దూద్ కోషి

దూద్ కోషి లేదా దూద్ కాశీ తూర్పు నేపాల్ లోని నది.

దూద్ కోషి లేదా దూద్ కాశీ తూర్పు నేపాల్ లోని నది. ఈ నది ప్రసిద్ధ ఎవరెస్ట్ పర్వతంతో సహా ఎత్తైన హిమాలయాల నుండి ఉద్భవించి నేపాల్ లోని సోలు-ఖుంబు ప్రాంతం గుండా ప్రవహిస్తుంది.[1] ఈ నది ప్రవహించేటపుడు ఎవరెస్టు రాళ్ల ద్వారా వచ్చిన  కణాల కారణంగా నీరు  పాల రంగుని పోలి ఉంటుంది. వేసవి కాలంలో  హిమనీనాదాలు కరిగి నీరు అత్యధికంగా ఉన్నప్పుడు నదిలో నీరు ఎక్కువ తెల్లగా ఉంటుంది.[2] ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని దాటి ప్రవహిస్తుంది. ఇది గోక్యో సరస్సుకు తూర్పున ప్రారంభమై దక్షిణాన నామ్చే బజార్ వరకు ప్రవహిస్తుంది. పశ్చిమాన బచేంద్రి నేషనల్ పార్క్ గుండా వెళుతూ, దక్షిణం వైపు ఉన్న హర్కాపూర్ వరకు కొనసాగుతుంది, అక్కడ సూర్య కోషి నదిలో కలుస్తుంది.[3]

దూద్ కోషి
స్థానం
దేశంనేపాల్
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంగోక్యో సరస్సుకు తూర్పున
 • అక్షాంశరేఖాంశాలు27°56′05″N 86°42′34″E / 27.9347°N 86.7094°E / 27.9347; 86.7094
సముద్రాన్ని చేరే ప్రదేశం 
 • స్థానం
సూర్య కోషి
 • అక్షాంశరేఖాంశాలు
27°08′58″N 86°26′00″E / 27.1494°N 86.4333°E / 27.1494; 86.4333
పరీవాహక ప్రాంత లక్షణాలు
River systemకోషి నది
ఉపనదులు 
 • ఎడమఇమ్జా ఖోలా
 • కుడిభోటే కోషి

కోషి నది వ్యవస్థ

మార్చు

కోషి నది లేదా సప్త్ కోషి తూర్పు దిశలో ప్రవహిస్తుంది. తూర్పు-మధ్య నేపాల్‌లో ఏడు నదుల సంగమం కారణంగా దీనిని సప్తకోషి అని పిలుస్తారు. సప్తకోషి నదీ వ్యవస్థలోని ప్రధాన నదులు సూర్య కోషి, ఇంద్రావతి నది, తమ కోషి, దూద్ కోషి, అరుణ్ నది, టామోర్ నది, లిఖు నది. 

ఉపనదులు

మార్చు
  • ఇమ్జా ఖోలా
  • భోటే కోషి

షెర్పా సంస్కృతి, జీవనోపాధి

మార్చు

ఎవరెస్ట్ ప్రాంతంలో నివసించే షెర్పా ప్రజలకు ఇది పవిత్రమైన నది, వారికీ జీవనాధారం కూడ. ఈ నది నీటిని తాగునీరు, పొలాల నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తికి వాడుతారు.

జీవావరణం

మార్చు

లోయలు, అడవులలో అనేక పక్షి జాతులు, సీతాకోకచిలుకలు, కస్తూరి జింక, హిమాలయన్ తహర్ వంటి క్షీరదాలతో సహా వివిధ వృక్ష, జంతు జాతులకు ఈ నది నిలయంగా ఉంది.

రాఫ్టింగ్, కయాకింగ్

మార్చు

ఇక్కడ  రాఫ్టింగ్, కయాకింగ్ వంటి నీటి ఆధారిత సాహస కార్యకలాపాలు అప్పుడప్పుడు జరుగుతాయి. ఈ నది విపరీతమైన నీటితో ఉంటుంది, సాధారణంగా వాటర్‌స్పోర్ట్స్ కోసం ఉపయోగించబడదు. అవరోహణ 5% కంటే ఎక్కువగా ఉంటుంది.

ఆస్ట్రియన్ పాడ్లర్లు ఫ్రాన్స్‌లో 3200 మీటర్ల ఎత్తు నుండి దిగి ప్రపంచ రికార్డు సృష్టించినప్పుడు అది ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్ల దృష్టికి వచ్చింది. చెకోస్లోవేకియా అథ్లెట్లు సవాలును స్వీకరించడానికి అంగీకరించారు. దూద్ కోషి నది యాత్ర ఏప్రిల్ 1న పెరిచే దగ్గర 4243కిమీ వద్ద ప్రారంభించి, సూర్య కోషి వరకు 126 కి.మీ. ప్రయాణించి అదే సంవత్సరం ఆగస్టులో, యాత్ర సురక్షితంగా పూర్తి చేసారు.[4]

మూలాలు

మార్చు
  1. "Energy officials lean towards Dudh Koshi Hydroelectric Project". kathmandupost.com. Retrieved 2023-06-25.
  2. "Dudh Kosi River Expedition: Dudh Koshi River Nepal, Upper Dudh Koshi Expedition, River of Everest, River Expedition on the Himalayas, Kayak the Dudh Kosi, Raft down Dudh Koshi River Nepal". www.raftnepal.com. Retrieved 2023-06-25.
  3. Negi, Sharad Singh (1991). Himalayan Rivers, Lakes, and Glaciers. Indus Publishing. ISBN 978-81-85182-61-2.
  4. Zapomenuté výpravy: Expedice Dudh-Kosi
"https://te.wikipedia.org/w/index.php?title=దూద్_కోషి&oldid=3922046" నుండి వెలికితీశారు