భాగమతి (2018 సినిమా)

2016 లో అశోక్ చే విడుదల చేసిన సినిమా

భాగమతి జి. అశోక్ దర్శకత్వంలో 2016 December 22న విడుదలైన[2] తెలుగు, తమిళ సినిమా.[3] ఈ చిత్రాన్ని హిందీలో దుర్గామతి గా రీమేక్ చేశారు. ఇందులో భూమి పెడ్నేకర్ అనుష్క పాత్రలో నటించింది.[4]

భాగమతి
దర్శకత్వంజి. అశోక్
రచనజి. అశోక్
నిర్మాతవి.వంశీకృష్ణా రెడ్డి
ప్రమోద్
జ్ఞానవేల్ రాజా
తారాగణంఅనుష్క శెట్టి
ఉన్ని ముకుంద‌న్‌
జయరాం
ఆశా శరత్
ఛాయాగ్రహణం
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
22 డిసెంబరు 2016 (2016-12-22)
సినిమా నిడివి
142 నిమిషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళం

భారీ నీటి పారుద‌ల శాఖా మంత్రి ఈశ్వ‌ర్ ప్రసాద్ (జ‌య‌రాం)కు ప్ర‌జ‌ల్లో మంచి పేరు, ప‌లుకుబ‌డి ఉంటుంది. ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌కు భక్తి ఎక్కువ‌. తరచు ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తుంటాడు. అదే స‌మ‌యంలో ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లోని పురాత‌న విగ్ర‌హాల‌ను ఎవ‌రో చోరీ చేస్తుంటారు. దాంతో ప్ర‌భుత్వం విగ్ర‌హాల చోరీని అరిక‌ట్టేందుకు సి. బి. ఐ జాయింట్ డైరెక్టర్ వైష్ణ‌వి న‌ట‌రాజ‌న్ నేతృత్వంలో ఓ విచారణా సంఘాన్ని నియ‌మిస్తారు. అశా ప‌రిశోధ‌న‌లో ఈశ్వ‌ర్ ప్ర‌సాద్ అల‌యాల సంద‌ర్శ‌న‌లో ఉన్న స‌మ‌యంలోనే విగ్ర‌హాలు చోరీ అవుతున్న సంగ‌తుల‌ను గుర్తిస్తుంది. అయితే ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌ నేరాన్ని నిరూపణ చేయాలంటే అత‌ని లొసుగుల‌ను తెలుసుకోవాల‌ని ఆయ‌న ద‌గ్గ‌ర వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన చంచ‌ల‌ను విచారించాల‌నుకుంటుంది. చంచ‌ల ఐఏయ‌స్ అధికారి. అయితే అదనపు క‌మీష‌న‌ర్ సంప‌త్‌ (ముర‌ళీశ‌ర్మ‌) సోద‌రుడు, త‌న‌కు కాబోయే భ‌ర్త శ‌క్తి(ఉన్ని ముకుంద‌న్‌)ను హ‌త్య చేసిన నేరంలో జైలు శిక్ష అనుభ‌విస్తుంటుంది. ఆమెను ఎవ‌రికీ తెలియ‌కుండా విచారించాల‌నుకున్న వైష్ణ‌వి... సంప‌త్ స‌హాయంతో ఊరికి దూరంగా ఉన్న భాగ‌మ‌తి బంగ‌ళాల‌కు తీసుకొస్తుంది. ఆ బంగ‌ళాలో చంచ‌ల‌ను బంధించి, బ‌య‌ట రక్షణ సిబ్బందిని పెడుతుంది. భాగ‌మ‌తి బంగళా అంటే ఆ చుట్టుప‌క్క‌ల ఉండేవారికి భ‌యం. రాణీ భాగ‌మ‌తి దేవి దెయ్య‌మై తిరుగుతుంద‌ని అంద‌రూ న‌మ్ముతుంటారు. లోప‌లికి వెళ్లిన చంచ‌ల‌కు ఆమె చుట్టూ అనుకోని ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో భ‌యానికి లోన‌వుతుంది. లోప‌ల దెయ్యం ఉంద‌ని చంచ‌ల చెప్పినా ఎవ‌రూ న‌మ్మ‌రు. నిజంగానే బంగ‌ళాలో దెయ్యం ఉందా? చంచ‌ల‌ను భ‌య‌పెట్టి, చిత్ర హింస‌ల‌కు గురి చేసేదెవ‌రు? అస‌లు ఈశ్వ‌ర్ ప్ర‌సాద్‌, చంచల‌కు ఉన్న సంబంధం ఏంటి? అనే విష‌యాలు మిగిలిన కథలో భాగం.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • మందార , రచన: శ్రీజో , గానం.శ్రేయాఘోషల్
  • థీమ్ సాంగ్ , రచన: సుచిత్ర, గానం . సుచిత్ర

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. https://timesofindia.indiatimes.com/entertainment/telugu/bhaagamathie-isnt-your-run-of-the-mill-horror-flick-it-will-surprise-you-anushka/articleshow/62653245.cms
  2. "Anushka Shetty sheds 18 kilos for her upcoming film"
  3. BHAAGAMATHIE | British Board of Film Classification
  4. "Bhumi Pednekar's Durgamati First Look is out". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-11-23. Retrieved 2020-12-11.
  5. "Bhagmati is a modern-day thriller; not a period drama based on the Hyderabad queen: Anushka"

బయటి లంకెలు

మార్చు