ప్రొడునొవా
ప్రొడునొవా అనునది జిమ్నాస్టిక్స్లో ప్రదర్శించే ఒక విన్యాసము. ఇది అత్యంత ప్రమాదకరమైన విన్యాసము. 2016లో రియో ఒలింపిక్స్ లో పోటీపడుతున్న భారత ఏకైక క్రీడాకారిణి దీపా కర్మాకర్ దీనిని ఇప్పటి వరకు రెండు సార్లు ప్రదర్శించింది.
నేపధ్యము
మార్చుజిమ్నాస్టిక్స్లో ఎక్కువ స్కోర్ సాధించేందుకు క్రీడాకారులు ప్రదర్శించే విన్యాసం ప్రొడునొవా. ఇది చేస్తున్నారంటే దాదాపు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లే! క్రికెట్ భాషలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పరిగణిస్తున్న జెఫ్ థామ్సన్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ హెల్మెట్, రక్షణ వ్యవస్థ లేకుండా బ్యాటింగ్ చేయడం లాంటిది. దీప ప్రొడునొవా ప్రదర్శించడంలో ఏ మాత్రం తడబడ్డా ఆమె ప్రాణాలకెంతో ప్రమాదం. అంటే ప్యారాచూట్ లేకుండా విమానం నుంచి దూకేయడం లాంటిది. ప్రొడునొవా ప్రదర్శించేటప్పుడు జిమ్నాస్ట్ వేగంగా పరిగెత్తి వాల్ట్‌పై చేతులతో బలంగా నొక్కి గాల్లోకి ఎగురుతారు. తల కిందికి వంచి మోకాళ్లను ఛాతికి ఆనించి చేతులతో పట్టుకొని మూడు చుట్లు తిరిగి మ్యాట్‌పై ల్యాండ్ అవుతారు. క్రీడాకారుడు గాల్లో వేగంగా తిరిగేటప్పుడు ఒత్తిడి రెట్టింపవుతుంది. విన్యాసం పూర్తి కాకుండానే మెడతో నేలపై ల్యాండ్ అయితే వెన్నెముక విరిగి జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది.. లేదా మృత్యువే గతి. ఒకవేళ ఒక్క కాలిపైనే భారం పడితే కాలు విరగడం ఖాయం.[1]
నిషేధం కోసం డిమాండ్
మార్చురష్యన్ అథ్లెట్ యెలీనా ప్రొడునొవా పేరును ఈ విన్యాసానికి పెట్టారు. 1999లో తొలిసారి ఆమె ఈ ఫీట్ ప్రదర్శించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం నలుగురు మాత్రమే దీన్ని ప్రదర్శించగా దీప మూడో క్రీడాకారణి. రెండు సార్లు ప్రదర్శించిన రెండో అథ్లెట్ కూడా. ఈ విన్యాసంలో అత్యధిక స్కోరు 15.300 సైతం ఆమెదే. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్‌లో అత్యుత్తమ అథ్లెట్‌గా భావిస్తున్న అమెరికా అథ్లెట్ సిమోన్.. కలలో సైతం ప్రొడునొవా సాధన చేసేందుకు ప్రయత్నించనని చెబుతోంది. మిగతా వాల్ట్ విన్యాసాలకు డిఫికల్టీ లెవల్‌లో 5 మార్కులువేస్తే ప్రొడునొవాకు 7 మార్కులు ఇస్తారు. జిమ్నాస్టిక్స్‌లో ఈ విన్యాసం నిషేధించాలని ఇప్పుడిప్పుడే డిమాండ్లు పెరుగుతున్నాయి.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "" దీప ప్రొడునొవా.. మృత్యువుతో యుద్ధమే! "". www.eenadu.net. ఈనాడు. 8 ఆగస్టు 2016. Archived from the original on 2016-08-07. Retrieved 8 ఆగస్టు 2016.