దుర్గామతి 2020లో హిందీలో విడుదలైన హారర్‌ థ్రిల్లర్‌ సినిమా . 2018లో తెలుగులో విడుదలైన 'భాగమతి' సినిమాను హిందీలో రీమెక్‌ చేశారు. అబున్ దంతియా ఎంట‌ర్‌టైన్‌మెంట్, టీ - సిరీస్, కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల పై విక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్ , అక్షయ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు జి. అశోక్ దర్శకత్వం వహించాడు. భూమి ఫెడ్నేకర్‌ , అర్షద్ వార్సీ, జిష్షు సేన్ గుప్తా, మహి గిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 11 డిసెంబర్ 2020న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ లో విడుదలైంది.[2]

దుర్గామతి
దర్శకత్వంజి. అశోక్
రచనదక్షేషు చావ్లా జి. అశోక్
రవీందర్ రంధావా
స్క్రీన్ ప్లేశ్వేతా. జె. మోర్
దీనిపై ఆధారితంభాగమతి
నిర్మాతవిక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్ , అక్షయ్ కుమార్, క్రిషన్ కుమార్
తారాగణంభూమి ఫెడ్నేకర్‌
అర్షద్ వార్సీ
జిష్షు సేన్ గుప్తా
మహి గిల్
ఛాయాగ్రహణంకుల్దీప్ మామణియా
కూర్పుసంజీవ్ కుమార్
సంగీతంపాటలు:
తనిష్క్ బాగ్చి
నామన్ అధికారి
అభినవ్ శర్మ
మాలిని అవాస్తి
నేపధ్య సంగీతం:
జాక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థలు
అబున్ దంతియా ఎంట‌ర్‌టైన్‌మెంట్
టీ - సిరీస్
కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
2020 డిసెంబరు 11 (2020-12-11)
సినిమా నిడివి
156 నిమిషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ

కథ మార్చు

చంచల్ చౌహన్ (భూమి ఫెడ్నేకర్‌) ఒక ఐఏఎస్ అధికారి. ఆమె తనకు కాబోయే భర్తను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. చంచల నుంచి సమాచారం రాబట్టాలని అనుకుంటారు.మంత్రి ఈశ్వర్ ప్రసాద్ (అర్షద్ వార్సీ) గురించి తెలుసుకునే క్రమంలో ఆమెను ఓ ప్రైవేట్ ప్లేస్ లో ఇంటరాగేషన్ చేయాలని చూస్తారు. అందుకోసం ఆమెను జైలు నుంచి అటవీ ప్రాంతంలో ఉండే పాడుబడ్డ బంగ్లాకు తరలిస్తారు. ఆ బంగ్లాకు వెళ్లాక అనూహ్య పరిణామాలు జరుగుతాయి. భాగమతి బంగ్లాగా పేరున్న దాని వెనుక కథేంటి ? ఇంతకీ చంచల తనకు కాబోయే భర్తను ఎందుకు చంపింది?? మంత్రి నిజంగా అవినీతి పరుడా?? చివరికి చంచల కేసు నుంచి బయటి పడిందా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

  • భూమి ఫెడ్నేకర్‌ - చంచల్ చౌహన్ ఐఏఎస్ / దుర్గామతి
  • అర్షద్ వార్సీ - కేంద్ర మంత్రి ఈశ్వర్ ప్రసాద్ [3]
  • జిష్షూసేన్ గుప్తా - ఏసీపీ అభయ్ సింగ్ [4]
  • మహి గిల్ - సిబిఐ చీఫ్ శతాక్షి గంగూలీ [5]
  • కరణ్ కపాడియా - శక్తి సింగ్ [3]
  • ప్రభాత్ ఘునందన్ - అజయ్ యాదవ్
  • అశోక్ శర్మ - అజయ్ తండ్రి
  • ధనరాజ్ - నంద్ సింగ్
  • బ్రీజ్ భూషణ్ శుక్ల - గోపి
  • ఆదా సింగ్ - శతాక్షి కూతురు
  • షోయబ్ అలీ - సోధి
  • సుబేన్ద్ర గుప్త
  • చానన్ విక్కీ రాయ్
  • అమిత్ బెహల్
  • కే. దుర్గ ప్రసాద్
  • ముస్కాన్ లల్వాని
  • అనంత్ మహదేవన్
  • తాన్యా అబ్రాల్

మూలాలు మార్చు

  1. "Durgamati (2020)". British Board of Film Classification. Retrieved 11 December 2020.
  2. https://www.filmcompanion.in/readers-articles/durgamati-the-myth-review-amazon-prime-video-stays-faithful-to-the-original-yet-does-not-hold-up-bhumi-pednekar-mahie-gill-jisshu-sengupta/amp/
  3. 3.0 3.1 "Arshad Warsi to play the bad guy in Bhumi Pednekar's Durgavati; Karan Kapadia too joins the cast". Bollywood Hungama. 6 February 2020. Archived from the original on 7 February 2020. Retrieved 8 February 2020.
  4. "'Durgavati' night shoot keeps Jisshu hooked". 7 February 2020. Archived from the original on 28 October 2020. Retrieved 1 November 2020.
  5. "Mahie Gill joins Bhumi Pednekar in horror-thriller Durgavati". Mid-Day. 21 January 2020. Archived from the original on 17 April 2020. Retrieved 10 October 2020.