అనగా

Interlocking triangles inside a circle and square
శ్రీ చక్రము చతుర్భుజాకారము కలిగి, నాలుగు దిక్కులా ద్వారములు కలిగి ఉంటుంది. అందులో వృత్తాలు కలిగి ఈ వృత్తాలలో ఒకదానికి మరొకటి అనుసంధానించబడిన త్రికోణాలు ఉంటాయి. వ్యతిరేక దిశలో ఉన్న అతి పెద్ద త్రికోణాలు వ్యతిరేక శక్తులు. వీటి అల్లిక (సంగమం) యే అనంత సౌఖ్యానికి దారి. మధ్యన ఉన్న బిందువే పరమానందం. త్రిపుర సుందరి యొక్క ప్రతిరూపం.
ఆద్యంతాలు లేని అనంతమైన అల్లిక శ్రీ వత్స . టిబెట్ లో అవలంబించే బౌద్ధ తంత్రము యొక్క ప్రతీక
తయోర్విరోధోయం ఉపాధికల్పితో

నవస్తావ: కశ్చిదుపాధిరేశా:
లీషాద్యమాయ మహదాదికారణం
జీవస్య కార్యం శ్ణృ పైంచకోశం

ఆత్మ కి, పరమాత్మ కి మధ్య కేవలం వ్యక్తిగత పరిమితులు (ఉపాధి), వివిధ సామర్థ్యాలు మాత్రమే కలవు; అంతకు మించి వేరే ఏ భేదమూ లేదు. "నా లో ప్రాణము కలదు" అని పురుషుడు తెలుసుకొనేలా చేయటమే ప్రకృతి ధర్మము. ఓ మానవా! నీవు గుర్తుంచుకొనవలసినది ఇదే!!!
ఏతా ఉపాధి పర జీవయోస్తయో

సమ్యాగ్నిరసేన పర న జీవో
రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేతక
స్తయోరపోహేన భటో న రాజ

అనగా

ఈ పరిమితులు, వివిధ లక్షణాలు ఆత్మలోనూ, పరమాత్మలోనూ కలవు. ఈ భేదాలని కరిగించినచో, ఒక వ్యక్తి తన రాజ్యానికి తానే ఎలా రాజగునో, అలా ఆత్మయే పరమాత్మ అగును. ఈ భేదాలని తొలగించు. అప్పుడు ఆత్మ, పరమాత్మ నీకు వేరుగా కనబడవు!!!

తంత్రం (సంస్కృతం: तन्त्र) అనే పదానికి తెలుగులో అర్థం నేత, లేదా అల్లిక. ఈ నేత/అల్లికలు అనంతమైన స్పృహ (చైతన్యాని)కి సూచికలు. పరస్పర వ్యతిరేకాల అల్లికయే అనంత సౌఖ్యానికి దారి అని తంత్రము సూచిస్తుంది. గృహస్థుగా ఉంటూనే పరిపూర్ణతని ఎలా సాధించవచ్చునో, ఆధ్యాత్మిక శక్తిని ఎలా పొందవచ్చునో బోధిస్తుంది. ఆత్మని పరమాత్మలో ఐక్యం చేయాలనే గృహస్థు యొక్క లక్ష్యాన్ని చేరుకొనటానికి ప్రకృతి లోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది. మోక్షం పొందటానికి సర్వసంగపరిత్యాగమొక్కటే దారి కాదనీ, సంసార సాగరం కూడా మోక్షమార్గమే నన్న రహస్యాన్ని ఛేదిస్తుంది. మోక్షమార్గంలో ఎదురయ్యే సమస్యలనీ, అడ్డంకులనీ, భావోద్రేకాలనీ స్వీకరించి, వాటిని పరిష్కరించి ఎలా ముందడుగు వేయాలో తెలుపుతుంది. ఇది భారతదేశానికి చెందిన రహస్య సంప్రదాయాలపై ఆధారపడినది. ఈ రహస్య ఆచార-సంప్రదాయాలతో ప్రాపంచిక శక్తి అయిన కోరికను పరికరంగా ఉపయోగించుకొని, సృష్టి యొక్క (వ్యతిరేక) శక్తులని అనుసంధానించి, మానవశరీరాన్ని ఎలా పరివర్తింపజేయాలో నేర్పుతుంది. దీనికి హైందవ, బౌద్ధ, జైన రూపాంతరాలు ఉన్నాయి. భారతదేశంతో బాటు జపాన్, టిబెట్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, కొరియా, కంబోడియా, బర్మా, ఇండోనేషియా, మలేషియాలలో తంత్రము యొక్క రూపాంతరములు ఉన్నాయి.

స్థూలంగా తంత్రము ఈ క్రింది వాటిని బోధిస్తుంది.

 • ఆత్మ, పరమాత్మ ఒకదాని నుండి ఒకటి సుదూరంగా కనబడిననూ అవి నిత్యం ఒకదానికి ఒకటి అల్లుకొనబడే ఉంటాయి
 • వేదము, విజ్ఞానము వ్యతిరేకాలుగా కనబడిననూ అవి ఒకదానికి ఒకటి అల్లుకొనబడి ఉంటాయి (రెండింటిలోనూ సారాంశము ఒక్కటే)
 • భౌతికతలోనే ఆధ్యాత్మికత నేయబడి ఉన్నది
 • అపవిత్రత లోనే పవిత్రత నిగూఢమై ఉన్నది
 • సాత్త్వికము, తామసికము, రజో గుణములు వేర్వేరు అని భ్రమింపజేసిననూ అవి మూడూ ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి
 • తపమునాచరించే సర్వసంగ పరిత్యాగి, సంభోగించే సంసారి; ఇరువురూ మోక్షమార్గ బాటసారులే
 • నిశ్చలానందము, సంసారము విడదీయలేనంతగా పెనవేసుకొని ఉన్నాయి. సంసార సాగర ప్రయాణం నిశ్చలానందమును చేరుకొనటానికి దారి
 • సత్య మార్గము నుండి గృహస్థును దూరం చేసేందుకే మాయ సంసార బాధలనే అవరోధాలు సృష్టిస్తుంది. వీటిని గుర్తించి అధిగమించినపుడే అనంత సౌఖ్యం అతనిని వరిస్తుంది
 • సర్వాంతర్యామి గృహస్థు హృదయాంతరాలలోనే అంతర్లీనమై ఉన్నాడు
 • ప్రతిబంధకాలే మోక్షమార్గమునకు పరికరాలు
 • ఉనికి కలది ఏదైననూ దైవ సృష్టియే. కావున ఉనికి గల దేనినీ అసహ్యించుకొనరాదు. పరిత్యజించరాదు
 • వాస్తవాన్ని గుర్తించటం, సహజత్త్వాన్ని అంగీకరించటమే బ్రహ్మానంద పథం
 • పురోగమనము, తిరోగమనాలు తాత్కాలితాలు. రెండూ అసంపూర్ణాలే. రెండింటి అనుసంధానమే శాశ్వతం. అదే అఖండ సత్యం
 • వ్యతిరేక శక్తులు సంగమించినపుడే సమతౌల్యము. అదే సంపూర్ణ శక్తి. పరిపూర్ణ శక్తి
 • సమాంతర వ్యవస్థలు, వ్యతిరేక భావాలు అన్నియు ఒకదానితో ఒకటి అల్లుకొనబడి ఉన్నాయి

వ్యుత్పత్తి సవరించు

 • తం అనగా విస్తరణ, వ్యాప్తి
 • త్రం అనగా పరిరక్షించటం

జ్ఞానాన్ని విస్తరించటం, జ్ఞాన విస్తరణని పరిరక్షించటమే తంత్రం .

తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన్, ఇతి తంత్రం అనగా 
జ్ఞానాన్ని విస్తరించి, దానిని ఆచరించువారు రక్షింపబడతారు అని అర్థం.

కామికాగమము ప్రకారం

తనోతి విపులన్ అర్థన్ తత్త్వమంత్రసమన్వితాన్ - త్రానంచ కురుతే యస్మత్ తంత్రం ఇత్యభిద్యతే అనగా 
తత్త్వముల లోని జ్ఞానమును మంత్రము లతో కలిపి మోక్షము వైపు నడిపిస్తుంది కాబట్టే దీనిని తంత్రము అంటారు అని అర్థం.

నిర్వచనము సవరించు

డేవిడ్ గోర్డాన్ వైట్, తంత్రానికి గల నిర్వచనాలు అనేకమైనవి అని, ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అని సెలవిస్తూనే

పరమాత్మ స్వరూపుడైన మనిషిలో శక్తిని నింపటానికి, కర్మని స్వీకరించి, ఆచరించి, విముక్తిని పొందే ప్రయత్నానికి సంబంధించిన, ఆసియాలో ఉద్భవించిన సృజనాత్మక మార్గాలు, విశ్వాసాలు, ఆచరణీయ పద్ధతులే తంత్రము. మనం అనుభూతి చెందే ఈ సృష్టి కేవలం దివ్య శక్తి యొక్క రూపాంతరమని, దైవ సృష్టి, దైవ పరిరక్షణ చేసేది కూడా సృష్టియే అనే భావంపై ఇది ఆధారపడినది.

అని నిర్వచించాడు.

హైందవ తంత్రము సవరించు

 
శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతోన్నవి

శివ-పార్వతుల మధ్య జరిగిన సంభాషణలే తంత్ర సూత్రములుగా వ్యవహరింపబడుతోన్నవి. శివుడు పార్వతికి తెలిపినవి ఆగమాలుగా, పార్వతి శివుడికి తెలిపినవి నిర్గమాలుగా తెలుపబడుతోన్నవి. ఈ తంత్ర సాంప్రదాయం నాలుగుగా విభజించబడింది. అవి

హైందవ తంత్రములో శక్తి ముఖ్య దేవతగా కొలవబడుతుంది. ఈ సృష్టి, శివ-శక్తుల దివ్య సంగమముతోనే ఏర్పడినదని నమ్మబడుతుంది. తంత్ర సంప్రదాయాలు, వైదిక సంప్రదాయాలకి సమాంతరంగా ఉంటూనే, ఒక దానితో ఒకటి విడదీయరానివిగా ఉంటాయి. తంత్రము ఫక్తు సనాతన వైదిక నమ్మకములుగా ముద్ర వేయబడ్డవి. తాంత్రిక రచనలు విజ్ఞాన శాస్త్రానికి ఖండించే విధంగా ఉండవు, కానీ, వైదిక బోధనలు ఈ తరం అర్థం చేసుకొనే విధంగా ఉండవు. కావున ఈ తరముకి అర్థమయ్యేలా ఇవే సిద్ధాంతాలు విజ్ఞాన శాస్త్రం ద్వారా చేయబడ్డాయని కొందరు పాశ్చాత్యుల అభిప్రాయము. సనాతన బ్రాహ్మలు కూడా కొందరు తంత్ర శాస్త్రాన్ని ధిక్కరించి, విజ్ఞాన శాస్త్రానిదే పై చేయి అని చాటారు.

ఎన్ ఎన్ భట్టాచార్య ప్రకారం ఆధునిక రచయితలు తంత్ర సిద్ధాంతాలు వేదాధారితాలు అని తెలిపినప్పటికీ పరిశోధకులు వీటిలో వేదాలకి వ్యతిరేక లక్షణాలు కలిగినట్టు గమనించారు.

స్వామీ నిఖిలానందుల ప్రకారం తంత్రాలు, వేదాలకి అవినాభావ సంబంధమున్నది. అంతేగాక ఉపనిషత్తులు, యోగము వంటి వాటిని తంత్రము బాగా ప్రభావితం చేసింది.

మత శాఖలలో తంత్రము సవరించు

అన్ని ఆరాధనలలోనూ వీటి ఆచరణ ఒక్కటే!

బౌద్ధ తంత్రము సవరించు

 
యాబ్-యుం ల అనంత కౌగిలి. పురుష శక్తి కరుణ, ఉపాయాలకి సంకేతము. స్త్రీ శక్తి ప్రజ్ఞకి సంకేతము. ఈ భంగిమ గురించి, ఈ భంగిమలో అనుసంధానించబడే వ్యతిరేక శక్తుల గురించి, దీనిని అవలంబంచటంలో పొందగలిగే సత్ఫలితాల గురించి నవ తంత్రములో విస్తృతంగా చర్చించబడింది. అంతే కాక ఈ భంగిమ ద్వారా సాధారణ గృహస్థు లైంగిక పారవశ్యాన్ని ఎలా పెంచుకొనవచ్చునో కూడా నవ తంత్రము తెలుపుతుంది
 
బౌద్ధ తంత్రము అయిన టావోయిజం (Taoism) లో వ్యతిరేక శక్తుల సంగమ సూచిక. అద్వైతానికి ప్రతీక. వెలుగునిచ్చే తెల్లని ఉష్ణ శక్తి యంగ్ క్రింది నుండి పైకి ఎగసిపడినట్లు ఉండగా; చీకటిమయమైన నల్లని శీతల శక్తి యిన్ పై నుండి క్రిందకు కురుస్తున్నట్లుగా ఉంటుంది. వీటి సంగమము దీర్ఘాయుష్షుని, అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని నమ్మకము

బౌద్ధములో తంత్రము కొనసాగింపు తత్త్వాన్ని సూచిస్తుంది. టిబెట్ దేశ తంత్రానికి అర్థం జ్ఞాన విస్తరణ.

హైందవ తంత్రముతో పోలిక సవరించు

బౌద్ధ తంత్రములో శివుడు యాబ్ (Yab) గా సంబోధించబడగా, శక్తి యుం (Yum) గా సంబోధించబడింది.

లక్ష్యములు సవరించు

బౌద్ధ తంత్రము యొక్క లక్ష్యములు మహాయాన బౌద్ధము యొక్క లక్ష్యములే.

 • అజ్ఞానాంధకారాన్ని నశింపజేయటం
 • జ్ఞానం, కరుణలని పెంపొందించటం
 • శూన్యశక్తి, పరివర్తన, సంసారం, మోక్షాల యొక్క పరిపూర్ణ అవగాహన పొందటం

లక్షణాలు సవరించు

బౌద్ధ తంత్రములో ఈ క్రింది లక్షణాలు ఉన్నాయి.అని ఆంటోని ట్రైబ్ తెలియజేశారు.

 1. దైవపూజలో కేంద్రీకృతమైన ఆచారాలు
 2. కేంద్రీకృతమైన మంత్రాలు
 3. దైవదర్శనము, దైవంతో స్వీయ పోలిక
 4. దీక్షాదక్షత, గోప్యత, రహస్యతల ఆవశ్యకత
 5. ఆచార్యుల ప్రాముఖ్యత
 6. మండల ఆచారములు
 7. అతిక్రమ చర్యలు
 8. శరీరం యొక్క పునర్మదింపు
 9. సృష్టిలో స్త్రీ హోదా, పాత్రల పునర్మదింపు
 10. ఆత్మ, పరమాత్మల గురించి సాదృశ్య ఆలోచనా విధానము
 11. ప్రతికూల మానసిక స్థితుల పునర్మదింపు

విభాగాలు సవరించు

బౌద్ధ తంత్రము నాలుగుగా విభజించబడింది. అవి

 • క్రియ తంత్రము
 • చర్య తంత్రము
 • యోగ తంత్రము
 • అనుత్తరయోగ తంత్రము

అనుత్తర యోగ తంత్రము మరల మూడుగా విభజించబడినది

 • పితృ తంత్రము (పురుష శక్తి అయిన ఉపాయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది)
 • మాతృ తంత్రము (స్త్రీ శక్తి అయిన ప్రజ్ఞకి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది)
 • అద్వైత తంత్రము (పై రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది)

చైనాలో అవలంబించే తంత్రములో మిజోంగ్ అనే రహస్య సిద్ధాంతాన్ని వాడతారు. యోగముకి బదులుగా క్విగోంగ్ అనే రూపాంతరముని వాడతారు. చైనా తంత్రములో అదనపు మంత్రాలు కూడా ఉన్నాయి.

ఆచార వ్యవహారాలు సవరించు

తంత్రము ఒక ఏకీకృత వ్యవస్థ కాదు. తంత్రాన్ని పాటించే వారు విస్తృతంగా ఉండటం వలన దీని ఆచార వ్యవహారాలని కచ్చితంగా నిర్వచించటం కష్టతరమే.

లక్ష్యము సవరించు

తాంత్రిక ఆచారాలు మనిషిలోని శారీరక/మానసిక/ఆధ్యాత్మిక శక్తులని వెలికి తీయటంతో బాటుగా ఆత్మని, పరమాత్మని గుర్తిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారానే ఆత్మని పరమాత్మకి అనుసంధానిస్తూ మనం అతి సాధారణ చర్యలుగా భావించే దైనందిక చర్యలని దివ్య శక్తులుగా ఉపయోగించి వాటి ద్వారా దైవ సిద్ధిని పొందే ప్రయత్నం చేస్తాయి. వాస్తవాన్ని వ్యతిరేకించకుండా అంగీకరించి, వాస్తవానికి దైవత్వాన్ని ఆపాదించి ఉత్పతనతకి దారి తీస్తాయి. ఉత్పతనత ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది.

 • పవిత్రతని చేకూర్చటం
 • విధానాన్ని అవలంబించటం,
 • సద్భావనతోనే అనంత సౌఖ్యం కలుగుతుందనే నమ్మకము కలుగజేయటం

తంత్రాన్ని అవలంబించేవాడు ప్రాణమును (అనగా సృష్టిలోని తన శరీరం గుండా ప్రవహించే శక్తిని) ఉపయోగించుకొని జీవిత (ఆధ్యాత్మిక లేదా/, భౌతిక) లక్ష్యాలని చేరుకొంటాడు.

తంత్ర మార్గము సవరించు

 
శ్రీ చక్ర యంత్రము
న దేవో దేవం అర్చయేత్ అంటే
నీవు దైవము కాలేకపోతే దైవముని నీవు అర్చించలేవు అని అర్థం.

మానవుడు దైవముచే సృష్టించబడిన, దైవముచే నడిపించబడుతున్న ప్రపంచములో జీవిస్తున్నాడు. మానవుడికీ, దైవముకీ మధ్యన ఉన్న ఒక సారూప్యములో అతీంద్రియ శక్తులు విస్తరించి ఉంటాయి. తాంత్రిక ఆచారాలతో మానవుని శరీరం సృష్టి నుండి ఈ సారూప్యతని స్వీకరించేలా చేస్తాయి.

తాంత్రిక పద్ధతులను అవపోసన పట్టటానికి ఒక గురువు క్రింద దీర్ఘకాలిక శిక్షణ అవసరమౌతుంది. ఆధ్యాత్మిక శక్తిని సాధించటానికి, ధ్యానాన్ని కేంద్రీకృతం చేయటానికి వివిధ పరికరాల అవసరం అవుతుంది. అవి

గుహ్యసమాజ తంత్రము ప్రకారం - కష్టతరమైన, అసహజమైన ఆచారాలతో ఎవరూ మోక్షాన్ని పొందలేరు. కోరికలన్నింటినీ తీర్చుకొంటేనే మోక్షము ప్రాప్తిస్తుంది

వర్గీకరణ సవరించు

దక్షిణాచారం, వామాచారం ల విధివిధానాలలో భేదాలు ఉన్ననూ, అవలాన్ (1918) ప్రకారం తాంత్రిక ఆచారాలని రెండు విధాలుగా విభజించవచ్చును. అవి

 • సాధారణ ఆచారం
 • పవిత్ర ఆచారం

సాధారణ ఆచారం సవరించు

పూజ వంటివి సాధారణ ఆచారాలు. పూజలో ఈ క్రింది అంశాలు ఉండవచ్చును.

మంత్రము, తంత్రము, యంత్రము, న్యాసము సవరించు

ఇతర హైందవ, బౌద్ధ సంప్రదాయాల వలె, తంత్ర శాస్త్రములో మంత్రము, తంత్రము, యంత్రము, న్యాసము ముఖ్య పాత్ర పోషిస్తాయి.

 • మంత్రము అనగా జపం
 • తంత్రము అనగా తత్త్వము/వేదాంతము
 • యంత్రము అనగా పరికరము
 • న్యాసము అనగా మంత్రానికి అనుగుణంగా స్పర్శించవలసిన శరీర భాగము

శివుడు, శక్తి, కాళి వంటి దైవాలను ప్రసన్నం చేసుకొనటానికి మంత్రము, యంత్రము పరికరాలుగా ఉపయోగపడతాయి. ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకొనటానికి ధ్యానాన్ని సంబంధిత యంత్రము పై గానీ, మండలం పైగానీ కేంద్రీకరించవలసి ఉంటుంది. న్యాసము మానవ శరీరములో దైవాన్ని జాగృతం చేయటానికి ఉపయోగపడుతుంది.

వివిధ యంత్రాలు సవరించు
వివిధ మండలాలు సవరించు

దైవముతో పోలిక సవరించు

తంత్రములో దైవాలు కూడా హిందూ మతములో దైవాలే. తంత్రము ప్రత్యేకించి శివుణ్ణి, శక్తిని దీపధూపనైవేద్యాలతో ఆరాధిస్తుంది.

దైవ దర్శనము సవరించు

తంత్రములో దైవదర్శనము ధ్యానంతో చేసుకొనబడుతుంది. ఇష్టదైవాన్ని దివ్యనేత్రంతో దర్శించటం జరుగుతుంది. సంభోగ క్రియలో భావప్రాప్తిని పొందినట్లు, సంపూర్ణతని సాధించినట్లు, తాంత్రిక ఊహతో దైవములో ఐక్యము కావటం జరుగుతుంది

భక్త వర్గములు సవరించు

దైవములో ఐక్యము కావటానికి పాటించే ఆచారాలు ఈ క్రింది వర్గములుగా విభజించబడ్డాయి.

 • మృగ
 • వీరోచిత
 • దివ్య

దివ్య భక్తవర్గములో ఆచారాలు అంతర్గతంగా ఉంటాయి. కేవలం దివ్య భక్తవర్గమే ఆచారాలతో శక్తులని జాగృతం చేయగలదు

పవిత్ర ఆచారము సవరించు

ఇంద్రియ సంబంధిత ఆచారాలన్నింటిని తంత్ర ఈ క్రింది విధంగా పవిత్ర ఆచారాలుగా పరిగణిస్తుంది.

 • ఆహారం - విందు
 • కామక్రీడలు - మైథునం, ఆనందము, సృష్టి
 • సమాధి - మృత్యువు, పయనం, మార్పు
 • విసర్జన క్రియలు - అశుద్ధం, అప్రయోజనం, పునర్జన్మ, ఫలప్రదం

మన నిత్యకృత్యాలలో మనం అపవిత్రం అనుకొన్న కార్యక్రమాలని కూడా తంత్రము సానుకూల దృక్పథంతో చూపటం మూలాన హెన్రిక్ జిమ్మర్ ఈ విధంగా తెలిపారు. తంత్రము ఈ ప్రపంచాన్ని సానుకూల దృక్పథంలో చూపిస్తుంది. ప్రపంచం పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది. మనిషి ప్రకృతిని వ్యతిరేకించక సహజ సిద్ధంగా ఆరాధించాలి.

పంచతత్వము అనే పవిత్ర ఆచారములో చక్ర పూజ ఉంది. ఈ చక్ర పూజలో శక్తి (స్త్రీ), సాధకోవి (పురుషుడు) పాల్గొంటారు. వీరిరువురు చక్రాలని ఆరాధిస్తూ వివిధ సత్ఫలితాలని పొందవచ్చును.

లైంగిక ఆచారాలు సవరించు

హైందవములోని ఇతర శాఖలలో తెలిపినట్లే, తంత్రములో కూడా దైవానికి రెండు ధ్రువాలు ఉన్నాయి.అని తెలుపబడింది. అవి

 • పురుష ధ్రువం: చైతన్యము కలది, కాని నిష్క్రియాత్మకమైనది
 • స్త్రీ ధ్రువం: సృజనాత్మకమైనది, క్రియాత్మకమైనది

తాంత్రికులు పలు లైంగిక ఆచారాలని రూపొందించారు. అత్యుత్తమమైన, జటిలమైన ఈ పవిత్ర ఆచారాలు సాధనతో సాధ్యాలే. తంత్రము ప్రకారం లైంగిక చర్యలకి ముఖ్యంగా మూడు ఉద్దేశాలు ఉన్నాయి.

 • ఫలదీకరణము
 • ఆనందము,
 • మోక్షము

లైంగిక చర్యలలో వివిధ దశలు ఉన్నాయి. మోక్షము కోరు వారు అధిక పారవశ్యము పొందుటకై లైంగిక ఆచారములో భాగస్వాములిరువురూ భావప్రాప్తిని పొందే ప్రయత్నం చేయకుండా కదలిక లేని కౌగిలిలో ఒదిగి ఉంటారు. స్త్రీ-పురుష శక్తులు ఒక దానితో మరొకటి మమేకమై సుశుమ్న నాడి ద్వారాలు తెరచి కుండలినీ శక్తిని విడుదల చేస్తాయి. ఈ కౌగిలి కేవలం శరీర కలయికే కాక పరిపూర్ణ శక్తిని సృష్టిస్తుంది. భాగస్వాములు కౌగిలిలో కరిగిపోయి దివ్యజ్ఞానాన్ని పొందినచో ఈ శక్తి శరీరంలోని పై చక్రాలకి విస్తరించి సమాధికి దారి తీస్తుంది.

ఆచార భేదాలు సవరించు

తాంత్రిక ఆచారాలలో భేదాలు ఉన్నాయి. అవి

దక్షిణాచారం సవరించు

దక్షిణాచారం సనాతన భావనలు కలది. సాత్త్విక గుణము కలది. శుద్ధమైనది. ఆస్తికమైనది. ధ్యానాన్ని అవలంబించేది. దక్షిణాచారాలు సంఘం దృష్టిలో గౌరవింపబడేవిగా ఉంటాయి.

మధ్యామచారం సవరించు

మధ్యస్థ భావనలు కలది. తమో గుణము కలది.

వామాచారం సవరించు

వామాచారం అధునాతన భావనలు కలది. రజో గుణము కలది. కల్మషమైనది. నాస్తికమైనది.

వామాచారం పంచమకారాలని పాటిస్తుంది. అవి

 • మద్య
 • మాంస
 • మత్స్య
 • ముద్ర,
 • మైథునాలు

అఘోరీలు వామాచారముని పాటించు తాంత్రికులు.

తంత్రాచారమేదైననూ తంత్ర లక్ష్యమొక్కటే. అదే పరమానందం. పరమానందాన్ని వరించు ప్రక్రియలో గృహస్థు ఏ ఆచారమైననూ పాటించవచ్చును. ఒక ఆచారం ఉత్తమమైనదిగా మరొకటి అధమమైనదిగా తంత్రము పరిగణించదు. సాత్త్వికమైనా, తామసికమైనా, రాజసికమైనా; తంత్రం అన్ని ఆచారాలనీ సమదృష్టితోనే చూస్తుంది.

సిద్ధాంతాలు సవరించు

ఈ ప్రపంచమే వాస్తవము సవరించు

అంతకు మునుపు భారతీయ వేదాంతము దైవమును అతిశయశక్తిగా, ఈ ప్రపంచము ఆ శక్తి యొక్క మాయగా పరిగణించింది. కానీ తర్వాత తంత్ర శాస్త్రము ఈ ప్రపంచం వాస్తవము (మాయ కాదు) అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది. పర్యవసానముగా సాధారణ గృహస్థులు కూడా ఆధ్యాత్మిక విముక్తిని లక్ష్యంగా చేసుకొని తాంత్రిక కరదీపికలని పఠించటం, తాంత్రిక ఆచారాలని పాటించటం జరిగింది.

తంత్రము ఆధ్యాత్మికానికి, ప్రాపంచీకానికి మధ్య దూరాన్ని కరిగించివేయటంతో తాంత్రికులు తమ దైనందిన జీవితాలని ఆధ్యాత్మిక ఎదుగుదలకి అనుసంధానం చేసి, వారి అంతర్గతాలలో అవతరించి ఉన్న సర్వాంతర్యామిని అర్థం చేసుకొనగలిగారు. నశైవం విద్యతే కవచిత్ (దేవుడిది కాని దానికి అస్థిత్వమే లేదు) అనే సత్యాన్ని తాంత్రిక పద్ధతులని అవలంబించటం వలన తెలుసుకొని, అజ్ఞానాంధకారము, సంసార బాధల నుండి విముక్తి పొందసాగారు.

మూఢనమ్మకాలని పెంపొందించక, అసహజ పద్ధతులని ఆశ్రయించక, తాంత్రిక ధ్యానము తమలోని మానవత్వాన్ని, దైవములో తమ ఐక్యాన్ని తాంత్రికులు దర్శించుకొనగలిగేలా చేస్తుంది. స్వచ్ఛమైన ఆలోచనపై భాషాపరమైన లేదా సాంస్కృతిక పరిమితులేవైనా ఉంటే, వాటిని నశింపజేస్తుంది. విముక్తికి బాటలు వేస్తుంది. సత్యములో ఐక్యము చేస్తుంది.

సచ్చిదానంద భావన సవరించు

ప్రకృతికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఈ రెండూ సత్యాలే

 • సృష్టి వికాసం: చరాచరాలకి జన్మనిచ్చి సృష్టిని నడిపించటం
 • పరమాత్మతో జీవి యొక్క అనుసంధానం: స్పృహని, చైతన్యాన్ని, సద్భావనని అలవర్చుకొన్న జీవికి బ్రహ్మానందాన్ని అందించటం

తంత్రము ప్రకారం ఈ సృష్టి దైవశక్తి యొక్క రూపాంతరం. జీవి దైవము యొక్క ప్రతిరూపం. తంత్రము అద్వైతాన్ని బోధిస్తుంది. ద్వైతంతో విభేదిస్తుంది.

తంత్రము నిశ్చలానందము యొక్క ఆంశాలు ఈ మూడే అని తెలుపుతున్నది.

 • సత్ అనగా జీవి
 • చిత్ అనగా జీవి యొక్క మనస్సు
 • ఆనందము అనగా జీవి యొక్క మనస్సులో సద్భావన వలన కలిగే ఆనందము

సచ్చిదానంద భావనలో శివుడు, శక్తి వేర్వేరుగా పరిగణించబడినారు. శివుడు వికాసానికి ప్రతీక ఐతే, శక్తి అంతర్వలనానికి సూచిక. వ్యతిరేక శక్తులైన వికాసము, అంతర్వలనము, కలిస్తేనే సచ్చిదానందము ఉద్భవిస్తుంది.

వికాసము, అంతర్వలనము సవరించు

వికాసము (పురోగమన ప్రవాహం) మాయ నిర్వహించే పాత్రలో సగ భాగం మాత్రమే. వికాసము కేవలం తాత్కాలితం. మిగతా సగం అయిన అంతర్వలనము (తిరోగమన ప్రవాహం) జీవిని అఖండ సత్యానికి చేరుస్తుంది. అంతర్వలనము కూడా తాత్కాలితమే. కానీ వికాసము అంతర్వలనముతో అనుసంధానమైనపుడు ఈ రెండు తాత్కాలిత ప్రక్రియలు శాశ్వతత్త్వాన్ని పొంది, జీవికి మాయ వేసే సంకెళ్ళ నుండి విముక్తి ని ప్రసాదిస్తాయి.

మాయ సత్యాన్ని కనబడకుండా చేస్తుంది. సత్యాన్ని (సద్భావన/వికల భావనలుగా, ఆహ్లాద/అసహ్యాలుగా, సంతోష/దు:ఖాలుగా) విడదీస్తుంది. ఈ ప్రక్రియ అంతయూ వికాసమే. వికాస ప్రక్రియలో మాయని గుర్తించకపోయిన చో క్లిష్ట పరిస్థితులని జీవి అధిగమించకుండా చేసి, జీవిని బంధించి, పరిమితులకి లోను చేసి, పరమానందాన్ని పొందే మార్గానికి మాయ ఆటంకాలని కలుగజేస్తుంది.

తంత్రము యొక్క ద్వంద్వ నీతి సవరించు

ఒక మనిషి మహర్షి కావాలంటే

 • జీవిని ఏదైతే తిరోగమించేలా చేస్తుందో దానితోనే జీవి పురోగమించాలి
 • సంహారకమైన విషమైనా సరే, దానిని తెలివిగా ఉపయోగించి దానినే జీవామృతంగా మలచుకోవాలి

పాశ్చాత్య దృక్పథం సవరించు

సర్ జాన్ వుడ్రోఫ్ సవరించు

తంత్రముని విస్తృతంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి పాశ్చాత్య విద్యావేత్త సర్ జాన్ వుడ్రోఫ్ (1865-1936). ఈయన ఆర్థర్ అవలాన్ అనే కలం పేరుతో తంత్రముపై రచనలు చేశారు. తంత్ర శాస్త్రం పై వెల్లువెత్తిన వివిధ విమర్శలని ఈయన తిప్పి కొట్టి తంత్ర శాస్త్ర పరిరక్షకుడిగా వ్యవహరించారు. వేదాలకు, వేదాంతాలకు అనుగుణంగానే తంత్ర శాస్తం ఉన్నదని, ఇది ఒక నైతిక తాత్విక వ్యవస్థ అని తెలిపారు. తంత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకొనేందుకు వుడ్రోఫ్ హైందవ సంప్రదాయాలని కూడా అవపోసన పట్టాడు.

మరింత అభివృద్ధి సవరించు

తర్వాతి కాలంలో పలు పండితులు తాంత్రిక ఉపదేశాలని శోధించటం మొదలు పెట్టారు. భారతదేశం, ఈ దేశపు సంస్కృతి, సంప్రదాయాల పై ఆసక్తి గలవారే వీరిలో అధికం. ఆదిమ, అతి ప్రాచీన భారతీయ ఆలోచనా సరళికి తంత్రము నిదర్శమని, ఇది ఆధ్యాత్మికత యొక్క అత్యంత తీవ్రమైన రూపమని వీరు కనుగొన్నారు. ఆధునిక యుగంలో తంత్రము పవిత్రతని చేరుకొనటానికి అత్యంత నేరపూరితమైన, హింసాత్మక మార్గంగా గుర్తించారు.

ఆధునిక ప్రపంచములో తంత్రము సవరించు

జోసెఫ్ క్యాంప్ బెల్ వంటి రచయితలు తంత్రమును పాశ్చాత్యుల ఊహాలోకానికి పరిచయం చేశారు. దీనితో అప్పటి వరకూ రతిక్రియల పట్ల వికల భావాలు గల పాశ్చాత్యులు తంత్రమును లైంగికత, ఆధ్యాత్మికతని కలగలిపి, పారవశ్యాన్ని ఆరాధించే మతాధార వ్యవస్థగా గుర్తించారు.

తంత్రము పై పాశ్చాత్య దేశాలలో ఆదరణ పెరిగే కొద్దీ అసలైన తాంత్రిక సాంప్రదాయల నుండి వేర్పడి చాలా పెద్ద మార్పులకి లోనై, ఆధునీకీకరించబడి నవ తంత్రముగా అవతరించింది. ఆధునిక మానవ జాతికి తంత్రము ఆధ్యాత్మిక/అన్యలోక లేదా పవిత్ర రతిక్రియలకి, భాగస్వాములని ఉన్నత ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్ళే లైంగిక మార్గాలకి పర్యాయపదంగా మారిపోయింది. నవ తంత్రము యొక్క పదజాలము, భావనలు సాంప్రదాయిక తంత్రము నుండి వారసత్వంగా తెచ్చుకొన్ననూ, గురువు పై ఆధారపడటం, ధ్యానాన్ని అవలంబించటం, సాంప్రదాయ ప్రవర్తనా నియమాలని వంటి వాటిని కొన్ని విస్మరించింది.

మతము, విధానం యొక్క రచయిత/విమర్శకుడైన హుగ్ అర్బన్ ప్రకారం -

నవ తంత్రములో తాంత్రిక మార్గం అపార్థం చేసుకొనబడుతోంది. తాంత్రిక సౌఖ్యం సాధారణ భావప్రాప్తిగా నవతంత్రము పొరబడుతోంది.

ఇది తప్పు కాదనీ, నిర్దిష్ట చారిత్రక పరిస్థితికి నవతంత్రము ఒక వైవిధ్యమైన అర్థముని ఆపాదించినది అని తెలిపారు.

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. http://www.sacred-texts.com/tantra/sas/index.htm
 2. http://www.shivashakti.com/
 3. https://web.archive.org/web/20141217094148/http://madhyamacharatantra.wordpress.com/2012/11/20/59/
 4. Kāmikāgama, I, 29; quoted in Mark SG Dyczkowski, Canon of the Saivagama and the Kubjika Kaula Tantras of the Western Tradition, State University of New York Press, 1988, p. 140
 5. Complete Idiot's Guide to Tantric Sex by Dr. Judy Kuriansky
 6. Maximum tantric, quoted in Mircea Eliade, Yoga, Op. Cit., P. 200
 7. Guhyasamaja Tantra; cited in Mircea Eliade, Yoga, Op. Cit., P. 197
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.