దీపా కర్మాకర్

భారత జిమ్నాస్ట్

దీపా కర్మాకర్ (Bengali: দিপা কর্মকার; జననం: 1993 ఆగస్టు 9, అగర్తల) ఒక భారతీయ కళాత్మక జిమ్నాస్ట్, ఈమె 2016 ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించటంంతో జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత పొందిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా ప్రసిద్ధి చెందింది.

దీపా కర్మాకర్
— Gymnast —
Personal information
ప్రాతినిధ్యం వహిస్తున్న దేశము భారతదేశం
జననం (1993-08-09) 1993 ఆగస్టు 9 (వయసు 31)
అగర్తలా, త్రిపుర, భారత దేశము
కృషిమహిళల ఆస్టిస్టిక్ జిమ్నాస్టిక్స్
Levelసీనియర్ అంతర్జాతీయ ఎలైట్
ప్రధాన శిక్షకులుబిశ్వాస్వర్ నంది

ఈమె 1964 టోక్యో ఒలింపిక్స్ తరువాత అనగా 52 సంవత్సరాల తరువాత జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ క్రీడలకు అర్హత పొందిన తొలి భారత జిమ్నాస్ట్. జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్ క్రీడలకు ఈమె అర్హతకు ముందు మొత్తం మీద పురుషుల విభాగంలో భారత్ నుంచి 1952 హెల్సింకి ఒలింపిక్స్ కి ఇద్దరు, 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్ కి ముగ్గురు, 1964 టోక్యో ఒలింపిక్స్ కి ఆరుగురు ప్రాతినిధ్యం వహించారు.

నేపధ్యము

మార్చు

జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి భారత అథ్లెట్‌గా తన పేరున చరిత్ర లిఖించుకున్న త్రిపుర అమ్మాయి దీపా కర్మాకర్‌. ఒలింపిక్స్‌లో ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌ చేరుకొని మరో అరుదైన ఘనత సాధించింది.

త్రిపుర రాష్ట్రంలో సరైన సదుపాయాలే లేని గ్రామం నుంచి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైంది దీపా కర్మాకర్‌. రియోలో పతకం తెస్తుందా లేదా అనే అంశం పక్కన బెడితే ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడమే అత్యుత్తమం. ఒలింపిక్స్‌ కోసం రోజుకు 9 గంటలు సాధన చేసిన ఆమె దాదాపు రెండువేల సార్లకు పైగా ప్రొడునొవాను సాధన చేసింది. 720 డిగ్రీల కోణంలో తిరిగే అత్యంత ప్రమాదకర సుకహర విన్యాసం సైతం కఠోర సాధన చేసింది.

ఘనతలు

మార్చు
  • 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్యం (వాల్ట్)
  • 2015 ఆసియా చాంపియన్‌షిప్ లో కాంస్యం (వాల్ట్)
  • 2009, 2011, 2013, 2014, 2015లలో జరిగిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్ లకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం
  • 2015 లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు

ఇవి కూడా చూడండి

మార్చు

ప్రొడునొవా

మూలాలు

మార్చు
  • సాక్షి దినపత్రిక - 19-04-2016 (ఎన్నాళ్లో వేచిన ఉదయం - రియో ఒలింపిక్స్‌కు జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అర్హత)