జి. అశోక్ ఒక సినీ దర్శకుడు, రచయిత, నాట్యకళాకారుడు.[1] మాతృభాష తెలుగుతో పాటు ఇతర దేశీయ భాషలైన తమిళం, కన్నడం, మలయాళం బాగా మాట్లాడగలడు. హిందీ, అరబ్బీ, జర్మన్, రష్యన్ భాషలు కూడా నేర్చుకున్నాడు.

అశోక్
జననం
వృత్తిసినీ దర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామివిజయలక్ష్మి
పిల్లలుఅశ్వజ, అశ్విత, అశ్విన్
తల్లిదండ్రులు
  • అదృష్ట దీపక్ (తండ్రి)

బాల్యం, విద్యాభ్యాసం సవరించు

అశోక్ వాళ్ళ అమ్మ ఊరైన తెనాలిలో పుట్టాడు. తండ్రి అదృష్ట దీపక్. ఆయన కాంట్రాక్టరుగా పనిచేసేవాడు. అశోక్ ఒంగోలులో పెరిగాడు. ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాడు. ఐదేళ్ళ వయసు నుంచి నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈయన గురువు కోదండరామశాస్త్రి. పన్నెండేళ్ళకి పదమూడు సాంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాడు. పాఠాశలలో ఉండగానే సుమారు ఐదువేల ప్రదర్శనలు ఇచ్చాడు. 16 సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. పుస్తకాలు బాగా చదివే వాడు. విజయవాడ లో ఇంజనీరింగ్ చదివాడు.

వృత్తి సవరించు

నాట్యంలో ప్రవేశించడానికి చెన్నై వెళ్ళాడు. నృత్య దర్శకురాలు స్వర్ణలత వాళ్ళింట్లో ఉంటూ ఆమెకు సహాయకుడిగా పని చేసేవాడు. దాదాపు 300 పాటలకు నృత్య దర్శకత్వం వహించాడు. లారెన్స్, రాజు సుందరం దగ్గర కూడా కొద్ది రోజులు పనిచేశాడు. సల్సా నృత్యం నేర్చుకోవడానికి లండన్ వెళ్ళాడు. అక్కడి వారికి భారతీయ సాంప్రదాయ నృత్య రీతులను పరిచయం చేసి వారి నృత్య రీతులకు నేర్చుకున్నాడు. ఖాళీ సమయాల్లో దర్శకత్వానికి సంబంధించిన కోర్సుకు కూడా హాజరయ్యాడు.

దర్శకుడిగా అశోక్ తొలిచిత్రం ఉషోదయం. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాను బడి పిల్లలందరికీ ఉచితంగా ప్రదర్శించింది. దర్శకుడిగా బంగారు నంది పురస్కారం దక్కింది. తర్వాత మీడియా నేపథ్యంలో ఫ్లాష్ న్యూస్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తర్వాత అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆకాశ రామన్న అనే సినిమా తీశాడు. ఇది రివర్స్ స్క్రీన్ ప్లే తో ప్రయోగాత్మకంగా తీయబడింది. తర్వాత నానితో తీసిన పిల్లజమీందార్ సినిమాతో మంచి విజయాన్నందుకున్నాడు. ఆది కథానాయకుడిగా వచ్చిన సుకుమారుడు ఫలితం నిరాశపరిచింది. తర్వాత వచ్చిన భాగమతి విజయం సాధించింది.[2]

సినిమాలు సవరించు

కుటుంబం సవరించు

ఇతని భార్య పేరు విజయలక్ష్మి. మునుపు భౌతిక శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసేది. ప్రస్తుతం సినిమాలకు పనిచేస్తూ ఉంది. ఈ దంపతులకు ఒకే కానుపులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి జన్మించారు. వీరి పేర్లు అశ్వజ, అశ్విత, అశ్విన్.[4]

మూలాలు సవరించు

  1. "చిరంజీవిని అనుకరించేవాణ్ని!". eenadu.net. ఈనాడు. Archived from the original on 14 April 2018. Retrieved 14 April 2018.
  2. "This will be the best performance of Anushka Shetty's career: G Ashok on 'Bhaagamathie'". Scroll.in. 20 January 2018. Retrieved 14 April 2018.
  3. 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.
  4. Kavirayani, Suresh (3 March 2017). "Ashok, a man of many talents". Deccan Chronicle. Retrieved 14 April 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=జి._అశోక్&oldid=3009670" నుండి వెలికితీశారు