దైవిక అనుగ్రహాన్ని శక్తిపాతం అని అంటారు. [3]
విష్ణు యమల (తంత్రం) ఇలా అంటుంది: "దివ్యత్వాన్ని, జ్ఞానాన్నీ (అతీంద్రియ, ఆధ్యాత్మిక జ్ఞానం) ప్రసాదించి, అజ్ఞానానికి బీజమైన పాపాన్ని ప్రక్షాళన చేసే ప్రక్రియను సత్యదర్శులైన ఆధ్యాత్మిక కోవిదులు దీక్ష అంటారు." [5]
వివిధ సంప్రదాయాలు, శాఖలు దీక్షను వివిధ రకాలుగా నిర్వర్తిస్తాయి. తంత్రం ఐదు రకాల దీక్షలు లేదా దీక్షలను ప్రస్తావిస్తుంది: ఒక కర్మ ద్వారా తీసుకునే సమయ- దీక్ష; కర్మ లేకుండా స్పర్శ ద్వారా చేసే స్పర్శ దీక్ష; మంత్రం ద్వారా చేసే వాగ్-దీక్ష; గురువు బాహ్య రూపాన్ని గ్రహించడమనే శాంభవి-దీక్ష; మనస్సులో చేసుకునే మనో- దీక్ష. [6] ఇస్కాన్ సంస్థ, సభ్యుల కోసం మొదటి దీక్షగా హరినామ- దీక్ష దీక్షను హోమంలో భాగంగా నిర్వహిస్తారు. ధాన్యాలు, పండ్లు, నెయ్యిని అగ్నిలో వ్రేల్చుతారు. [7] లాహిరి మహాశయుల సంప్రదాయంలో, క్రియా యోగా చేసేందుకు దీక్ష ఇస్తారు. [8] బెంగాలీ సన్యాసి మా ఆనందమాయి స్పర్శ దీక్ష (దైవిక స్పర్శ) లేదా దృక్ దీక్ష (ఆమె రూపం ద్వారా) ఇచ్చేవారు. అందులో భాగంగా ఆమె శక్తిపాతాన్ని (దైవ కృప) ప్రసాదిస్తుంది. [9]
సన్యాసం తీసుకునే దీక్షలో బ్రహ్మచర్య ప్రతిజ్ఞ, అన్ని వ్యక్తిగత ఆస్తులను, కుటుంబ సంబంధాలతో సహా అన్ని ప్రాపంచిక బంధాలను త్యజించడం వంటివి ఉంటాయి. జైనమతంలో కూడా దీక్షకు ఇదే అర్థం ఉంది. జైనమతంలో దీక్షను చరిత్ర లేదా మహానిభిక్రమణం అని కూడా అంటారు. హిందూమతంలో దీక్ష అనేది ప్రారంభించిన వ్యక్తి, పాల్గొన్న హిందూ సమూహంపై ఆధారపడి వివిధ ఆచారాలను నిర్వర్తిస్తారు.
ఉదాహరణలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Monier-Williams Sanskrit-English Dictionary". University of Cologne. pp. d. Archived from the original on January 10, 2009. Retrieved 2009-04-19.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Mantra: hearing the divine in India and America. Columbia University Press.
- ↑ 3.0 3.1 A concise dictionary of Indian philosophy. SUNY Press. p. 117.
- ↑ "Initiation or Guru Deeksha - when Mind of Disciple Connects to Mind of the Master | Gurumaa.com". Archived from the original on 2011-03-17. Retrieved 2010-11-26.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Pandey, Vraj Kumar (2007). Encyclopaedia of Indian philosophy. Anmol Publications. ISBN 978-81-261-3112-9.
- ↑ The madness of the saints by June McDaniel, University of Chicago Press, (1989) p. 106 ISBN 0-226-55723-5
- ↑ Introduction to New and Alternative Religions in America [Five Volumes]Eugene V. Gallagher, W. Michael Ashcraft (2006) Greenwood Publishing Group, p. 23 ISBN 0-275-98713-2
- ↑ Yogananda, Paramhansa (2003). Autobiography of a Yogi. Sterling Publishers Pvt. Ltd. ISBN 978-81-207-2524-9.
- ↑ Hallstrom, Lisa Lassell (1999). Mother of Bliss: Ānandamayī Mā (1896-1982). Oxford University Press US. ISBN 978-0-19-511647-2.