దేవల మహర్షి
దేవల మహర్షి హిందూమతం లోని, ఋషులు యందు ఒక గొప్ప ఋషి.
జన్మవృత్తాంతము
మార్చు- దేవ మనువు నకు ప్రజాపతి అను కుమారుడు కలిగెను. ఈ ప్రజా పతికి ధూమ్ర, బ్రహ్మవిద్య, మనస్విని, రతి, శ్వాస, శాండిలి, ప్రభాత అను ఏడుగురు భార్యల వలన ధరుడు, ధృవుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్ని, ప్రత్యూషుడు, ప్రభానుడు అను ఎనమండుగురు కుమారులు కలిగారు. ఈ ఎనమండుగురు పుత్రులు తదుపరి అష్టవసువులుగా ప్రసిద్ధి చెందినారు.
- ప్రజాపతి, ప్రభాత లకు కలిగిన పుత్రుడు ప్రత్యూషుడు. ప్రత్యూషునకు వివాహము చేసుకొనిన తదుపరి ఇరువురు కుమారులను పొందెను. అందులో పెద్దవాడు దేవలుడు, రెండవ సంతానము విభువు.
- దేవలుడు శరీరము నలుపు వర్ణము కలిగి ఉండుటచే అతనికి అసితుడు అని పేరు కూడా తదుపరి వచ్చింది.
- ఋక్సంహితను దర్శించాడు.
మహాభారతం
మార్చుఆవిధముగా తపస్సు చేస్తున్నధృతరాష్ట్రుడి వద్దకు నారదుడు, దేవలుడు, పర్వతుడు, మౌంజాయనుడు అను మహర్షులు వచ్చారు. వారితో శతాయువు కూడా వచ్చాడు. కుంతి వారికి అతిథిసత్కారాలు చేసింది. తరువాత వారు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళారు. ధృతరాష్ట్రుడు వారికి సంభ్రమంతో నమస్కరించాడు. వారు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించాడు.[1]
దేవల మహర్షి శాపం
మార్చుయోऽసౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధృక్
ముక్తో దేవలశాపేన హూహూర్గన్ధర్వసత్తమః
దేవల మహర్షి శాపం వలన హుహు అనే పేరు గల గంధర్వుడు మొసలిగా పుట్టాడు.[2]
ప్రస్తావన
మార్చుదేవల మహర్షి నారదుడు, వ్యాసుడు వంటి వారి ద్వారా ఒక గొప్ప అధికారికంగా గుర్తించబడటమే కాకుండా, భగవద్గీతలో అర్జునుడు ద్వారా కూడా దేవల మహర్షి పేరు పేర్కొన బడింది.[3]
సంప్రదాయం ప్రకారం, దేవల మహర్షి పత్తి వస్త్రం నేత నేసిన మొదటి వ్యక్తి, దైవము శివుడుకు ఇచ్చిన వాడు. అప్పటి వరకు ఎవరయిననూ సరే ఈ సమయంలో వరకు వస్త్రముగా జంతు చర్మం ఉపయోగిస్తూ ఉండే వారు. దేవల మహర్షి ఒకనాడు మహారాజుకు వస్త్రం తీసుకొని వెళ్ళుతున్నప్పుడు, రాక్షసులు గుంపు అతనిని దాడి చేసేందుకు వచ్చింది.
దేవాంగ పురాణం
మార్చుదేవాంగ పురాణంలో, దేవాంగ కమ్యూనిటీ యొక్క కుల పురాణం ఉంది. ఇది వారి అవతారం మనిషి దేవల మహర్షి యొక్క జీవితం, అతని ఏడు అవతారాల దేవత (చౌదేద్వారి) తో అనుసరణలు, ఆచారాలు, వ్యవహారాలు (కస్టమ్స్) ; దేవాంగ విభాగం (కమ్యూనిటీ) దక్షిణ భారత రాష్ట్రాల్లో నివసించే వారు కూడా సంప్రదాయకంగా పత్తి నేత వస్త్రం, వస్త్రం వ్యాపారముల్లో నిమగ్నమై ఉన్నారు. ఉత్తర భారత రాష్ట్రాలలో కూడా వారు విడివడిగా ఉన్నారు.[4]
మూలాలు
మార్చు- ↑ మహాభారతం, ఆశ్రమవాస పర్వము - ద్వితీయాశ్వాసము
- ↑ శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం నాలగవ అధ్యాయం
- ↑ భగవద్గీత (10.13)
- ↑ https://en.wikipedia.org/wiki/Devanga_Purana