దుర్యోధన్ మాఝీ (14 ఏప్రిల్ 1938 - 11 జనవరి 2022) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖరియార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో సమాచార & ప్రజా సంబంధాలు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ, ప్రణాళిక & సమన్వయం, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నారు.

దుర్యోధన్ మాఝీ
దుర్యోధన్ మాఝీ


సమాచార & ప్రజా సంబంధాలు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ, ప్రణాళిక & సమన్వయం, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రి
పదవీ కాలం
2000 – 2009

ఎమ్మెల్యే
పదవీ కాలం
1990 – 2009
ముందు అనూప్ సింగ్ దేవ్
తరువాత హితేష్ కుమార్ బగర్ట్టి
నియోజకవర్గం ఖరియార్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2019
ముందు హితేష్ కుమార్ బగర్ట్టి
తరువాత అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి
నియోజకవర్గం ఖరియార్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్, భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

దుర్యోధ‌న్ మాఝీ ఖరియార్ నియోజకవర్గం నుండి 1990, 1995లో జ‌న‌తాద‌ళ్ టికెట్‌పై రెండు సార్లు, 2000, 2004లో బిజూ జ‌నతాద‌ళ్ టికెట్‌పై రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2000 - 2009 మధ్యకాలంలో రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలు, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, ప్రణాళిక & సమన్వయం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పని చేసి 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2014లో బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఆయనకు 2019లో భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి బిజూ జనతా దళ్ పార్టీలో చేరాడు.[1]

దుర్యోధన్ మాఝీ వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ పరిస్థితి విషమించడంతో 11 జనవరి 2022న మరణించాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. NDTV (24 March 2019). "Odisha Lawmaker, Denied Ticket By BJP, Returns To BJD". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  2. The Times of India (12 January 2022). "Ex-min Majhi passes away at 84". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  3. The New Indian Express (12 January 2022). "Odisha ex-minister Duryodhan Majhi passes away" (in ఇంగ్లీష్). Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
  4. NT News (11 January 2022). "వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో సీనియ‌ర్ రాజ‌కీయ నేత క‌న్నుమూత‌". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.