దీపికా పాండే సింగ్

దీపికా పాండే సింగ్ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మహాగామ శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2024 జులై 8న హేమంత్ సొరేన్ మంత్రివర్గంలో వ్యవసాయ, పశుసంవర్ధక & విపత్తు నిర్వహణ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[1]

దీపికా పాండే సింగ్
దీపికా పాండే సింగ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జులై 8 - ప్రస్తుతం
ముందు అశోక్ కుమార్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం మహాగామ

వ్యక్తిగత వివరాలు

జననం (1976-06-22) 1976 జూన్ 22 (వయసు 48)
రాంచీ , జార్ఖండ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి రత్నేష్ కుమార్ సింగ్
సంతానం 2
నివాసం మహాగామ, జార్ఖండ్
వృత్తి మీడియా ప్రొఫెషనల్

జననం, విద్యాభాస్యం

మార్చు

దీపికా పాండే సింగ్ 22 జూన్ 1976న రాంచీలో జన్మించింది. ఆమె 1994-97లో రాంచీలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి జీవశాస్త్రంలో బీఎస్సీ డిగ్రీని, 1998 నుండి 2000 వరకు జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ నుండి తన ఎంబీఏను పూర్తి చేసి 2008 నుండి 11 వరకు జంషెడ్‌పూర్‌లోని కోఆపరేటివ్ కాలేజీ నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకుంది.

రాజకీయ జీవితం

మార్చు

దీపికా పాండే సింగ్ జార్ఖండ్‌లోని రాంచీలో రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి ప్రతిభా పాండే భారత జాతీయ కాంగ్రెస్ మహిళా విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పని చేసింది. దీపికా భర్త రత్నేష్ కుమార్ సింగ్‌ మహాగామా నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగం యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి జార్ఖండ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా జాతీయ కమిటీకి పదోన్నతి అందుకుంది.

దీపికా పాండే సింగ్‌ను 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత జార్ఖండ్‌లోని కాంగ్రెస్ కంచుకోట అయిన గొడ్డాలో కాంగ్రెస్‌ను పునరుద్ధరించే బాధ్యతను ఆమెకు అప్పగించి గొడ్డా జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. ఆమె 2018లో మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా నియమితురాలైంది. దీపికా 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మహాగామా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి అశోక్ భగత్‌ను 12,499 ఓట్ల మెజారిటీతో ఓడించి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 2024 జులై 8న హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో వ్యవసాయ, పశుసంవర్ధక & విపత్తు నిర్వహణ శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[3]

మూలాలు

మార్చు
  1. India TV News (8 July 2024). "Full list of ministers with portfolios in Hemant Soren's Cabinet | CHECK" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  2. India TV (23 December 2019). "Mahagama Constituency Result: Congress' Deepika Singh wins by 12,499 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  3. NDTV (8 July 2024). "Jharkhand New Cabinet Portfolios Announced. Who Gets What: See Full List". Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.