దుషన్ హేమంత

శ్రీలంక క్రికెట్ ఆటగాడు

దుషన్ హేమంత (జననం 1994, మే 24) శ్రీలంక క్రికెట్ ఆటగాడు. ఆల్ రౌండర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్ గా, కుడిచేతి లెగ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[1] ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో దంబుల్లా ఆరా తరఫున ఆడుతున్నాడు.[2]

దుషన్ హేమంత
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మునసింగ్ అరాచ్చికి దుషన్ ఇషార హేమంత
పుట్టిన తేదీ (1994-05-24) 1994 మే 24 (వయసు 30)
కొలంబో, శ్రీలంక
ఎత్తు5 అ. 9 అం. (1.75 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్‌బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 208)2023 జూన్ 2 - Afghanistan తో
చివరి వన్‌డే2023 జూలై 7 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–2014కోల్ట్స్ క్రికెట్ క్లబ్
2014–2016Saracens Sports Club
2016–2022Badureliya Sports Club
2017–2019Sri Lanka Navy Sports Club
2020–2022Burgher Recreation Club
2022–presentDambulla Aura
2024Sylhet Strikers
మూలం: Cricinfo, 14 March 2018

దేశీయ క్రికెట్

మార్చు

2014 ఫిబ్రవరి 21న 2013–14 ప్రీమియర్ ట్రోఫీలో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[3] 2014, ఫిబ్రవరి 25న కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున హాంకాంగ్‌పై ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] 2014–15 ప్రీమియర్ లిమిటెడ్ ఓవర్స్ టోర్నమెంట్‌లో కొలంబో క్రికెట్ క్లబ్‌పై 2014, డిసెంబరు 13న సారాసెన్స్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[5]

2017 ఫిబ్రవరి 2న, లంక క్రికెట్ క్లబ్‌పై 62 పరుగులకు 7 వికెట్లతో తన తొలి ఫస్ట్-క్లాస్ ఐదు వికెట్లు సాధించాడు.[6] 2017, డిసెంబరు 29న, పాణదుర స్పోర్ట్స్ క్లబ్‌పై 193 పరుగులు చేసి ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని కూడా సాధించాడు.[7]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2023 జనవరిలో, ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన వారి ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ సిరీస్ కోసం శ్రీలంక ఎ జట్టులో ఎంపికయ్యాడు. 2023, ఫిబ్రవరి 18న, ఐదు వికెట్లు సాధించాడు,[8] రెండవ అనధికారిక వన్డేలో ఇంగ్లాండ్ లయన్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు.[9][10] లిస్ట్ ఎ సిరీస్‌లో 11.45 సగటుతో పదకొండు వికెట్లు తీశాడు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.[11][12] 2023లో, ఇంగ్లండ్ లయన్స్‌పై తన ఆటతీరుతో, ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ జట్టుకు హేమంత తన తొలి కాల్-అప్ పొందాడు.[13]

2023 మే లో, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[14][15] 2023, జూన్ 2న సిరీస్‌లోని మొదటి వన్డేతో తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[16]

మూలాలు

మార్చు
  1. "Dushan Hemantha". ESPN Cricinfo. Retrieved 14 March 2018.
  2. "Teams which Dushan Hemantha played for". CricketArchive. Retrieved 2023-04-17.
  3. "Group B, Premier League Tournament at Katunayake, Feb 21-22 2014". ESPN Cricinfo. Retrieved 14 March 2018.
  4. "Hong Kong vs Colts Scorecard 2013/14 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
  5. "Saracens vs Col CC Scorecard 2014/15 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
  6. "Sri Lanka Navy Sports Club v Lankan Cricket Club, Premier League Tournament Tier B 2017/18". CricketArchive. Retrieved 2023-04-17.
  7. "Sri Lanka Navy v Panadura, 2017–18 Premier League Tournament Tier B". CricketArchive. Retrieved 2023-04-17.
  8. "Hemantha makes a mark for himself | Daily FT". Daily FT (in English). Retrieved 2023-04-17.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  9. "Hemantha bags five, as Sri Lanka 'A' level series". Print Edition - The Sunday Times, Sri Lanka. Retrieved 2023-04-17.
  10. "Dushan Hemantha too much for England Lions". Sunday Observer (in ఇంగ్లీష్). 2023-02-18. Retrieved 2023-05-21.
  11. "Best Bowler Dushan Hemantha Says: 'Flipper and leg breaks undid England Lions'". Sri Lanka Cricket (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-17.
  12. "Sri Lanka drop Dickwella, recall Embuldeniya for Ireland Tests". ESPNcricinfo. Retrieved 13 April 2023.
  13. "Test cap for Dushan Hemantha against Ireland?". Print Edition - The Sunday Times, Sri Lanka. Retrieved 2023-04-17.
  14. "Sri Lanka recall Dimuth Karunaratne for Afghanistan ODIs". Cricbuzz. Retrieved 30 May 2023.
  15. "Rising pacer in line for ODI debut as Sri Lanka announce squad for Afghanistan series". International Cricket Council. Retrieved 30 May 2023.
  16. "1st ODI, Hambantota, June 02, 2023, Afghanistan tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2 June 2023.

బాహ్య లింకులు

మార్చు