దురాచారం

(దురాచారాలు నుండి దారిమార్పు చెందింది)

దురాచారం అంటే చెడ్డ ఆచారం. చెరుపు చెసేది. హానిచేసేది. ఐక్యతను చెడగొట్టేది. ఉదాహరణలు:

కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు చిత్రం

మరికొన్ని దురాచారాలు

మార్చు
  1. గర్బిణి శవం చెట్టుకు ఉరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లాయపల్లికి చెందినవారు అనారోగ్యం వల్ల మృతిచెందిన ఎనిమిది నెలల గర్భిణిని అడవిలో చెట్టుకు వేలాడదీశారు.రెండు ప్రాణాలతో ఉన్న మృతదేహాన్ని పూడ్చిపెడితే గ్రామానికి అరిష్టమని చెప్పి, మృతదేహాన్ని అడవిలోకి తీసుకువెళ్లి చెట్టుకు వేలాడదీసి వచ్చారు.కరువొస్తుందనే అలా చేశారు: గ్రామస్థులు రెండు ప్రాణాలతో చనిపోయిన శవాన్ని పూడ్చిపెడితే ఆ గ్రామంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల్లో కరవు కాటకాలు వచ్చి, పంటలు పండక అరిష్టం కలుగుతుందట. (ఈనాడు 12.7.2009)
  2. కప్పతో బాలిక వివాహం:విల్లుపురం జిల్లా చిన్నపిళ్లైపుదుప్పేట్‌ గ్రామంలో ఐదేళ్ళ బాలికకు కప్పతో వివాహం జరిపించారు.అనాదిగావస్తున్న ఆచారం కొనసాగించక పోతే గ్రామానికి కీడు సంభవిస్తుదని గ్రామస్థులు భావించారు. అలంకరించిన కప్పకు, బాలికకు వైభవంగా వివాహం జరిపించారు. దీనితో గ్రామంతో పాటు బాలిక కుటుంబం కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుందని గ్రామస్థులు విశ్వాసం.ఇటువంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకుంటామని జాతీయ మానవ హక్కుల సంఘం గత ఏడాది తీవ్ర హెచ్చరికలు చేశారు. (ఆంధ్రజ్యోతి 18.1.2010)
"https://te.wikipedia.org/w/index.php?title=దురాచారం&oldid=3397544" నుండి వెలికితీశారు