బి.ఆర్. విజయ్ కుమార్ (జననం 1974 జనవరి 20) కన్నడ భాషా చిత్రాలలో నటించే భారతీయ కళాకారుడు. వృత్తిపరంగా దునియా విజయ్ గా పిలవబడుతాడు. చిన్న పాత్రలు చేస్తూ సినీ కెరీర్‌ను ప్రారంభించిన అతడికి 2007లో వచ్చిన దునియా సినిమా ఒక్కసారిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో కెరీర్ లో దూసుకుపోయిన అతను చందా (2007), జంగ్లీ (2009), జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్ (2011), జయమ్మన మగా (2013) చిత్రాలతో తన నటనకు మరింత ప్రసిద్ది చెందాడు.

దునియా విజయ్
2013లో దునియా విజయ్
జననం
బి. ఆర్. విజయ్ కుమార్

(1974-01-20) 1974 జనవరి 20 (వయసు 50)
కుంబరన్హల్లి, అనేకల్, కర్ణాటక, భారతదేశం
వృత్తినటుడు, దర్శకుడు, సినిమా నిర్మాత, స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు2001 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
  • నాగరత్న
    (m. 1999; div. 2013)
  • కీర్తి పట్టాడి
    (m. 2016)
పిల్లలు3
పురస్కారాలుఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం

గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి (2023)లో బాలకృష్ణ కథానాయకుడు, శ్రుతిహాసన్‌ కథానాయిక కాగా ప్రతినాయకుడిగా దునియా విజయ్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు.[1]

కెరీర్ మార్చు

2004లో రంగ (SSLC) చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత అతను జోగి, శ్రీ మొదలైన చిత్రాలతో పాటు టెలివిజన్‌ ధారావాహికలలో కూడా నటించాడు.

అతని స్నేహితుడు సూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం దునియాతో బి.ఆర్. విజయ్ కుమార్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ చిత్రంలో అమాయక పల్లెటూరి కుర్రాడిగా అతను నటించాడు, అతని నటన విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. ఈ చిత్రంలో తన పాత్రకు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దునియా విజయ్ ని వరించాయి.

ఫిల్మోగ్రఫీ మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర విషయాలు
2004 రంగా (SSLC)
2005 జోగి
2005 రిషి
2005 డెడ్లీ సోమ
2005 గిరి
2005 రాక్షస
2005 మెంటల్ మాంజా
2006 శ్రీ
2006 అంబి
2006 కల్లరాలి హూవాగి
2007 శ్రీ క్షేత్ర కైవర తాతయ్య అతిధి పాత్ర
2007 గుణ అతిధి పాత్ర
2007 దునియా ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
2007 యుగ
2007 గెలీయా
2007 చందా
2007 ఈ రాజీవ్ గాంధీ అల్లా
2008 అవ్వ
2008 స్లమ్ బాలా
2009 జంగ్లీ
2009 థాకత్
2009 దేవ్రు
2010 శంకర్ IPS
2010 కరి చిరతే
2010 కంఠీరవ
2010 ఐతలక్కడి అతిథి పాత్ర
2011 వీర బాహు
2011 జానీ మేరా నామ్ ప్రీతి మేరా కామ్
2011 జరాసంధ
2012 భీమ తీరదల్లి నటుడిగా సువర్ణ క్రిటిక్స్ అవార్డు
2012 రజనీకాంత ద్విపాత్రాభినయం
2013 జయమ్మన మగా
2014 శివాజీనగర
2014 సింహాద్రి
2015 జాక్సన్
2015 దక్ష
2015 RX సూరి
2015 రింగు రోడ్డు
2016 దాన కాయోను
2017 మస్తీ గుడి
2018 కనక
2018 జానీ జానీ ఎస్ఎ స్ పాపా
2021 సలగ దర్శకుడు కూడా
2022 భీమ దర్శకుడు కూడా
2023 వీర సింహ రెడ్డి ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి తెలుగు అరంగేట్రం[2]

మూలాలు మార్చు

  1. "Duniya Vijay: ముసలిమడుగు ప్రతాప్‌ రెడ్డిగా గుర్తుండిపోతా". web.archive.org. 2023-01-06. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (6 January 2023). "బాలకృష్ణతో నటించడం నా అదృష్టం!". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.